loader

అర్ధరాత్రి ఫోన్‌ చేసినా.. అరగంటలో మీ ముందుంటాం: కేటీఆర్‌

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ బోరబండలో కేటీఆర్ రోడ్‌ షో నిర్వహించారు. ప్రతి పేద వాడికి మేం అండ‌గా నిల‌బ‌డతాం.. బుల్డోజ‌ర్లకు అడ్డంగా ప‌డుకుంటామని స్పష్టం చేశారు. సునీత‌మ్మకు అండగా నేనున్నా.. కేసీఆర్ ఉన్నారు.. ప‌క్కనే తెలంగాణ భ‌వ‌న్ ఉందని తెలిపారు. అర్ధరాత్రి ఫోన్ చేసినా అర్దగంట‌లో మీ వ‌ద్దకు వ‌స్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్లు భ‌య‌పెడితే.. మేం వ‌చ్చి వాళ్ల సంగ‌తి తేలుస్తామని స్పష్టం చేశారు.

విజయ్ కార్యాలయానికి సీబీఐ..

తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళంగం (TVK) చీఫ్ విజయ్ ఇటీవల నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాటకు సంబంధించి సీబీఐ (CBI) అధికారులు సోమవారంనాడు టీవీకే పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. కనూర్ తొక్కిసలాటకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వంటి వివరాలను అడిగినట్టు తెలిపారు. ‘అధికారులు వివరాల కోసం వచ్చారు, ఇంటరాగేషన్ కోసం కాదు. వ్యక్తిగతంగా సమన్లు జారీ చేసి వివరాలు ఇవ్వాలని కోరారు. ఆ వివరాలు అందజేసేందుకు మేము అంగీకరించాం’ అని […]

కేంద్రంలో కొత్తగా అవమానాల మంత్రిత్వ శాఖ.. మోదీపై ప్రియాంక విసుర్లు

దేశాన్ని, బిహార్‌ను అవమానించారంటూ విపక్ష నేతలపై ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ ముద్ర వేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. ఇందుకోసం కేంద్రంలో కొత్తగా అవమానాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో అవినీతి, ఎన్డీయే ప్రభుత్వ దుష్పరిపాలనపై ఒక్కమాట కూడా మాట్లాడరని విమర్శించారు. ఎన్నికల సమయంలో వరాలు ప్రకటించడానికి బదులు గత 20 ఏళ్లలో ఎన్డీయే సర్కార్ ఏమి చేసిందో మోదీ, అమిత్‌షా చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎక్స్‌ట్రీమిస్ట్ అనే పదాన్ని ఇంగ్లీషులో రాసి చూపించు’:ఒవైసీ ప్రశ్న

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న తరుణంలో.. ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనను ‘అతివాది’ (ఎక్స్‌ట్రీమిస్ట్) అని పిలిచిన తేజస్వీ.. ఆ పదాన్ని ‘పాకిస్థాన్ నుంచి తెచ్చుకున్నారా” అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. తేజస్వీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. “హే బాబూ, ‘ఎక్స్‌ట్రీమిస్ట్’ని ఒక్కసారి ఇంగ్లీషులో రాసి చూపించు” అంటూ ఎద్దేవా చేశారు.

మాజీ మంత్రి జోగి రమేశ్‌కు 13 వరకు రిమాండ్, జైలుకి తరలింపు

నకిలీ మద్యం కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి జోగి రమేశ్‌కు న్యాయస్థానం ఈ నెల 13 వరకు రిమాండ్‌ విధించింది. రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రాముకు కూడా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. జోగి రమేశ్‌, రామును పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు.తూర్పు ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో జోగి రమేశ్‌ను సుమారు 12 గంటలపాటు సిట్‌ అధికారులు విచారించారు. ఆయనతోపాటు ఆయన సోదరుడు రాముని వేర్వేరుగా, కలిపి ప్రశ్నించారు.

నా భర్తను కావాలనే ఇరికించారు.. జోగి రమేశ్‌ సతీమణి

ఏపీ లిక్కర్‌ స్కాంలో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కావాలనే మాజీ మంత్రి జోగి రమేశ్‌ను అరెస్టు చేశారని ఆయన సతీమణి శకుంతల ఆరోపించారు. తన భర్తపై చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌ కక్ష పెట్టుకున్నారని, గతంలో అగ్రి గోల్డ్‌ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని తెలిపారు. ఇప్పుడు కావాలనే నకిలీ మద్యం కేసులో ఇరికించారని అన్నారు. ఇవాళ ఉదయం తమ ఇంటికి వచ్చిన పోలీసులు, తలుపులు మూసేసి దౌర్జన్యంగా వ్యహరించారని అన్నారు.

‘బీహార్‌ను మేడ్ ఇన్ ఇండియా హబ్‌గా మార్చడమే లక్ష్యం’: ప్రధాని మోదీ

బీహార్ అసెంబ్లీ ఎన్నికల బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీఏ ఎన్నికల మ్యానిఫెస్టో, బీహార్ అభివృద్ధి గురించి కీలక ప్రకటన చేశారు. “దేశంలో అత్యధిక యువ జనాభా ఉన్న రాష్ట్రాలలో బీహార్ ఒకటి, అందుకే బీహార్‌లో విద్య, నైపుణ్యాలకు ఎన్డీఏ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. బీహార్ యువత బీహార్‌లోనే పని చేసి బీహార్‌కు ఖ్యాతిని తీసుకురావాలనేది మా సంకల్పం, బీహార్‌ను మేడ్ ఇన్ ఇండియా కేంద్రంగా మార్చడమే మా లక్ష్యం. దీని కోసం, , కుటీర […]

ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాడినికే జోగి రమేష్‌ అక్రమ అరెస్ట్‌ : వైఎస్‌ జగన్‌

ఏపీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి తప్పించు కోవడానికి చంద్రబాబు బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పట్టుబడ్డవారు మీతోనూ, నారా లోకేష్‌, మంత్రులు, ఎమ్మెల్యేలతోనూ, అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారేని ఆరోపించారు.

పెద్దోళ్ల‌కు ఒక న్యాయం..పేదోళ్ల‌కు ఒక న్యాయం..బీఆర్ఎస్

పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేద వాళ్లకు ఒక న్యాయం నినాదంతో తెలంగాణ భ‌వ‌న్‌లో ఎగ్జిబిషన్ నిర్వ‌హించారు. హైడ్రా అరాచకాలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. రాబోయే 500 రోజుల్లో కేసీఆర్ ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని, హైడ్రా వ‌ల్ల అన్యాయానికి గురైన బాధితుల‌కు న్యాయం చేస్తామ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఈ రెండేళ్ల‌లో ఒక్క ఇటుక పెట్ట‌లేదు.. ఒక్క కొత్త క‌ట్ట‌డం లేదు. ఈ రెండేళ్ల‌లో రేవంత్ రెడ్డి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON