ఇరాన్ గగనతలం మూసివేత నేపథ్యంలో భారతీయ విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు సూచనలు జారీ చేశాయి. ఉద్రిక్తతల దృష్ట్యా కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నామని, మరికొన్ని సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. ప్రయాణికులు ఎప్పటికప్పుడు తామిచ్చే సూచనలు గమనించుకోవాలని ఎయిర్ ఇండియా సోషల్ మీడియాలో తెలిపింది. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది.ఇప్పటికే ఇరాన్లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో దేశాన్ని వీడాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

