loader

‘నాటో’లో సంచలన పరిణామం : గ్రీన్‌లాండ్‌‌కు రక్షణగా ఐరోపా ఆర్మీ

నాటో సైనిక కూటమిలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అమెరికా బారి నుంచి డెన్మా‌ర్క్‌లోని గ్రీన్‌లాండ్‌‌ ద్వీపానికి భద్రత కల్పించేందుకు ఐరోపా దేశాల సేనలు రంగంలోకి దిగాయి. అణ్వస్త్ర దేశం ఫ్రాన్స్‌తో పాటు జర్మనీ, నార్వే, స్వీడన్ సహా వివిధ ఐరోపా దేశాల సైన్యాలను గ్రీన్‌లాండ్‌ గడ్డపై మోహరించే ప్రక్రియ మొదలైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం గ్రీన్‌లాండ్‌ను మర్యాదగా తమకు విక్రయించకుంటే, స్వాధీనం చేసుకుంటామని డెన్మార్క్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే హెచ్చరించారు.

అమెరికా- గ్రీన్‌లాండ్ వివాదం: స్వాధీనానికి కుదరదని డెన్మార్క్ స్పష్టం

గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకునే ప్రశ్నే లేదని డెన్మార్క్, గ్రీన్‌లాండ్ దేశాలు మరోసారి స్పష్టం చేశాయి. అయితే ఆర్కిటిక్ ప్రాంత భద్రతపై అమెరికా వ్యక్తం చేస్తున్న ఆందోళనలను పరిష్కరించేందుకు వాషింగ్టన్‌తో కలిసిహై లెవల్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోక్కే రాస్ముస్సెన్, గ్రీన్‌లాండ్ విదేశాంగ మంత్రి వివియన్ మోట్జ్‌ఫెల్ట్‌లు వాషింగ్టన్‌లోని డెన్మార్క్ ఎంబసీలో సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.

ఇరాన్ గగనతలం మూసివేత – పలు భారతీయ విమాన సర్వీసులు రద్దు

ఇరాన్ గగనతలం మూసివేత నేపథ్యంలో భారతీయ విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు సూచనలు జారీ చేశాయి. ఉద్రిక్తతల దృష్ట్యా కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నామని, మరికొన్ని సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. ప్రయాణికులు ఎప్పటికప్పుడు తామిచ్చే సూచనలు గమనించుకోవాలని ఎయిర్ ఇండియా సోషల్ మీడియాలో తెలిపింది. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది.ఇప్పటికే ఇరాన్‌లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో దేశాన్ని వీడాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

‘ఇరాన్‌ నుంచి వెంటనే స్వదేశానికి వచ్చేయండి..’ భారతీయులకు విదేశాంగశాఖ కీలక సూచన

ఇరాన్‌లో ఉన్న భారతీయులకు విదేశాంగశాఖ కీలక సూచనలు చేసింది. ఇరాన్‌ నుంచి వెంటనే స్వదేశానికి  రావాలని కోరింది. ఇరాన్‌ పర్యటనను రద్దు చేసుకోవాలని భారతీయులను కోరింది. ఇరాన్‌పై అమెరికా ఏ క్షణంలోనైనా దాడి చేసే అవకాశం ఉండడంతో విదేశాంగశాఖ కీలక సూచనలు జారీ చేసింది. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలకు భారతీయులు దూరంగా ఉండాలని సూచించారు. నిరసనలతో ఉద్రిక్తంగా మారిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని కూడా సూచించింది. నిత్యం తమతో టచ్‌లో ఉండాలని చెప్పింది.

ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అప్రమత్తం.. కీలక నిర్ణయం

 తమ పొరుగు దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై అవసరమైతే దాడి చేస్తామంటూ  ఇరాన్ హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. ఖతర్‌లోని అల్ ఉదైద్ అమెరికా వైమానిక స్థావరంలోని కొందరు అధికారులను  అగ్రరాజ్యం వెనక్కు రమ్మని పిలిచినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.  ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాయి. అమెరికా దాడులు మొదలైన పక్షంలో తామూ పొరుగు దేశాల్లోని అగ్రరాజ్య సైనిక స్థావరాలపై దాడి చేస్తామని తేల్చి చెప్పింది.

పాలక్ పనీర్‌ను అవమానించిన అమెరికా ఇంటి యజమాని – రూ.2 కోట్లు కట్టించిన భారత విద్యార్థులు

భారతీయ విద్యార్థులు ఒక అపార్ట్‌మెంట్‌లో పాలక్ పనీర్ తయారు చేసుకుంటుండగా, ఆ అపార్ట్‌మెంట్ యజమాని ఆ విద్యార్థులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ వాసన పట్ల అసహ్యం ప్రకటించడమే కాకుండా, భారతీయ ఆహారపు అలవాట్లను కించపరుస్తూ జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు. వారిని బలవంతంగా బయటకు పంపడమే కాకుండా, వారి సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు జాతీయత ఆధారంగా వారిని వివక్షకు గురిచేయడం నేరమని కోర్టు స్పష్టం చేసింది. 2 కోట్ల రూపాయల భారీ పరిహారాన్ని […]

చెవిలో చాట్​జీపీటీ?- వినూత్న సాంకేతికతో ఓపెన్‌ఏఐ తొలి హార్డ్‌వేర్ వస్తోంది!

ఓపెన్‌ఏఐ 2026 కోసం ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ సంస్థ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కాని ఒక వినూత్న స్మార్ట్ పరికరాన్ని రూపొందిస్తోంది. ఇది ఒక చిన్న కంప్యూటర్​ మాదిరిగా పనిచేస్తుంది, అయితే దీనికి స్క్రీన్ ఉండదు. ఇది పూర్తిగా వాయిస్​పైనే ఆధారపడి ఉంటుంది. లీక్‌ల ప్రకారం, ఈ పరికరాన్ని “స్వీట్‌పీ (SweetPie)” అని పిలుస్తారు.  2023లో ప్రముఖ డిజైనర్ జానీ ఐవ్ (Jony Ive) కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నప్పుడు ప్రారంభమైంది. జానీ ఐవ్, […]

బాంబు పేలుడుకు తునాతునకలైన పాకిస్థాన్ పోలీసుల వాహనం.. ఏడుగురు మృతి

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతం మరోసారి రక్తసిక్తమైంది. సోమవారం ట్యాంక్ జిల్లాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్ సాయుధ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన భీకర బాంబు పేలుడులో ఏడుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. నిషిద్ధ ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) కు చెందిన ఒక ప్రత్యేక విభాగం ఈ ఘాతుకానికి పాల్పడింది. రోడ్డు పక్కన అమర్చిన అత్యంత శక్తివంతమైన రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీని.. పోలీస్ వాహనం వెళ్తుండగా పేల్చివేశారు.

రైలుపై కూలిపోయిన క్రేన్… 22 మంది మృతి, 30 మందికి గాయాలు

థాయిలాండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నఖోన్ రాట్చసిమా ఫ్రావిన్స్‌లో ఓ ప్రయాణికుల రైలుపై క్రేన్ కూలిపోయింది. దీంతో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 22 మంది మరణించగా, కనీసం 30 మంది వరకు గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. బ్యాంకాక్ నుంచి ఈశాన్యంగా వెళ్తున్న ఉబోన్ రాట్చసిమా ప్రావిన్స్‌కు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలు హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న క్రేన్ కూలిపోయి ఈ రైలుపై పడిపోయింది.

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X డౌన్ అయ్యింది.!

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X డౌన్ అయినట్టు డౌన్ డిక్టేటర్ లో రిపోర్ట్ చేస్తున్నారు. మేము చెక్ చేసినప్పుడు మాత్రం కొంత నెమ్మదిగా ఫీడ్ రిఫ్రెష్ అయినా వెబ్సైట్ మాత్రం బాగానే పని చేసింది. కానీ డౌన్ డిక్టేటర్ లో అందుకున్న రిపోర్ట్స్ ప్రకారం యాప్ లాగిన్ మరియు ఫీడ్ రిఫ్రెష్ వంటి మరిన్ని సమస్యలు కొంత మంది యూజర్లు చూస్తున్నట్లు చెబుతున్నారు.సాయంత్రం 7 గంటల 38 నిమిషాల నుంచి డౌన్ అయినట్లు రిపోర్ట్

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON