ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. మధ్యాహ్నం 2.40 గంటలకు అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం నివాసానికి వెళ్లగా పవన్ కళ్యాణ్ స్వయంగా బయటకు వచ్చి పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో కామెంట్లు, దానికి చిరంజీవి కౌంటర్ ఇచ్చిన తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.

