loader

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్..విమర్శల వెల్లువ

అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ కాష్ పటేల్ తీరుపై మరోసారి విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. కాష్ పటేల్, తన ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ తో కలిసి కన్జర్వేటివ్ పాడ్ కాస్టర్ కేటీ మిల్లర్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒకవైపు బ్రౌన్స్ యూనివర్సి టీలో కాల్పులకు పాల్పడిన దుండగుడి కోసం స్థానిక పోలీసులు గాలిస్తున్న సమయంలో ఆయన పాడ్ కాస్టర్ లో పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశం తీవ్రమైన నేరంతో పోరాడుతుంటే ఆయనకు సమయం […]

వందేమాతరం ఆలపించిన ఇథియోపియన్‌ గాయకులు.. పులకరించిపోయిన ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. జోర్డాన్‌ పర్యటన ముగించుకొని ఇథియోపియా వెళ్లారు. 15 ఏళ్ల తర్వాత తొలిసారి ఇథియోపియాను సందర్శించిన భారత ప్రధానికి అరుదైన స్వాగతం లభించింది. మోదీ గౌరవార్థం ఆదేశ ప్రధాన మంత్రి అబీ అహ్మద్‌ నిర్వహించిన విందులో ఇథియోపియా గాయకులు వందేమాతరం ఆలపించారు. ఈ గీతంతో మోదీకి స్వాగతం పలికారు. దీంతో ప్రధాని పులకరించిపోయారు. చప్పట్లతో సంతోషం వ్యక్తం చేశారు.

ఆస్ట్రేలియా ఉగ్రదాడి టెర్రరిస్ట్‌ సాజిద్‌కు హైదరాబాద్‌ లింక్స్‌..

ఆస్ట్రేలియాలోని బౌండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌కు హైదరాబాద్‌తో సంబంధాలు ఉన్నట్లుగా ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. అతని దగ్గర హైదరాబాద్‌ పాస్‌పోర్టు లభ్యమైంది. సాజిద్‌ అక్రమ్‌ హైదరాబాద్‌లోనే బీకామ్‌ పూర్తి చేశాడని డీజీపీ శివధర్‌ రెడ్డి తెలిపారు. స్టూడెంట్‌ వీసాపై 1998 నవంబర్‌లో ఆస్ట్రేలియాకు వెళ్లాడని పేర్కొన్నారు. అక్కడే యూరప్‌లోని ఇటలీకి చెందిన వెనీరా గ్రాసోను వివాహం చేసుకున్నాడని పేర్కొన్నారు.

జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి

జోర్డాన్ లో మోదీ సందడి.. యువరాజుతో కారులో షికారు ప్రధాని నరేంద్ర మోదీ జోర్డాన్ లో కారులో తిరుగుతూ సందడి చేశారు. జోర్డాన్ యువరాజు ప్రిన్స్ అల్-హుస్సేన్ బిన్ అబ్దుల్లా-2తో కలిసి సందడి చేశారు. యువరాజుతో కలిసి మోదీ కారులో జర్డాన్ మ్యూజియంకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇవి వైరల్ గా మారాయి. బీఎండబ్ల్యూ కారు లోపల ముచ్చటించుకుంటూ వెళ్తున్నట్లుగా ఫొటోల్లో కనిపించింది.

జోర్డాన్‌- భారత్ పాత సంబంధాలను పునరుద్ధరించుకోవాలి: ప్రధాని మోదీ

ప్రపంచానికి కొత్త వృద్ధి ఇంజిన్, సరఫరా గొలుసు అవసరం ఉందని ఈ డిమాండ్‌ను తీర్చడంలో భారత్‌, జోర్డాన్‌లు కలిసి కీలక పాత్ర పోషించగలవని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని మూడో దేశాల పర్యటనలో భాగంగా జోర్డాన్‌లో పర్యటిస్తున్న మోదీ అమ్మాన్‌లో జరిగిన భారత్- జోర్డాన్ బిజినెస్ ఫోరమ్‌లో పాల్గొన్నారు. జోర్డాన్‌తో దీర్ఘకాలిక సంబంధాన్ని నిర్మించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఒకప్పుడు గుజరాత్ నుంచి పెట్రా మీదుగా ఐరోపాకు వాణిజ్యం జరిగేదని ప్రధాని […]

పేక మెడలా కూలీన 79 అడుగుల స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం..

దక్షిణ బ్రెజిల్‌ను ఒక శక్తివంతమైన తుఫాను అతలాకుతలం చేస్తుంది. ఈ క్రమంలో బలమైన తుపాను గాలుల ప్రభావంతో.. రియో ​​గ్రాండే డో సుల్ రాష్ట్రంలోని గ్వైబాలోని హవాన్ మెగాస్టోర్ వెలుపల ఏర్పాటు చేసిన 24 మీటర్ల పొడవు (79 అడుగుల) స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఒక్కసారిగా కుప్పకూలీపోయింది. గత కొన్నిరోజులుగా బ్రెజిల్ పౌర రక్షణ సంస్థ, డెఫెసా సివిల్, ఈ ప్రాంతంలో గత కొన్నిరోజులుగా బలమైన గాలులు వీస్తున్నాయి. గత కొన్నిరోజులుగా బ్రెజిత్ తో పాటు పలునగరాల్లో […]

ల్యాండింగ్‌ అవుతుండగా కుప్పకూలిన విమానం.. ఏడుగురు దుర్మరణం..

మెక్సికోలో (Mexico) ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు విమానం టోలుకా విమానాశ్రయంలో (Toluca Airport) అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో మంటలు చెలరేగడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు విమానం మెక్సికో పసిఫిక్ తీరంలోని అకాపుల్కో (Acapulco) నుంచి బయలుదేరిందన్నారు. ప్రమాద సమయంలో విమానంలో ఎనిమిది మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారని వెల్లడించారు.

భారత్‌లో వీసా సర్వీస్ ఫీజును పెంచిన న్యూజిలాండ్

వీసా దరఖాస్తు కేంద్రాల్లో వసూలు చేసే సర్వీస్ ఫీజును జనవరి 1 నుంచి కొన్ని కేంద్రాల్లో పెంచుతున్నట్టు న్యూజిలాండ్ ప్రకటించింది. భారత్ సహా 25 దేశాల్లో ఈ పెంపు అమలు లోకి రానుంది. నిర్వహణ పరమైన వ్యయాలు, ద్రవ్యోల్బణం కారణంగా ఈ నిర్ణయం తీసుకోవలని వచ్చిందని న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. వీసా అప్లికేషన్ ఫీజుకు వీసా దరఖాస్తు కేంద్రాలు వసూలు చేసే ఫీజు అదనమని స్పష్టం చేసింది. దరఖాస్తులు సమర్పించే ముందు దరఖాస్తుదారులు ఫీజు వివరాలను […]

మూడు దేశాల పర్యటనలో ప్రధాని మోదీ.. జోర్డాన్‌లో ఘన స్వాగతం

ప్రధాని నరేంద్రమోదీ మూడు దేశాల పర్యటన సోమవారం మొదలైంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ముందుగా జోర్డాన్‌ లోని అమ్మాన్‌ కు చేరుకున్నారు. అమ్మాన్‌ విమానాశ్రయంలో జోర్డాన్ ప్రధాని జాఫర్ హసన్ స్వయంగా ప్రధాని మోదీకి స్వాగతం పలికి ప్రత్యేక గౌరవం కల్పించారు. భారత్-జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ పర్యటన చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది. 37 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధాని జోర్డాన్‌లో పూర్తిస్థాయి ద్వైపాక్షిక […]

సిడ్నీ మృతులకు నివాళులు

ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన ప్రముఖ బాండి బీచ్‌లో హనుక్కా ఉత్సవం  జరుపుకుంటున్న యూదు సమాజం పై జరిగిన ఉగ్రదాడిలో 15 మంది మరణించారు, ఈ దాడిని ఆస్ట్రేలియా ప్రధాని యాంథనీ అల్బనీజ్ “దుష్ట యాంటీసెమిటిజం ఉగ్రవాదం”గా అభివర్ణించారు. యూదు సమాజం “షాటర్డ్” అయిందని, ఈ దాడి వారి భయాలను నిజం చేసిందని నాయకులు తెలిపారు. ప్రపంచ నాయకులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON