loader

మా ట్రాక్ రికార్డును నమ్మే రికార్డు స్థాయి పోలింగ్..గెలుపు ఖాయమన్న మోదీ

బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొల దశ పోలింగ్‌లో పెద్దఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. తనకు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఉన్న ట్రాక్ రికార్డు, తమ పట్ల ప్రజలకున్న నమ్మకానికి ఇది నిదర్శనమని అన్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) అఖండ విజయం సాధిస్తుందని ఔరంగబాద్‌లో శుక్రవారంనాడు జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.

జగిత్యాల ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు- మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ భోగ శ్రావణి..!

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, భోగ శ్రావణి సంచలన ఆరోపణలు చేశారు. రూ.100 కోట్ల భూకబ్జా ఆరోపణలపై,. తాను మున్సిపల్ చైర్‌పర్సన్ గా ఉన్నప్పుడు పెట్రోల్‌ పంపు, భూ కబ్జా విషయంపై మాట్లాడితే తనను టార్గెట్‌ చేశారన్నారు పెట్రోల్ పంపు విషయంలో ఎమ్మెల్యే సంజయ్ తనను నడిరోడ్డుపై నిలబెట్టి.. నువ్వు తలదూర్చొద్దంటూ ఒత్తిడి తీసుకువచ్చారన్నారు. 1949 ఇండియన్ స్టాంప్ యాక్ట్ అమల్లోకి వస్తే 1952లో అసలు అమలులో లేని కిబాల ద్వారా స్థలం ఎలా […]

రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టింది..హరీష్ రావు

కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యకపోతే పథకాలు ఆపేస్తామని అనడానికి రేవంత్ రెడ్డి అయ్య జాగీరా అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నాడా లేదా ఆయన నాయన డబ్బులు ఇస్తున్నాడా అని మండిపడ్డారు. ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టింది.. అందుకే ప్రజలను భయపెడుతున్నాడని చెప్పారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో వికాసం, రేవంత్ రెడ్డి రెండేండ్ల పాలనలో అంతా విధ్వంసమని విమర్శించారు.

పోలీసులతో కలిసి కాంగ్రెస్‌ డ్రామా.మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి

తన ఇంట్లో ఎలాంటి డబ్బు దొరకలేదని నాగర్‌కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి అన్నారు. కూకట్‌పల్లి మోతీనగర్‌లోని ఆయన నివాసంలో ఎలక్షన్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా ఎవరూ లేని సమయంలో పోలీసులు ప్రవేశించారని చెప్పారు. తనను ఇంట్లోకి వెళ్లనీయకుండా అడ్డుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. వాచ్‌మెన్‌ను బెదిరించి తాళం తీయించి దౌర్జన్యంగా లోపలికి వెళ్లారన్నారు.

నారా లోకేష్ పర్యటనకు వచ్చినవెళ్తుండగా టీడీపీ కార్యకర్తలకు గాయాలు

మంత్రి నారా లోకేష్ నెల్లూరు జిల్లా దగదర్తి పర్యటనకు హాజరయ్యేందుకు వచ్చి వెళ్తున్న టీడీపీ కార్యకర్తలు ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 10 మంది వరకు గాయపడ్డారు. తన పర్యటనకు వచ్చి తిరిగి వెళుతున్న కార్యకర్తల ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో పలువురు గాయపడటం చాలా బాధాకరమని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆగ్రోస్ కార్పోరేషన్ ఛైర్మన్ దివంగత మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి నారా లోకేష్ టీడీపీ శ్రేణులు దారిపొడువున […]

బీహార్‌లో పోలింగ్ వేళ చెలరేగిన హింస… డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై దాడి…

బీహార్‌లో తొలి దశ పోలింగ్ వేళ హింస చెలరేగింది. బీహార్ డిప్యూటీ సీఎం, లఖిసరాయ్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ సిన్హా కారుపై దాడి జరిగింది. విజయ్ కుమార్ సిన్హా తన నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్న సమయంలో కొందరు ఆయన కారును అడ్డుకునే యత్నం చేశారు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్‌గా మారింది. ఇందులో కొందరు జనాలు చెప్పులు విసరడంతో పాటు, “ముర్దాబాద్” నినాదాలు చేయడం కనిపించింది.

ఓటు హక్కు వినియోగించుకున్న బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్.

బీహార్‌ లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం నుంచే ఓటర్‌లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పలువురు ప్రముఖలు కూడా తమతమ పోలింగ్‌ కేంద్రాల్లో ఓట్లు వేస్తున్నారు. ఇప్పటికే లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ యాదవ్‌ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బక్తియార్‌పూర్‌లోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.

మధ్యలో అడ్డురావొద్దు.. పక్కకు వెళ్లండి..పోలీసులపై నారా లోకేష్‌ ఫైర్

తెలుగుదేశం కార్యకర్తలకు, తనకు మధ్య పోలీసులు అడ్డువచ్చారంటూ మంత్రి నారా లోకేష్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. బందోబస్తు పేరుతో పోలీసులు కార్యకర్తలను పక్కకు నెట్టేస్తుండటంతో వీరి మధ్యంలో చిక్కుకున్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్‌ విజయ్‌కుమార్‌ ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన లోకేష్‌ సింగరాయకొండ సిఐ హజరత్తయ్య, టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావులపై మంత్రి లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కుటుంబంతో కలిసి ఓటేసిన లాలూ యాదవ్‌..

ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్ బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్‌, కోడలు రాజ్‌శ్రీ యాదవ్‌, కుమార్తె మీసా భారతితో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. తేజస్వి యాదవ్‌ మాట్లాడుతూ.. మహాగఠ్‌బంధన్‌ ఘన విజయం సాధించబోతున్నదని ధీమా వ్యక్తంచేశారు. బీహార్‌లో మార్పు కోసం ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.

నేటి నుంచి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ..

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ప్రక్రియను స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ మళ్లి ప్రారంభించారు. గురువారం ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు తెల్లం వెంకట్రావ్ వర్సెస్‌ వివేకానంద గౌడ్ కేసు విచారణ జరుగనుంది. తెల్లం వెంకట్రావుపై వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు. ఆయనను తెల్లం వెంకట్రావు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్‌ జగదీశ్ రెడ్డి కేసు విచారణ జరుగనుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON