loader

విధ్వంసానికి కాదు.. అభివృద్ధికి పెట్టుబడులు పెట్టండి: యుఎన్ చీఫ్

ప్రపంచ దేశాధినేతలు విధ్వంసానికి కాకుండా అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ తన నూతన సంవత్సర సందేశంలో సూచించారు. కొత్త సంవత్సరం లోకి అడుగుపెడుతున్న మనం ప్రస్తుతం గందరగోళం, అనిశ్చితి పరిస్థితుల్లో ఉన్నామని ప్రపంచంలో నాలుగోవంతు జనాభా జీవితాలు సంక్షోభంలో చిక్కుకున్నాయని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా 200 మిలియన్ మంది కన్నా ఎక్కువ మందికి మానవతా సాయం అవసరమని, దాదాపు 120 మిలియన్ మంది యుద్ధాలు, సంక్షోభం, ప్రకృతి వైపరీత్యాలు, లేదా […]

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా( 80) కన్ను మూశారు. ఢాకా లోని ఎవర్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఖలీదా తుదిశ్వాస విడిచారు. 1945 ఆగస్టు 15న బంగాల్ జల్ పాయి గుడిలో జన్మించారు. బంగ్లాదేశ్ చరిత్రలో మొదటి మహిళా ప్రధానిగా ఉన్నారు. మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1981లో రెహమాన్ హత్య తర్వాత రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1981 నుంచి బంగ్లాదేశ్ నేషలలిస్ట్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగారు. 1982లో సైనిక తిరుగుబాటును అణచివేసి ప్రజాస్వామ్యం […]

హెలికాప్టర్లు ఢీ: ఒకరు మృతి

రెండు హెలికాప్టర్లు ఢీకొన్న సంఘటన అమెరికాలోని న్యూజెర్సీలో జరిగింది. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు

అమెరికాలో మంచు తుఫాన్‌ బీభత్సం

శక్తిమంతమైన మంచు తుఫాన్‌ డెవిన్‌ అమెరికాలో బీభత్సం సృష్టించింది. దీని ప్రభావం శనివారం దాదాపు 9,000 విమానాలపై పడింది. వీటిలో కొన్ని సర్వీసులు రద్దు కాగా, మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. శుక్ర-శనివారాల మధ్య దాదాపు 2,700 విమానాలు రద్దయ్యాయి. వేలాది విమానాలు ఆలస్యమయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 1,802 విమానాలు రద్దు కాగా, 22,349 విమానాలు ఆలస్యమయ్యాయి. గత మూడేండ్లలో ఈ స్థాయిలో మంచుకురవడం ఇదే తొలిసారి.

క్వీన్స్ కామన్వెల్త్ ఎస్సే కాంపిటీషన్‌లో తెలుగు బాలికకు అరుదైన గౌరవం

ప్రపంచవ్యాప్తంగా పేరొందిన క్వీన్స్ కామన్వెల్త్ ఎస్సే కాంపిటీషన్ (QCEC)–2025లో విజేతలలో ఒకరిగా నిలిచి తెలుగు సమాజానికి గర్వకారణంగా మారింది ఆచంట లక్ష్మీ మనోజ్ఞ. చిన్న వయసులోనే వసుధైవ కుటుంబకమ్” అనే సార్వకాలిక–సార్వజనీన దృక్పథాన్ని తన కవిత్వంలో ప్రతిబింబిస్తూ, వలసవాద ధోరణులను ప్రశ్నించే సాహిత్య దృష్టిని ఆవిష్కరించడం ఆమె ప్రతిభకు నిదర్శనం. సింగపూర్‌లోని Crescent Girls’ Schoolలో సెకండరీ–2 చదువుతున్న మనోజ్ఞ.. చదువుతో పాటు సంగీతం, సాహిత్యం, పియానో, నృత్యం వంటి అనేక రంగాల్లో తన ప్రజ్ఞను వికసింపజేస్తోంది.

‘అవతార్ 3’ ఫ్లాప్! ‘అవతార్ 4’ మూవీని ఆపేస్తున్న జేమ్స్ కామెరాన్.

జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవతార్’, 2009లో ప్రపంచాన్ని విస్తుపోయేలా చేసింది. 2022లో ‘అవతార్ 2’ మూవీ వచ్చినా ఆదరించిన అభిమానులు, ‘అవతార్ 3’ మూవీని మాత్రం తిరస్కరించారు.. డిసెంబర్ 5న భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ‘అవతార్ 3’ మూవీ, బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రిజల్ట్ రాబట్టలేకపోయింది. దీంతో ‘అవతార్’ సిరీస్‌లో భాగంగా రావాల్సిన ‘అవతార్ 4’, ‘అవతార్ 5’ సినిమాలను నిలిపివేయాలని డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ ఎంటర్‌టైన్‌మెంట్ వీక్లీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.

ట్రంప్‌తో భేటీకి ముందు నాటో, ఈయూ నేతలతో జెలెన్‌స్కీ కీలక చర్చలు

శాంతి చర్చలపై మాట్లాడేందుకు అదివారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జెలెన్‌స్కీ భేటీ కానున్న విషయం తెలిసిందే. ఫ్లోరిడాలో జరగనున్న కీలక సమావేశానికి ముందు మిత్ర దేశాలైలన యూరోపియన్ యూనియన్ నేతలు, నాటో సభ్యులతో జెలెన్‌స్కీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం కెనడాలో పర్యటిస్తున్న జెలెన్‌స్కీ అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అనుసరిస్తున్న దౌత్య మార్గాలు, రాబోయే రోజుల్లో తాము అనుసరించాల్సిన ప్రాధాన్యతలపై నేతలతో చర్చించారు.

ఉక్రెయిన్​పై భారీ క్షిపణి, డ్రోన్ దాడులు- భేటీకి ముందురోజే రష్యా ఉగ్రదాడి

ఉక్రెయిన్ రాజధాని కీవ్ మరోసారి రష్యా దాడులతో దద్దరిల్లింది. స్థానిక కాలమానం ప్రకారం డిసెంబర్ 26వ తేదీన అర్ధరాత్రి సమయంలో  భారీ స్థాయిలో దాడి జరిగింది. కీవ్ ఇండిపెండెంట్ కథనం ప్రకారం, రష్యా ఈ దాడుల్లో అత్యాధునిక ఆయుధాలను వినియోగించింది. కీవ్‌పై కింజాల్ హైపర్సోనిక్ క్షిపణులు, ఇస్కాండర్ బాలిస్టిక్ మిసైళ్లు, కాలిబర్ క్రూయిజ్ మిసైళ్లు ప్రయోగించింది. అదే సమయంలో అనేక డ్రోన్లను కూడా గగనతలంలోకి పంపింది. డొనాల్డ్ ట్రంప్, జెలెన్‌స్కీ భేటీకి ఒకరోజు ముందే ఈ దాడి […]

‘హెచ్1బీ వీసా ఇంటర్వ్యూల ఆకస్మిక రద్దు సరికాదు’- అమెరికా నిర్ణయంపై భారత్ ఆందోళన

ముందస్తుగా షెడ్యూల్ చేసిన భారతీయుల హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలను అమెరికా అకస్మాత్తుగా రద్దు చేయడంపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈవిషయాన్ని అమెరికాకు తెలియజేసినట్లు శుక్రవారం వెల్లడించింది.  వేలాది మంది భారతీయ దరఖాస్తుదారులకు డిసెంబరు 15 నుంచి నిర్వహించాల్సిన  హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలను అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ఇటీవలే కొన్ని నెలల పాటు వాయిదావేసింది. మా సంప్రదింపులు కొనసాగుతున్నాయి’అని శుక్రవారం రోజు  భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

ఎయిర్‌లైన్స్‌ను విక్రయించిన పాకిస్తాన్.. రూ. 4,300 కోట్లకు

పాకిస్తాన్ ‌ జాతీయ విమానయాన సంస్థ.. పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ప్రైవేటీకరణ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. ఆరిఫ్ హబీబ్ గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఈ బిడ్డింగ్‌లో విజేతగా నిలిచి.. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ను దక్కించుకుంది. ఆరిఫ్ హబీబ్ గ్రూప్ 13,500 కోట్ల పాకిస్థానీ రూపాయలకు (సుమారు రూ. 4,320 కోట్లు) బిడ్‌ను దక్కించుకుంది. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ తీవ్ర నష్టాల్లో కొనసాగుతోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON