ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్‌ను ఇస్తూ ఆదేశాలిచ్చింది. రెండు ష్యూరిటీలు, రూ.2లక్షల పూచీకత్తు సమర్పించాలని ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు సూచించింది. అలాగే వారంలో రెండుసార్లు విచారణకు హాజరుకావాలని, వచ్చి సంతకాలు పెట్టాలని ఆదేశించింది. దీంతో 71 రోజులుగా జైలులో ఉన్న మిథున్ రెడ్డి రేపు ఉదయం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

