బంగ్లాదేశ్‌లో మరో హిందువు దారుణ హత్య.. ఈసారి కారుతో తొక్కించి చంపి, ఆపై పరారీ!
బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పెట్రోల్ పోయించుకుని డబ్బులు అడిగినందుకు ఒక హిందూ యువకుడిని కారుతో తొక్కి చంపి పారిపోయిన దారుణ ఘటన రాజ్‌బరి జిల్లాలో చోటుచేసుకుంది. పెట్రోల్ పోయించుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండానే ఆ కారును వేగంగా పోనివ్వడానికి డ్రైవర్ ప్రయత్నించాడు కారును ఆపడానికి ప్రయత్నిస్తూ వాహనానికి అడ్డంగా నిలబడ్డాడు. ఆ కారులో ఉన్న వ్యక్తులు కనికరం లేకుండా రిపన్ సాహాపై నుంచి కారును పోనిచ్చారు.

