నోబెల్ శాంతి పురస్కార గ్రహీత నర్గెస్ మొహమ్మదిని ఇరాన్ పోలీసులు అరెస్టు చేయడంపై నార్వే నోబెల్ కమిటీ తీవ్రంగా ఖండించింది. దీనిని క్రూరమైన అరెస్ట్‌గా పేర్కొంది. మొహమ్మదిని ఎక్కడో ఉందో స్పష్టం చేయాలని,భద్రతను కూడా నిర్ధారించాలని తెలిపింది. అంతేకాకుండా ఎలాంటి షరతులు లేకుండా ఆమెను విడుదల చేయాలని నోబెల్ కమిటీ డిమాండ్ చేసింది 2023 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన నర్గెస్ మొహమ్మదిని ఇరాన్లో మానవ హక్కులు, భావప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య భాగస్వామ్యం కోసం నిరంతరం పోరాడుతున్న వ్యక్తి.

