జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ స్క్రూట్నీలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని తేలింది. అన్నింటినీ కొట్టిపారేస్తు అధికారులు ఫైనల్ జాబితాను విడుదల చేశారు. ప్రధాన పార్టీలకు చెందిన నామినేషన్లు ఆమోదం పొందినట్టు వెల్లడించారు. స్క్రూట్నీని 17 గంటలపాటు నిర్వహించారు. స్క్రూట్నీలో 211 మంది అభ్యర్థులు వేసిన 321 నామినేషన్లను పరిశీలించారు. ఇందులో 81 మందికి చెందిన 135 మంది నామ పత్రాలకు మాత్రమే ఆమోదం తెలిపారు. మిగిలిన 130 మంది అభ్యర్థులకు చెందిన 186 నామినేషన్లు తిరస్కరించారు.

