loader

అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!

అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి! అమెరికాలోని టెక్సాస్‌లోని ఆస్టిన్‌లోని రద్దీగా ఉండే బార్‌లో కాల్పులు జరిగాయి . ఈ దుర్ఘటనలో ముగ్గురు మరణించారు, వారిలో 21 ఏళ్ల భారతీయ-అమెరికన్ విద్యార్థిని సవితా షాన్ కూడా ఉన్నారు.దాడి చేసిన వ్యక్తి ఘటన జరిగిన సమయంలో అతను ఇరానియన్ జెండా, “అల్లా ఆస్తి” అనే పదాలు ఉన్న దుస్తులు ధరించి ఉన్నాడు.  పోలీసులు దాడి చేసిన వ్యక్తిని కాల్చి […]

ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధంలో అద్భుత కట్టడం ధ్వంసం.. యునెస్కో ప్రకటన

ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన గోలేస్తాన్ మహల్ ఇటీవల జరిగిన వైమానిక దాడుల్లో దెబ్బతిన్నట్లు ఇరానియన్ మీడియా వెల్లడించింది. గోలేస్తాన్ మహల్ తెహ్రాన్‌లోని అత్యంత పురాతన, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన సముదాయాలలో ఒకటి. ఇది నగర మధ్యభాగంలో ఉండి, ఒకప్పుడు పర్షియా రాజవంశాల అధికార నివాసంగా ఉపయోగించేవారు. ఇరాన్ సామ్రాజ్య చరిత్రకు ఇది శక్తివంతమైన చిహ్నంగా ఇప్పటికీ నిలిచివుంది.

మ‌ధ్య‌ద‌రా స‌ముద్రం దిశ‌గా ఫ్రాన్స్ అణ్వాయుధ యుద్ద నౌక‌

పశ్చిమాసియా స‌మ‌రంలోకి ఫ్రాన్స్ కూడా అడుగుపెట్టే ఆలోచ‌న‌లో ఉన్న‌ది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల‌ను తిప్పికొట్టేందుకు .. విచ‌క్ష‌ణ‌ర‌హితంగా ఇరాన్ త‌న ఆయుధాల‌ను వాడుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో యురోపియ‌న్ దేశ‌మైన ఫ్రాన్స్ త‌న ఆస్తుల‌ను కాపాడుకునేందుకు ముందుకు క‌దులుతోంది. ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఎమ్మాన్యువ‌ల్ మాక్ర‌న్ మంగ‌ళ‌వారం కీల‌క ఆదేశాలు చేశారు. అణ్వాయుధ సామ‌ర్థ్యం క‌లిగిన యుద్ధ నౌక‌ను మ‌ధ్య‌ధ‌రా ప్రాంతానికి త‌ర‌లించాల‌ని ఆదేశించారు. బాల్టిక్ స‌ముద్రం నుంచి మెడిటెరేనియ‌న్ దిశ‌గా యుద్ధ‌నౌక చార్లెస్ డీ గ‌ల్లే దూసుకెళ్తున్న‌ది

 ఇరాన్ సుప్రీం నేత‌గా మోజ్తాబా ఎన్నిక

ఇరాన్ కొత్త సుప్రీం నేత‌గా అయ‌తుల్లా ఖ‌మేనీ కుమారుడు మోజ్తాబా హుసేన్ ఖ‌మేనీ ఎన్నిక‌య్యారు. ఇజ్రాయిలీ మీడియా ఈ విష‌యాన్ని పేర్కొన్న‌ది. ఇరాన్‌కు చెందిన నిపుణుల అసెంబ్లీ మోజ్తాబాను ఎన్నుకున్న‌ది. అయ‌తుల్లా అలీ ఖ‌మేనీ వారుసుడిగా మోజ్తాబా కొన‌సాగ‌నున్నారు. మొజ్తాబా వ‌య‌సు 56 ఏళ్లు. త‌న తండ్రి ఖ‌మేనీ అడుగుజాడ‌ల్లో రాజ‌కీయ‌, మ‌త‌ప‌ర‌మైన వ్య‌వ‌స్థ‌ల‌ను ఆయ‌న న‌డిచారు. మ‌త‌ప‌ర‌మైన శిక్ష‌ణ‌లో ఆయ‌న చాన్నాళ్లుగా కొన‌సాగుతున్నా.. అయ‌తుల్లా ర్యాంక్‌కు మాత్రం ఇంకా చేరుకోలేదు.

దుబాయ్‌లో అమెరికా కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి!

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చాయి. తాజాగా Dubaiలోని అమెరికా కాన్సులేట్ సమీపంలో డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. కాన్సులేట్ భవనానికి ఆనుకుని ఉన్న పార్కింగ్ ప్రాంగణంలో పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి. అత్యవసర సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిని అదుపులోకి తీసుకొచ్చారు. అమెరికా విదేశాంగ శాఖాధికారి ప్రకారం, అక్కడ ఉన్న అమెరికా సిబ్బంది సురక్షితంగా ఉన్నారు.

డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్….

రియాద్‌లోని  అమెరికా రాయబార కార్యాలయంలోని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ స్టేషన్‌పై కూడా డ్రోన్ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే అమెరికా రాయబార కార్యాలయం కాంపౌండ్‌పై రెండు డ్రోన్లు దాడి చేశాయని అమెరికా, సౌదీ అరేబియా అధికారులు ధ్రువీకరించారు. అయితే ఈ డ్రోన్ దాడులలో సీఐఏ దెబ్బతిందనే ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.

దాడి చేయకుంటే ఇరాన్ అణుశక్తివంతం అయ్యేది: నెతన్యాహు

ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించిందని, కొన్ని నెలల్లోనే శక్తివంతం అయ్యేదని అందుకనే ఇజ్రాయెల్, అమెరికా కలిసి అత్యవసరంగా దాడి చేయక తప్పలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మంగళవారం “ ఫాక్స్ న్యూస్‌” ఇంటర్వూలో వెల్లడించారు. దాడుల నుంచి రక్షించుకునేందుకు ఇరాన్ కొత్తగా బాలిస్టిక్ క్షిపణుల తయారీ కోసం భూగర్భంలో అణు కార్యక్రమాల క్షేత్రాలను, బంకర్లను, నిర్మించడం ప్రారంభించిందని ,ఇప్పుడు దాన్ని నివారించకుంటే భవిష్యత్తులో ఏ చర్య తీసుకోలేమని నెతన్యాహు పేర్కొన్నారు.

మెక్సికోలో షకీరా రికార్డు, 4 లక్షల జనసందోహం!

మెక్సికో సిటీలోని ఐకానిక్ Zócalo స్క్వేర్‌లో నిర్వహించిన లైవ్ కాన్సర్ట్‌తో షకీరా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఉచిత ఈవెంట్‌కు సుమారు 4 లక్షల మందికి పైగా అభిమానులు హాజరైనట్లు స్థానిక గణాంకాలు చెబుతున్నాయి. జోకాల చరిత్రలో ఇంత భారీ జనసందోహం ఇదే తొలిసారి అని నివేదికలు వెల్లడించాయి. నగరం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించగా, రద్దీని నియంత్రించేందుకు సమీప ప్రాంతాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

ఒమన్ ఓడరేవు పై ఇరాన్ డ్రోన్ దాడి

ఖమేని హత్యకు ప్రతీకారంగా ఇరాన్ సాగిస్తున్న ప్రతీకార దాడులలో భాగంగా మంగళవారం ఉదయం ఒమన్ లోని రాస్ అల్ -జైమా ఓడరేవుపై ఇరానియన్ డ్రోన్ దాడి చేసింది. దాడులలో మంటలు ఎగసి పడ్డాయి. డ్రోన్ మంటల్లో దూసుకుపోతూ, కెమెరాకు చిక్కింది. ఓడరేవు అంతటా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఇరాన్, అమెరికాతో సన్నిహిత సంబంధాలు కొనసాగించే గల్ఫ్ లోని దేశాలలో అమెరికా సైనిక స్థావరాలు, ఆస్తులు, ఓడరేవులు, ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి.

కనువిందు చేసిన బ్లడ్ మూన్.. ముగిసిన చంద్రగ్రహణం

2026 సంవత్సరం ప్రారంభంలోనే అద్భుతం చోటుచేసుకుంది. మొదటి ఖగోళ అద్భుతం ఆవిష్కృతం అయింది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలతో పాటు ఇండియాలోనూ ఈ పాక్షిక చంద్రగ్రహణం కనిపించింది. ఈ దృశ్యం ఏర్పడడానికి ముందు సాయంత్రం 3 గంటల 20 నిమిషాలకు చంద్ర గ్రహణం ప్రారంభమైంది. ఇది సాయంత్రం 06 గంటల 47 నిమిషాలకు ముగిసింది. అలాగే చంద్రగ్రహణం సందర్భంగా మూసేసిన ఆలయాలను శుద్ధి చేసి భక్తులకు దర్శనాలను కల్పిస్తున్నారు. అలాగే చంద్రగ్రహణం విడిచిన తర్వాత అంతా స్నానాలు ఆచరించి, […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON