loader

విజయ్ సంచలన నిర్ణయం – ఇక రోడ్ షోలు బంద్

తమిళగ వెట్రి కజగం నాయకుడు విజయ్ తిరిగి పార్టీ ప్రచారం ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కరూర్ తొక్కిసలాట లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా విజయ్ రోడ్‌షోలను రద్దు చేసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రచార శైలిని అనుసరించే లక్ష మందికి వసతి కల్పించగల ప్రాంతంలో నగరం వెలుపల జనాన్ని సమీకరించి.. విజయ్ హెలికాప్టర్‌లో వేదికకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు.

అందరి ఫోన్లు, వాట్సాప్ ఖాతాలపై నిఘా పెట్టాం’: బీజేపీ మంత్రి

మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి చంద్రశేఖర్ బవంకులే ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ.. మీ అందరి ఫోన్లు, వాట్సాప్ ఖాతాలపై నిధా పెట్టామని అన్నారు. అంతటితో ఆగకుండా పార్టీకి నష్టం కలిగించే ఏ చిన్న పని చేసినా తమకు వెంటనే తెలిసిపోతుందని.. దానిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాను చేసిన వ్యాఖ్యలు ప్రజలందరినీ ఉద్దేశించినవి కాదని.. కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలనే తాను హెచ్చరించానని […]

ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్.. ఏఐసీసీ కీలక నేతలతో భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ నూతన కార్యాలయం ఇందిరా భవన్‌లో ఏఐసీసీ కీలక నేతలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొననున్నారు. భేటీలో డీసీసీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. ఇ

జనం బాటను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత

ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు కోట్లాడలేకపోయినందుకు నేను బహిరంగ క్షమాపణ చెప్తున్నాను. అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా’ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.‘ తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ‘జాగృతి జనం బాట’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్సీ కవిత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు.అక్టోబర్ 25న ప్రారంభమైన ఈ జాగృతి జనంబాట యాత్ర 2026 ఫిబ్రవరి 13 వరకు సాగనుంది.

కౌన్సిల్ లో వైసిపి కార్పొరేటర్ పై బయట వ్యక్తి దాడి

తిరుపతి నగర కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. సమావేశంలోకి బయట వ్యక్తి లోపలి కొచ్చి వైసిపి స‌భ్యుడిపై దాడి చేశాడు. కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ ఎస్.కె. బాబు, గణేష్ మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఇదే సమయంలో బయటకు కౌన్సిల్ లోకి దూసుకొచ్చి వైసిపి కార్పొరేటర్ గణేశ్ పై దాడికి పాల్పడ్డాడు. దీంతో కౌన్సిల్ సాక్షిగా కార్పొరేటర్ ఎస్‌.కె.బాబు క్షమాపణ చెప్పాడు.  వైసిపి కార్పొరేటర్ గణేష్ కుమార్ పై దాడి ఘటనలో ఎస్ వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ […]

రాజ్యసభ ఎన్నికల్లో ఎన్సీపీ ప్రభంజనం.. ఒక్క స్థానానికే పరిమితమైన బీజేపీ

జమ్ము కశ్మీర్‌లో ఐదేళ్ల తర్వాత నిర్వహించిన రాజ్య సభ ఎన్నికల్లో అధికార నేషనల్ కాన్ఫరెన్స్ సత్తా చాటింది. హోరాహోరీగా సాగిన ఎలక్షన్‌లో ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని పార్టీ మూడు సీట్లు గెలుపొందింది. అయితే.. అధికార పక్షానికి షాకిస్తూ ప్రతిపక్ష బీజేపీ ఒక సీటును కైవసం చేసుకుంది. ఆర్టికల్ 370ని ఎత్తివేసిన తర్వాత జమ్ముకశ్మీర్‌లో తొలిసారి బీజేపీ రాజ్యసభ స్థానాన్ని దక్కించుకుంది. రాజ్యసభ ఎన్నికల్లో చౌదరీ మొహమ్మద్ రంజాన్, సజద్ కిచ్లూ, పార్టీ కోశాధికారి జీఎస్ షమ్మీ ఒబెరాయ్‌లు […]

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ భేటీ..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో వీరిద్దరి భేటీ జరిగింది. దాదాపు రెండు గంటలపాటు వీరి సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో హైడ్రా వంటి ఒక వ్యవస్థ మంచిదే అని గతంలో పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌తో పవన్‌ కల్యాణ్‌ భేటీ అవ్వడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.

భారీ మెజారిటీ కోసం ప్రయత్నించండి.. : బీఆర్ఎస్ నాయకులతో కేసీఆర్

కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ సన్నాహక సమావేశం జరిగింది. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ పాలనతో ఇప్పటికే రాష్ట్రం గుల్ల గుల్ల అయ్యిందని అన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభ్యర్థిని నిలబెట్టి హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందని చెప్పుకొచ్చారు. మాగంటి సునీత గోపీనాథ్ గెలుపును జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని భారీ మెజారిటీ కోసం గట్టి ప్రయత్నం చేయాల్సి ఉందని పార్టీ […]

జూబ్లీహిల్స్‌‌ ఉప ఎన్నికల బరిలో 81 మంది! నామినేషన్ల స్క్రూట్నీలో హైడ్రామా!

జూబ్లీహిల్స్‌‌ ఉప ఎన్నికల నామినేషన్ స్క్రూట్నీలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని తేలింది. అన్నింటినీ కొట్టిపారేస్తు అధికారులు ఫైనల్‌ జాబితాను విడుదల చేశారు. ప్రధాన పార్టీలకు చెందిన నామినేషన్లు ఆమోదం పొందినట్టు వెల్లడించారు. స్క్రూట్నీని 17 గంటలపాటు నిర్వహించారు. స్క్రూట్నీలో 211 మంది అభ్యర్థులు వేసిన 321 నామినేషన్లను పరిశీలించారు. ఇందులో 81  మందికి చెందిన 135 మంది నామ పత్రాలకు మాత్రమే ఆమోదం తెలిపారు. మిగిలిన 130 మంది అభ్యర్థులకు చెందిన 186 […]

జేసీకి షాక్.. చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ..

ఏఎస్పీ రోహిత్‌పై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లా ఎస్పీ జగదీష్‌ స్పందించారు. ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజాయితీగా పనిచేసే అధికారిపై బెదిరింపు ధోరణి తగదని హితవుపలికారు. ఇలా బెదిరింపు ధోరణితో మాట్లాడటం చట్టరీత్యా నేరమన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గన్‌ లైసెన్స్‌ పైనా లీగల్‌ ప్రొసీజర్‌ ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ జగదీష్‌ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఏఎస్పీ రోహిత్‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON