loader

యుద్ధం ఎన్ని రోజులు సాగినా ఇరాన్ కు సమస్య లేదు: కియూమార్స్ హైదరీ

అమెరికా, ఇజ్రాయిల్ కు బుద్ధి చెప్పేవరకు యుద్ధం కొనసాగుతుందని జనరల్ కియూమార్స్ హైదరీ తెలిపారు. యుద్ధం ఎంతకాలం సాగినా వెనక్కి తగ్గేది లేదని అన్నారు. అమెరికా, ఇజ్రాయిల్ పై ఇరాన్ జనరల్ కియూమార్స్ హైదరీ సంచలన  వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఎన్ని రోజులు సాగినా ఇరాన్ కు సమస్య లేదని, తమ లక్ష్యాలను నెరవేరే వరకు యుద్ధాన్ని ఆపమని తెలియజేశారు. శత్రువులు పశ్చాత్తాపడేలా చేసి యుద్ధాన్ని ముగిస్తామని, గతంలో 8 ఏళ్ల యుద్ధాన్ని ఎదుర్కొన్న అనుభవం తమకుందని […]

పశ్చిమాసియాలో యుద్ధం.. అమెరికాలో ఖండాంతర అణు క్షిపణి పరీక్ష..!

పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యంత శక్తిమంతమైన ఖండాంతర అణు క్షిపణిని అగ్రరాజ్యం పరీక్షించింది. ఈ అణు క్షిపణి పరీక్ష మంగళవారమే జరుగగా.. ఆ పరీక్షకు సంబంధించిన వివరాలు తాజాగా బయటికొచ్చాయి. కాలిఫోర్నియా తీరంలోని వాండెన్‌బర్గ్‌ స్పేస్‌ఫోర్స్‌ బేస్‌ నుంచి మంగళవారం రాత్రి 11 గంటలకు Minuteman-III బాలిస్టిక్‌ మిస్సైల్‌ ను అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ గ్లోబల్‌ స్ట్రైక్‌ కమాండ్‌ పరీక్షించింది.  జపాన్‌లోని హిరోషిమాపై జారవిడిచిన అణుబాంబు కంటే 20 రెట్లు శక్తిమంతమైన […]

కువైట్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్‌లో భారీ పేలుడు.. చమురు లీక్‌పై ఆందోళన

కువైట్ సమీప సముద్రంలో ఆయిల్ ట్యాంకర్‌లో భారీ పేలుడు సంభవించింది. ముబారక్ అల్-కబీర్ పోర్టుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు యూకే మెరైన్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (UKMTO) అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటన కువైట్ భూభాగ జలాల వెలుపల జరిగినట్లు అధికారులు స్పష్టం చేశారు. పేలుడు కారణంగా ట్యాంకర్‌లోకి నీరు చేరినట్లు సమాచారం. పేలుడు ప్రభావంతో నౌకలోని కార్గో ట్యాంక్ దెబ్బతినడంతో సముద్రంలోకి చమురు లీక్ అవుతున్నట్లు యూఏఈ, కువైట్ అధికారులు […]

అణ్వస్త్ర శక్తి కలిగిన నౌకాదళ నిర్మాణంపై కిమ్ ఫోకస్- మరో కొత్త యుద్ధ నౌక తనిఖీ

న్యూక్లియర్​ సామర్థ్యాన్ని మరింత బలోపేతం దిశగా ఉత్తర కొరియా కీలక ముందుడు వేసింది. అణ్వస్త్ర ప్రయోగ సామర్థ్యాన్ని కలిగిన నౌకాదళం నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది. మరో రెండు రోజుల్లోగా దేశ నౌకాదళంలోకి ప్రవేశపెట్టనున్న కొత్త యుద్ధ నౌక (డెస్ట్రాయర్)‌ను  కిమ్  తనిఖీ చేశారు. ప్రయోగపూర్వకంగా ఈ యుద్ధ నౌక నుంచి క్రూయిజ్ మిస్సైల్‌‌‌ను సంధించడాన్ని కిమ్ వీక్షించారు. ఈ వివరాలతో ఉత్తర కొరియా ప్రభుత్వ వార్తాసంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ గురువారం రోజు కథనాన్ని […]

ఇరాన్‌పై దాడులు ఉద్ధృతం- ఖమేనీ అంత్యక్రియలు వాయిదా

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ఆరో రోజు కొనసాగుతున్నాయి. రాజధాని టెహ్రాన్‌పై మరో దఫా వైమానిక దాడులు మొదలుపెట్టామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. అమెరికా-ఇజ్రాయెల్‌ దాడిలో మృతి చెందిన ఇరాన్‌ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. లక్షలాది సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉండటంతో , అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడానికి సమయం పడుతుందని ఇస్లామిక్‌ డెవలప్‌మెంట్‌ కోఆర్డినేషన్‌ కౌన్సిల్‌ అధిపతి మోహసిన్‌  ప్రభుత్వ మీడియాకు వెల్లడించారు. త్వరలో అంత్యక్రియల […]

ఇరాన్‌లో మృత్యుఘోష..1145కి చేరిన మృతుల సంఖ్య

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, ఈ దాడుల్లో ఇప్పటివరకు కనీసం 1145 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా సుమారు 131 నగరాలు లక్ష్యంగా అమెరికా బలగాలు క్షిపణుల వర్షం కురిపించాయి. కేవలం సైనిక స్థావరాలే కాకుండా, వ్యూహాత్మక ప్రాంతాలను కూడా ధ్వంసం చేశాయి. ముఖ్యంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలు మరియు 9 యుద్ధ నౌకలను […]

శ్రీలంకలో ఇరాన్ యుద్ధ నౌకపై దాడి.. 101 మంది సిబ్బంది గల్లంతు

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరమైన వేళ.. శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌకపై దాడి చోటుచేసుకోవడం కలకలం రేగుతోంది. ఈ నౌక విశాఖలో జరిగిన మిలాన్‌లో పాల్గొని, తమ దేశానికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇందులో మొత్తం 180 మంది సిబ్బంది ఉండగా.. 101 మంది గల్లంతయ్యారు. మరో 32 మందిని శ్రీలంక నేవీ రక్షించింది. ఈ నౌకకు ఎస్కార్ట్‌గా మరో రెండు నౌకలు వెళ్తున్నాయి. కానీ, ఈ దాడి ఎలా జరిగిందో తెలియరాలేదు.

ఈ రాత్రి నుంచి ప్రజా సందర్శనకు ఖమేనీ భౌతికకాయం.. అంత్యక్రియల ప్రక్రియ మొదలు

ఇజ్రాయెల్‌, అమెరికా దాడుల్లో హత్యకు గురైన ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మృతదేహాన్ని ఇవాళ (బుధవారం) రాత్రి నుంచి ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో ప్రజా సందర్శనకు ఉంచనున్నారు. అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభానికి సంకేతంగా ఖమేనీ భౌతికకాయాన్ని బయటికి తీస్తున్నారు.ప్రజల సందర్శనార్థం ఖమేనీ భౌతికకాయాన్ని మూడు రోజులపాటు ప్రదర్శనకు పెట్టనున్నట్లు ఇరాన్‌ అధికార టీవీ తెలిపింది. మూడు రోజుల ప్రజా సందర్శన అనంతరం ఇరాన్‌ ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించనుంది.

‘అమెరికాతో చర్చలు లేవు- యుద్ధాన్ని కొనసాగిస్తాం’- వారిని చంపేస్తామని ఇరాన్‌ స్ట్రాంగ్ వార్నింగ్

ఇజ్రాయెల్​, అమెరికా యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో ఇరాన్​ దివంగత సుప్రీం అయతొల్లా ఖమేనీ సన్నిహితుడు మహ్మద్​ మొక్బర్​ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో చర్చలకు దిగివచ్చే ఉద్దేశం తమకు లేదని తేల్చిచెప్పారు. వీలైనంత కాలం యుద్ధాన్ని కొనసాగిస్తామని ఇరాన్​ స్టేట్​ అధికారిక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. అమెరికా, ఇజ్రాయెల్‌కు సహకరించిన ప్రతి ఒక్కరూ ఇరాన్‌కు శత్రువుగానే భావిస్తున్నట్లు ప్రకటించారు. యుద్ధం సమయంలో వారు శత్రువుల వైపు ఉంటారో లేక ఇస్లామిక్‌ విధానాల వైపు తేల్చుకోవాలని ఘోలామ్‌ […]

అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!

అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి! అమెరికాలోని టెక్సాస్‌లోని ఆస్టిన్‌లోని రద్దీగా ఉండే బార్‌లో కాల్పులు జరిగాయి . ఈ దుర్ఘటనలో ముగ్గురు మరణించారు, వారిలో 21 ఏళ్ల భారతీయ-అమెరికన్ విద్యార్థిని సవితా షాన్ కూడా ఉన్నారు.దాడి చేసిన వ్యక్తి ఘటన జరిగిన సమయంలో అతను ఇరానియన్ జెండా, “అల్లా ఆస్తి” అనే పదాలు ఉన్న దుస్తులు ధరించి ఉన్నాడు.  పోలీసులు దాడి చేసిన వ్యక్తిని కాల్చి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON