loader

బంగ్లాదేశ్‌లో హిందువులపై ఆగని హింస..వార్నింగ్ ఇచ్చిన మోదీ సర్కార్

తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు సహా మైనారిటీలపై 2,900 కంటే ఎక్కువ హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి.ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఇవి కేవలం మీడియా సృష్టి లేదా రాజకీయ హింస కాదని, ఇవి మైనారిటీలపై జరుగుతున్న వ్యవస్థీకృత దాడులని జైస్వాల్ స్పష్టం చేశారు. పొరుగు దేశంలో మైనారిటీలపై జరుగుతున్న నిరంతర శత్రుత్వం చాలా ఆందోళనకరమైన విషయమని, తక్షణమే శాంతిభద్రతలను పునరుద్ధరించాలని భారతదేశం బంగ్లాదేశ్‌కు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది.

నైజీరియాలో అమెరికా సైన్యం భీకర దాడులు..

నైజీరియాలో ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాద స్థావరాలపై అగ్రరాజ్యం అమెరికా సైన్యం దాడులతో విరుచుకుపడింది <span;>ఆఫ్రికా దేశమైన నైజీరియాలో క్రైస్తవులపై ఐసిస్ దాడులను ఆపాలని అమెరికా అధినేత ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందిే అమాయక క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడుతున్న ఉగ్రవాదులపై ఈ చర్యలు తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. నైజీరియా అభ్యర్థన మేరకు ఈ దాడులు జరిగాయని, పలువురు ఉగ్రవాదులు హతమైనట్లు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది.

క్రిస్మస్‌ వేళ.. కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు..

క్రిస్మస్‌ వేళ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. తుఫాను కారణంగా బలమైన గాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి  అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బురద పేరుకుపోయింది. వాహనాలు, ఇండ్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో మట్టి చరియలు విరిగిపడటంతో రహదారులు మూసికుపోయాయి. కీలక హైవేలను అధికారులు మూసివేశారు. లాస్ ఏంజిల్స్ కౌంటీలోని కొన్ని ప్రాంతాల్లో 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వరదలకు […]

600 అడుగుల లోతులో పడిపోయిన బస్సు.. 10 మంది మృతి.. క్రిస్మస్ వేళ విషాదం

క్రిస్మస్ వేళ మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెరక్రూజ్ రాష్ట్రంలోని జొంటోకొమట్లాన్ పట్టణంలో బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 32 మంది గాయపడ్డారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు స్వగ్రామాలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.మలుపులతో కూడిన ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న బస్సు నియంత్రణ కోల్పోవడంతో 600 అడుగులకు పైగా లోతులో లోయలో పడింది.

కెనడాలో దారుణం.. భారతీయ విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు

కెనడాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులపై దాడులు ఆందోళనకరంగా మారుతున్నాయి. తాజాగా టొరంటోలో మరో భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. 20 ఏళ్ల శివాంక్ అవస్థీ టొరంటో విశ్వవిద్యాలయం సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘాతుకం జరిగింది. దుండగుడు అతి సమీపం నుంచి శివాంక్‌పై కాల్పులు జరిపాడు. హిమాన్షి ఖురానా అనే మరో భారతీయ విద్యార్థిని హత్య జరిగిన కొద్దిరోజుల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం అక్కడి ప్రవాస భారతీయులను, విద్యార్థి లోకాన్ని […]

‘తప్పుడు కథనాలతో విభేదాలను సృష్టించే ప్రయత్నం’- అమెరికా నివేదికపై చైనా ఆగ్రహం

భారత సంబంధాలపై అమెరికా చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది చైనా. భారత్​తో తగ్గిన సరిహద్దు ఉద్రిక్తతలను ఉపయోగించి అమెరికా-ఇండియా సంబంధాలను దెబ్బతీస్తోందని పెంటగాన్ విడుదల చేసిన నివేదికను తప్పుబట్టింది. పాకిస్థాన్‌తో చైనా రక్షణ సంబంధాలను మరింతగా పెంచుకుంటోందని తప్పుడు కథనాలతో విభేదాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని డ్రాగన్ ఆరోపించింది. అమెరికా తన సైనిక ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఒక సాకును కనుగొనడం లక్ష్యంగా పెట్టుకుంది” అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ అన్నారు.

న్యూట్రిషన్ అడ్వైజరీ కమిటీకి భారత సంతతి డాక్టర్ నియామకం

టెక్సాస్ న్యూట్రిషన్ అడ్వైజరీ కమిటీకి భారత సంతతి ఫిజీషియన్ పద్మజా పటేల్‌ను గవర్నర్ గ్రెగ్ అబోట్ నియమించారు. 2029 సెప్టెంబరు 1 వరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. భారత్ లోని బరోడా మెడికల్ కాలేజీ నుంచి మెడికల్ డిగ్రీ పొందిన పద్మజా పటేల్ అమెరికాలో తన శిక్షణ పూర్తి చేశారు. నుడ్జ్ హెల్త్ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా, అమెరికన్ కాలేజీ ఆఫ్ లైఫ్‌స్టైల్ మెడిసిన్ హెల్త్‌సిటీ మిడ్‌ల్యాండ్, అమెరికన్ మెడికల్ అసోసియేషన్, అమెరికన్ కాలేజీ ఆఫ్ […]

క్రిస్మస్ నాడు ఉక్రెయిన్ పై ఆగని రష్యా బాంబుదాడి

క్రిస్మస్ నాడు కూడా రష్యా ఉక్రెయిన్ పై బాంబులతో విరుచుకుపడడంలో రెండు దేశాలలో గందరగోళ పరిస్థితి నెలకొంది. క్రిస్మస్ రోజు సాయంత్రం ఉక్రెయిన్ ప్రజలను ఉద్దేశించి ప్రెసిడెంట్ జెలెస్ స్కీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చనిపోవాలని శాపనార్థాలు పెట్టారు.క్రిస్మస్ ఈవ్ ముందు మంగళవారం ఉక్రెయిన్ లో రష్యా భారీ ఎత్తున క్షిపణుల దాడి చేసింది.  దాడులలో ముగ్గురు చనిపోయారు. ఉక్రెయిన్ లోని అతి పెద్ద విద్యుత్ కేంద్రం దెబ్బతింది. ఈ నేపథ్యంలో జెలెన్ స్కీ తన […]

బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తిని కొట్టి చంపిన జనం.. అతడిపై దోపిడీ ఆరోపణలు

అల్లర్లతో రగులుతున్న బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తిని కొట్టి చంపారు. అతడు దోపిడీలకు పాల్పడుతున్నట్లు ఆ దేశ పోలీసులు ఆరోపించారు. బంగ్లాదేశ్‌లోని రాజ్‌బరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పంగ్షా గ్రామానికి చెందిన 29 ఏళ్ల అమృత్ మండల్ డిసెంబర్‌ 24న రాత్రి 11 గంటల సమయంలో డబ్బుల వసూలు కోసం గ్రామానికి చెందిన షాహిదుల్ ఇస్లాం ఇంటికి అనుచరులతో కలిసి సామ్రాట్ వెళ్లినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. ఆ కుటుంబం దొంగలని అరవడంతో స్థానికులు […]

అంతరిక్షంలో క్రిస్మస్ వేడుకలు

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఐతే అంతరిక్షంలో క్రిస్మస్ వేడుకలను ఎప్పుడైనా చూశారా? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆస్ట్రోనాట్స్ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఆ వీడియోను నాసా విడుదల చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON