జెన్-జీ దెబ్బకు మరో ప్రభుత్వం కూలిపోయింది. అవినీతికి వ్యతిరేకంగా యువత సాగించిన ఆందోళనలతో తన ప్రభుత్వం రాజీనామా చేస్తున్నట్లు బల్గేరియా ప్రధాని రాసెన్ జెలియాజ్‌కోవ్ గురువారం ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాకముందే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసెన్ ప్రభుత్వ అవినీతిని నిరసిస్తూ వేలాదిమంది యువజనులు బుధవారం బల్గేరియా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ప్రభుత్వం రూపొందించిన 2026 ముసాయిదా బడ్జెట్‌పై మండిపడిన యువత ఇది అవినీతిని కప్పిపుచ్చేందుకు తయారుచేసిన బడ్జెట్‌గా అభివర్ణిస్తూ రోడ్లపైకి వచ్చింది.

