loader

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

‘హిందూ మతంలో సమానత్వం ఉంటే ఎవరైనా ఎందుకు వేరే మతంలోకి మారతారు..? ‘హిందూమతంలో సమానత్వమే ఉంటే అంటరానితనం ఇంకా ఎందుకు మిగిలి ఉంది..? అంటరానితనాన్ని మనం సృష్టించామా..? ఇస్లాం, క్రైస్తవం, ఇతర ఏ మతాల్లోనైనా అసమానత్వం ఉండొచ్చు. మేముకానీ బీజేపీకానీ ఎవరినీ మతం మారమని కోరం, ప్రజలే మతం మారుతుంటారు, అది వారి హక్కు కూడా’ అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.

కవితతో విష్ణువర్ధన్ రెడ్డి భేటీ…. జూబ్లీహిల్స్ అభ్యర్థి?

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో ఎంఎల్ఎ కవిత తరపున అభ్యర్థిని బరిలోకి దించే అవకాశం ఉంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి సమావేశమయ్యారు. ఇద్దరు మధ్య దాదాపుగా అరగంటకు పైగా మంతనాలు సాగాయి. ఉపఎన్నికలో విష్ణును పోటీకి దించే యోచనలో కల్వకుంట్ల కవిత ఉన్నట్టు సమాచారం.

బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ సునీత… వైసీపీకి రాజీనామా చేసిన ఏడాదికి

మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత బీజేపీలో చేరారు. ఆదివారం రోజున విశాఖపట్నంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కలిసిన పోతుల సునీత… ఆయన సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇక, పోతుల సునీత గతేడాది ఆగస్టులో వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఏడాది కాలంగా ఏ పార్టీలో చేరకుండా ఉండిపోయిన పోతుల సునీత… తాజాగా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే నేడు బీజేపీ కండువా కప్పుకున్నారు.

ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అంటే ప్రజాస్వామ్యాన్ని చంపేయడమే..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ పెట్టిన నటుడు విజయ్ దూకుడు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టిన ఆయన అరియళూర్ సభలో శనివారం రాత్రి పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన విజయ్.. కేంద్రంలోని తాజాగా మరోసారి భారతీయ జనతాపార్టీపై నిప్పులు చెరిగారు. కేంద్రం అమలు చేయాలనుకుంటున్న ఒకేదేశం – ఒకే ఎన్నిక విధానం అనేది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం లాంటిదేనని తమిళగ వెట్రీ కజగం (TVK) పార్టీ అధినేత అన్నారు.

ఎవరి అభివృద్ధి కోసం పార్టీ మారినవ్‌?.. గద్వాల ఎమ్మెల్యేను నిలదీసిన కేటీఆర్‌

గద్వాలలో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ..మరి ఇవాళ ఎవరి అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లోకి వెళ్లావని కృష్ణమోహన్‌ రెడ్డిని కేటీఆర్‌ ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమా? నీ సొంత అభివృద్ధి కోసమా? ఎందుకు పార్టీ మారవని నిలదీశారు. ఈ 22 నెలల్లో గద్వాలలో ఏం అభివృద్ధి జరిగిందని అడిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బీఫాంతో పోటీచేసి గెలిచాక  కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా.. అధికార పార్టీకి పెద్ద ఎత్తున పలువురు నాయకులు గుడ్‌బై చెప్పి కేటీఆర్‌ […]

ముదిరిన విబేధాలు.. మంత్రి సురేఖ v/s ఎమ్మెల్యే నాయిని

వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌లో వర్గ విబేధాలు మళ్లీ ముదురుదుతున్నాయి. భద్రకాళీ ఆలయ పాలకమండలి కమిటీ విషయంలో మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య చిచ్చురేగింది. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా ఆలయ పాలక మండలి సభ్యులను ఎలా నియమిస్తారని అని ప్రశ్నించారు. దేవాదాయశాఖకు మంత్రి అయినంత మాత్రానా ఏదైనా చేయొచ్చా అని నిలదీశారు. తన నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటని ధ్వజమెత్తారు. మంత్రి కొండా సురేఖ ఇదే పద్ధతి అవలంభిస్తే […]

చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ నిర్మించలేదు: రోజా

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజీ కూడా నిర్మించలేదని వైసిపి నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత హోంమంత్రి అనిత, సవితకు లేదని ధ్వజమెత్తారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం ఎలా అనే మందును మంత్రులకు చంద్రబాబు ఇస్తున్నారని మండిపడ్డారు. రాజమండ్రి, విజయ నగరం, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు మెడికల్ కాలేజీల పరిశీలించడానికి వస్తావా హోంమంత్రి అంటూ ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలు ఎలా ఉంటాయో, విద్యార్థులు ఎలా […]

అమరావతి భూసేకరణపై సీఎం చంద్రబాబు క్లారిటీ..

హైదరాబాద్ తరహాలో అమరావతి కూడా మహానగరంగా మారిందని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో ఇప్పుడు ఉండే భూమి ఇప్పటికే సరిపోతుందన్నారు. అవసరమైన మేరకు రైతులతో మాట్లాడి అమరావతిని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి రైతులకు అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. అమరావతి అభివృద్ధి కంటిన్యూగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో మొత్తం ప్రైవేట్ భూములే ఉన్నాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

వీళ్ల‌ను గుర్తు ప‌ట్ట‌గ‌ల‌రా..? రాహుల్ గాంధీ ద్వంద్వ ప్ర‌మాణాల‌పై కేటీఆర్ తీవ్ర విమ‌ర్శ‌

బీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌రోసారి మండిప‌డ్డారు. పార్టీ మార్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేను రాహుల్ గాంధీతో సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు స్వయంగా కలిశారని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ నేత‌ల‌తో పార్టీ మారిన ఎమ్మెల్యేలు తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో చూపించి “ఇవ్వాళ వీళ్లను మీరు గుర్తుపట్టగలరా?” అని ఎద్దేవా చేశారు. “ఇది ఎమ్మెల్యేల చోరీ కాకపోతే ఇంకేమిటి?” అంటూ రాహుల్ […]

ప్రధాని మోదీ తల్లిపై బీహార్ కాంగ్రెస్ ఏఐ వీడియో.. భగ్గుమన్న బీజేపీ,

కాంగ్రెస్ పార్టీ ఒక సంచలన వీడియోను విడుదల చేసి వివాదాన్ని రాజేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దివంగత తల్లి హీరాబెన్ పై ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో రూపొందించిన ఒక వీడియోను విడుదల చేసింది. అందులో ప్రధాని మోదీ కలలో ఆమె తల్లి కనిపించి.. మోదీ చేస్తున్న రాజకీయాలపై ఆయన్ను మందలిస్తున్నట్లుగా చూపించారు. దీంతో బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని రాజకీయంగా అపహాస్యం చేసేందుకు కాంగ్రెస్ ఉపయోగించిందని ఈ అంశాన్ని ఎన్నికల సంఘం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON