ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో హత్యకు గురైన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతదేహాన్ని ఇవాళ (బుధవారం) రాత్రి నుంచి ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ప్రజా సందర్శనకు ఉంచనున్నారు. అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభానికి సంకేతంగా ఖమేనీ భౌతికకాయాన్ని బయటికి తీస్తున్నారు.ప్రజల సందర్శనార్థం ఖమేనీ భౌతికకాయాన్ని మూడు రోజులపాటు ప్రదర్శనకు పెట్టనున్నట్లు ఇరాన్ అధికార టీవీ తెలిపింది. మూడు రోజుల ప్రజా సందర్శన అనంతరం ఇరాన్ ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించనుంది.

