వైసీపీ కార్యకర్తల రక్షణ కోసం…కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురవుతున్న వారికి అండగా నిలబడటానికి వైసీపీ అధినేత, మాజీసీఎం వైఎస్ జగన్ డిజిటల్ బుక్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లాలో మాజీమంత్రి విడదల రజినీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ ఆవిష్కరించిన డిజిటల్ బుక్‌లో విడదల రజినీపై ఫిర్యాదు అందింది. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం విడదల రజినిపై ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేటలోని తన కార్యాలయం వద్ద 2022లో రజిని తన ఇల్లు మరియు కారుపై దాడి చేసినట్లు ఆరోపించారు.

