loader

బాలయ్యపై 300 చోట్ల ఫిర్యాదు చేయాలని ఫ్యాన్స్ నిర్ణయం.. వారించిన చిరంజీవి

హైదరాబాద్‌లో బ్లడ్‌ బ్యాంక్‌ సమీపంలోని ఓ హోటెల్‌లో మెగా అభిమానుల అత్యవసర సమావేశం నిర్వహించారు. మీటింగ్‌లో ఆంధ్రా, తెలంగాణ ఫ్యాన్స్ పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా 300 పీఎస్‌లలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. విషయం తెలుసుకుని అభిమానుల వారించారు చిరు. అలాంటి పనులు చేయొద్దని అభిమానులకు స్పష్టం చేశారు. చిరంజీవి పిలుపుతో ప్రస్తుతానికి ఆగాల్సి వచ్చిందంటున్నారు. అయితే, తమ పోరాటం మాత్రం ఆగదని చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ నేత మోహన్ స్పష్టం చేశారు.

ఢిల్లీ బీజేపీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన మోదీ

బీజేపీ ఢిల్లీ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. దీన్‌ దయాళ్ మార్గ్‌లో కొత్తగా నిర్మించిన ఢిల్లీ బీజేపీ కార్యాలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు ప్రారంభించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే ఈ కొత్త కార్యాలయం ఏర్పాటు కాగా, ఇప్పటి వరకూ అద్దెకుండటం, తాత్కాలిక కార్యాలయాల్లో పని చేసిన బీజేపీ కార్యాలయానికి ఇప్పుడు సొంత కార్యాలయం రావడం, అదికూడా నవరాత్రి రోజుల్లో ప్రారంభం కావడం పార్టీ శ్రేణుల్లో సంబరాలు నింపింది.

లిక్కర్‌ స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు..

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్‌ను ఇస్తూ ఆదేశాలిచ్చింది. రెండు ష్యూరిటీలు, రూ.2లక్షల పూచీకత్తు సమర్పించాలని ఎంపీ మిథున్‌ రెడ్డికి ఏసీబీ కోర్టు సూచించింది. అలాగే వారంలో రెండుసార్లు విచారణకు హాజరుకావాలని, వచ్చి సంతకాలు పెట్టాలని ఆదేశించింది. దీంతో 71 రోజులుగా జైలులో ఉన్న మిథున్‌ రెడ్డి రేపు ఉదయం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం […]

వైసీపీ డిజిటల్ బుక్‌లో విచిత్రం… మాజీమంత్రి విడదల రజినిపై ఫిర్యాదు

వైసీపీ కార్యకర్తల రక్షణ కోసం…కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురవుతున్న వారికి అండగా నిలబడటానికి వైసీపీ అధినేత, మాజీసీఎం వైఎస్ జగన్ డిజిటల్ బుక్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లాలో మాజీమంత్రి విడదల రజినీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ ఆవిష్కరించిన డిజిటల్ బుక్‌లో విడదల రజినీపై ఫిర్యాదు అందింది. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం విడదల రజినిపై ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేటలోని తన కార్యాలయం వద్ద 2022లో రజిని తన ఇల్లు మరియు […]

స్థానిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం : కేటీఆర్‌

‘స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. వీటితోపాటు ఏ ఎన్నికలు వచ్చినా, పార్టీ వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న వాతావరణం చూస్తే.. గల్లీ ఎన్నికైనా, ఢిల్లీ ఎన్నికైనా బీఆర్‌ఎస్‌కు అనుకూలమే అన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలకు తామిచ్చిన ఎన్నికల హామీలను మర్చిపోయారని కాంగ్రెస్‌ పార్టీ అనుకుంటోంది. కానీ ‘గ్యారెంటీల’ పేరుతో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు మర్చిపోలేదు. వివిధ సామాజిక వర్గాల వారు అందరికీ హామీలు ఇచ్చి, కాంగ్రెస్ ఘోరంగా మోసం చేసింది’ […]

పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు.  మధ్యాహ్నం 2.40 గంటలకు అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం నివాసానికి వెళ్లగా పవన్ కళ్యాణ్ స్వయంగా బయటకు వచ్చి పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో కామెంట్లు, దానికి చిరంజీవి కౌంటర్ ఇచ్చిన తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ […]

విజయ్ ర్యాలీలో 33 మంది మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ !

తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ నిర్వహించిన భారీ ర్యాలీలో పెను విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఇప్పటివరకు 33 మందికి పైగా మరణించగా, 62 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాదకర సంఘటన “తీవ్ర విచారకరం” అని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మోదీతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం పవన్ […]

విజయ్ ర్యాలీలో తొక్కిసలాట..

అనుకున్న సమయానికి ఆరు గంటలు ఆలస్యంగా విజయ్ చేరుకోవడంతో ఆయనను చూసేందుకు ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారు. విజయ్‌ను చూసేందుకు ఒక భవంతి పిట్టగోడపై పలువురు చేరడంతో పిట్టగోడ కుప్పకూలిందని, దీంతో పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. దీంతో కొంత గందరగోళం, తొక్కసలాట జరిగిందని తెలుస్తోంది. దీంతో విజయ్ తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపి వేశారు. వేదికపై నుంచి ‘పోలీస్ ప్లీజ్ హెల్ప్’అంటూ విజ్ఞప్తి చేశారు.

విజయ్ దళపతి కరూర్ ర్యాలీలో తొక్కిసలాట.. 10 మంది దుర్మరణం

తమిళనాడులోని కరూర్ లో టీవీకే పార్టీ అధినేత చేపట్టిన ర్యాలీలో భారీ తొక్కిసలాట సంభవించింది. ఈ క్రమంలో భారీగా విజయ్ దళపతిని చూసేందుకు అభిమానులు భారీగా రావడంతో తోపులాట సంభవించింది. ఈ ఘటనలో పది మంది దుర్మరణం చెందగా మరో 30 మంది ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలంలోకి వెళ్లేందుకు కూడా చాలా సమయం పడుతుంది. దీంతో పెద్ద గందర గోళ వాతావరణం ఏర్పడింది.

రేవంత్ స‌ర్కార్‌ను నిల‌దీసేందుకే ఈ బాకీ కార్డు : కేటీఆర్

ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడ్డదో.. రేవంత్ స‌ర్కార్‌ను నిలదీసి అడిగేందుకే ఈ బాకీ కార్డులకు రూపకల్పన చేశామ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర స్థాయి నాయకుల నుండి క్షేత్ర స్థాయి నాయకుల వరకు, అందరం రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఈ బాకీ కార్డులను తీసుకెళ్లి ఇస్తామ‌ని ఆయ‌న తెలిపారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కాంగ్రెస్ బాకీ కార్డు విడుద‌ల చేసిన సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON