loader

RCBని కొనేది ఇతనేనా..? 1.5 లక్షల కోట్ల ఆస్తిపరుడు.. ఎవరంటే?

ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్ముతున్నట్లు ప్రకటించినప్పటి నుండి అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. కోవిడ్ వ్యాక్సిన్, కోవిషీల్డ్‌ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన బిలియనీర్ ఇప్పుడు ఆర్సీబీని కొనుగోలుకు అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవాలా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పోస్ట్ చేశారు, దీంతో అదార్ పూనవాలా ఆర్సీబీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుండవచ్చు అనే ఊహాగానాలకు ఇది దారితీసింది.

ఉమెన్ ప్రపంచ కప్‌ 2025లో టీం ఇండియా సూపర్ ఓపెనింగ్, శ్రీలంకపై 59 పరుగుల తేడాతో విజయం

ప్రపంచ కప్ 2025 మొదటి మ్యాచ్‌లో శ్రీలంకను 59 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. ఇది మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 మొదటి మ్యాచ్, దీనిలో వర్షం కూడా ఆటంకం కలిగించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 269 పరుగులు చేసింది, అయితే వర్షం కారణంగా DLS నియమం అమలులోకి వచ్చింది, దీని కారణంగా శ్రీలంక 47 ఓవర్లలో 271 పరుగులు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక […]

తిలక్ వర్మను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి..

ఆసియా కప్ -2025 లో భారత జట్టును విజేతగా నిలపడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన యువ క్రికెటర్ తిలక్ వర్మను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్ చేరుకున్న క్రికెటర్ తిలక్ వర్మ.. మంగళవారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిలక్ వర్మను, కోచ్ సలాం బయాష్‌ను ముఖ్యమంత్రి సత్కరించారు. తిలక్ వర్మ తన క్రికెట్ బ్యాట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహూకరించారు.

అమన్‌జోత్ హాఫ్ సెంచరీ.. మళ్లీ అడ్డుపడిన వరుణుడు

వరల్డ్ కప్ ఆరంభ పోరులో కష్టాల్లో పడిన భారత జట్టు అనూహ్యంగా పుంజుకుంది. అమన్‌జోత్ కౌర్ (50 నాటౌట్), దీప్తి శర్మ(38 నాటౌట్)లు కీలక భాగస్వామ్యంలో జట్టు స్కోర్ 200 దాటించారు. దాంతో.. టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుండగా మరోసారి ఇన్నింగ్స్‌కు వరుణుడు మరోసారి అడ్డుపడ్డాడు. 40వ ఓవర్ పూర్తికాగానే వర్షం మొదలైంది. దాంతో.. ఇరుజట్ల ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్‌కు పరుగులు తీశారు.

జాతీయ క్రీడా అవార్డుల ద‌ర‌ఖాస్తుకు క్రీడాశాఖ ఆహ్వానం

ఖేల్ ర‌త్నా, అర్జున అవార్డుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. అక్టోబ‌ర్ 28వ తేదీలోగా ఆ ద‌ర‌ఖాస్తుల‌ను అంద‌జేయాల‌ని ప్ర‌భుత్వం కోరింది. ప్ర‌తి ఏడాది క్రీడా అవార్డుల‌ను రాష్ట్ర‌ప‌తి అంద‌జేస్తారు. వెబ్ పోర్ట‌ల్ ద్వారా ద‌ర‌ఖాస్తులు అర్హులైన క్రీడాకారులు, కోచ్‌లు,సంస్థ‌లు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ శాఖ కోరింది. మేజ‌ర్ ధ్యాన్ చంద్ అవార్డు,అర్జున‌, ద్రోణాచార్య‌, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహ‌న్ అవార్డుల‌ను కూడా […]

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక

ఐసిసి వన్డే ప్రపంచకప్-2025 మంగళవారం నుంచి ప్రారంభం అవుతోంది. ఈ ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో అతిథ్య దేశాలు భారత్-శ్రీలంక తలపడుతున్నాయి. బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి.. టోర్నమెంట్‌ని ఘనంగా ఆరంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

నేటి నుంచే మహిళల ప్రపంచకప్‌ మొదలు

2025 ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్ కప్ (ICC Womens World Cup 2025) 13వ ఎడిషన్‌గా సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఎనిమిది దేశాలు పోటీపడనున్నాయి. భారత్‌తో పాటు శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న ఈ ప్రపంచ కప్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు అత్యున్నత గౌరవాన్ని అందుకుంటుంది. ఛాంపియన్ జట్టు $4.48 మిలియన్లు (సుమారు రూ.40 కోట్లు) బహుమతిని అందుకుంటుంది. ఫైనల్‌లో రెండవ స్థానంలో నిలిచిన జట్టు $2.24 మిలియన్లు (సుమారు రూ.20 కోట్లు) అందుకుంటుంది.

హైదరాబాద్‌కు ఆసియా కప్ హీరో.. ఘన స్వాగతం పలికిన అభిమానులు

ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మ  స్వదేశం చేరుకున్నాడు. పాకిస్థాన్‌పై ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించిన అతడు సోమవారం హైదరాబాద్ విమానాశ్రయంలో దిగాడు. దాంతో.. ఈ స్టార్ క్రికెటర్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. తిలక్‌ను చూసేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు. కారులో ఎక్కిన తర్వాత టీమిండియా స్టార్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

టీమిండియాకు కప్ ఎప్పుడు ఇస్తారు? మొహసిన్ నఖ్వీకి బీసీసీఐ అల్టిమేటం

పాకిస్థాన్‌ను ఓడించి ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత కూడా టీమ్ ఇండియాకు ట్రోఫీ దక్కకపోవడం క్రికెట్ ప్రపంచంలో పెద్ద వివాదానికి దారితీసింది. ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించడంతో ఈ సమస్య మొదలైంది.ఏసీసీ అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ అందుకు బదులుగా ట్రోఫీని తీసుకుని తన హోటల్‌కు వెళ్లిపోవడం బీసీసీఐకి మరింత ఆగ్రహం తెప్పించింది.మొహసిన్ నఖ్వీ ఈ వైఖరిపై బీసీసీఐ ఇప్పుడు కఠిన చర్యలకు […]

ఆసియా కప్ మనదే..! ఇండియా పరువు కాపాడిన తెలుగు తేజం

టీమిండియా కైవసం చేసుకుంది. తిలక్ వర్మ, శివమ్ దూబే అద్భుత ఇన్నింగ్స్‌తో ఇండియాకు 9వ ఆసియా కప్‌ను అందించారు. రింకూ సింగ్ ఫినిషింగ్ షాట్ కొట్టి మ్యాచ్ గెలిపించాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON