loader

మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశాయి. బీఆర్ఎస్ ఆఫీసులోని ఫర్నిచర్ బయటకు తీసుకువచ్చి నిప్పుపెట్టారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఆఫీసు ఆవరణలో ఉన్న పార్టీ నేతల ఫ్లెక్సీలు, బ్యానర్లు చించివేశి కాంగ్రెస్ కార్యకర్తలు వీరంగం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు వద్ద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేశారు. ఫెక్సీలు, ఫర్నిచర్ కు నిప్పుపెట్టడంతో చుట్టుపక్కల ఇండ్లలో షార్ట్ సర్క్యూట్ అయినట్లు […]

కిషన్ రెడ్డిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా:మంత్రి అజహరుద్దీన్

తనను దేశద్రోహి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసి వ్యాఖ్యలపై మంత్రి అజహరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఇప్పటికే ఖండించిన అజారుద్దీన్  కిషన్ రెడ్డిపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. తనపై వచ్చిన ఆరోపణలపై కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన తాను దేశ ద్రోహినా అని ఆయన ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే బిజెపి తనను టార్గెట్ చేసిందని మంత్రి అజహరుద్దీన్ దుయ్యబట్టారు.

ఫ‌సీయుద్దీన్‌ను ఎందుకు బైండోవ‌ర్ చేయ‌డం లేదు..? : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో ఓట‌ర్ల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్న కాంగ్రెస్ కార్పొరేట‌ర్ బాబా ఫ‌సీయుద్దీన్‌పై బీఆర్ఎస్ నాయ‌కుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ మండిప‌డ్డారు. బాబా ఫ‌సీయుద్దీన్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆర్ఎస్పీ పోలీసుల‌ను డిమాండ్ చేశారు. బెదిరింపులకు పాల్పడి, సర్దార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకునేలా ఉసి గొల్పి, బహిరంగంగా అందరినీ బెదిరిస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్న కాంగ్రెస్ కార్పోరేటర్ బాబా ఫసీయుద్దీన్‌ను పోలీసులు ఎందుకు బైండోవర్ చేయడం లేదు? అని ఆర్ఎస్పీ ప్ర‌శ్నించారు.

700 కోట్ల అక్ర‌మాస్తుల కేసులో మాజీ మంత్రిపై ద‌ర్యాప్తున‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

శిరోమ‌ణి అకాళీ దళ్ మాజీ మంత్రి బిక్ర‌మ్ సింగ్ మ‌జీతియాపై అక్ర‌మాస్తుల ఆరోప‌ణ‌లు ఉన్న విష‌యం తెలిసిందే. ఆ రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో అత‌నిపై కేసులో విచార‌ణ చేప‌డుతున్న‌ది. అయితే మ‌జీతియాపై ద‌ర్యాప్తు చేప‌ట్టేందుకు పంజాబ్ గ‌వ‌ర్న‌ర్ గులాబ్ చాంద్ క‌టారియా శ‌నివారం అనుమ‌తి ఇచ్చారు. మాజీ మంత్రి మ‌జీతియా వ‌ద్ద సుమారు 700 కోట్ల విలువైన అక్ర‌మ ఆస్తులు ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 2013లో డ్ర‌గ్ ట్రాఫికింగ్ నెట్వ‌ర్క్ ద్వారా సుమారు 540 కోట్లు ఆయ‌న […]

ప్రజల కోసమే పనిచేశా – ఎన్నికల వేళ నీతీశ్ వీడియో రిలీజ్

బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం నీతీశ్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. గతంలో బిహార్‌లో శాంతిభద్రతలు చాలా దారుణంగా ఉండేవని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట వాటిని మెరుగుపరిచినట్లు తెలిపారు. తన రాజకీయ జీవితంలో ప్రజల కోసమే పనిచేశానని, కుటుంబం కోసం ఏమీ చేయలేదని పేర్కొన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బిహార్‌ అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. కేంద్రం, రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి ఉండటం వల్లే దేశం […]

10 కంటే తక్కువ లేదా 150 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం: ప్రశాంత్ కిషోర్ సంచలన అంచనా

ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో  రెండు విభిన్న అవకాశాలను ప్రకటించారు. ఈ భిన్నమైన అంచనా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. తాను మాత్రం రెండు సంభావ్యతలను చూస్తున్నానని తెలిపారు. “ప్రజలు జన్ సూరాజ్‌ను ఒక ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ఆ విశ్వాసాన్ని ప్రజలు పూర్తిగా చూపిస్తే.. ఫలితం 150 సీట్లకు మించి ఉంటుందని, లేకపోతే 10 సీట్ల కంటే తక్కువకే పరిమితం కావచ్చని ఆయన పేర్కొన్నారు.

విత్ మై ఓల్డ్ ఫ్రెండ్’ అంటూ చంద్రబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్.. ‘కారు’ కోసమేనా..?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఈ తరుణంలో చంద్రబాబు తన పాత అంబాసిడర్ కారుతో దిగిన ఫోటోలను ట్విట్టర్ ఎక్స్ వేదికగా పంచుకోవడం చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ గుర్తు కారు కావడంతో.. చంద్రబాబు కేసీఆర్ పార్టీకి మద్దతిస్తున్నారని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. మాగంటి ఫ్యామిలీ గతంలో టీడీపీలో పని చేయటం, ఆమె ఏపీకి చెందిన ఆడ బిడ్డ కావటంతోనే చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు

క్రికెట్‌లోనే కాదు రాజకీయాల్లోనూ ఫిక్సరే: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ క్రికెట్‌లోనే కాదు రాజకీయాల్లోనూ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఫిక్సరేనని బజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. అజహరుద్దీన్‌ను భారత దేశ క్రికెట్ కెప్టెన్‌గా చేస్తే, ఆయన దేశం కోసం కాకుండా డబ్బుల కోసం కక్కుర్తితో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌కు మైనారిటీ ఓట్లు మాత్రమే కావాలి కానీ వారి బాగోగులు పట్టించుకోదని   రెండేళ్ళుగా మంత్రివర్గంలోకి మైనారిటీ నాయకునికి ప్రాతినిథ్యం ఎందుకు […]

4 కోట్ల మంది తెలంగాణ ప్ర‌జ‌ల గోస తీర్చాలి : కేటీఆర్

షేక్‌పేట్ డివిజ‌న్‌లో నిర్వ‌హించిన రోడ్‌షోలో కేటీఆర్,కేటీఆర్,అభ్య‌ర్థి మాగంటి సునీత‌ పాల్గొన్నారు. 4 ల‌క్ష‌ల మంది జూబ్లీహిల్స్ ఓట‌ర్ల‌కు 4 కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల గోస తీర్చే అవ‌కాశం మీ చేతికి వ‌చ్చింది. మీరు జూబ్లీహిల్స్‌లో గ‌ట్టి తీర్పు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జ‌ప్తు చేస్తే క‌చ్చితంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంది. కాంగ్రెస్ డిపాజిట్ గ‌ల్లంతు కావాలి. పెన్ష‌న్లు, తులం బంగారం, స్కూటీలు, 2500 రావాలంటే కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాల‌ని […]

పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన పోలీసుకు.. ప్రతిష్టాత్మక అవార్డ్..!

భీమవరం డీఎస్పీ ఆర్‌జీ జయసూర్య తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని.. ఆయన వ్యవహారశైలిపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన పోలీసుకు కేంద్రం అవార్డ్ ఇచ్చింది. భీమవరం డీఎస్పీ ఆర్‌జీ జయసూర్యకు అవార్డు దక్కింది. మృతదేహం డెలివరీ కేసు విషయంలో..ఆయనతో పాటు మరో ముగ్గురికి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించింది. వీరిని సమర్థులుగా కేంద్రం గుర్తించింది. ఈ అవార్డు గ్రహీతలను కేంద్రం సన్మానించినట్లు సమాచారం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON