loader

బాలయ్య జోలికొస్తే చర్మం ఒలిచేస్తా.. వైసీపీ నేతలకు టీడీపీ ఎమ్మెల్యే మాస్‌ వార్నింగ్‌

వైసీపీ నాయకులకు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. బాలయ్య అభిమానిగా చెబుతున్నా.. ఆయన జోలికొస్తే.. చర్మం ఒలిచేస్తామని హెచ్చరించారు. హిందూపురంలో కొందరు వెధవలు బాలయ్య గురించి మాట్లాడారని.. అందుకే ఆవేశంలో వైసీపీ కార్యాలయంపై మావాళ్లు దాడి చేశారని తెలిపారు. అదే బాలయ్య జొలికొస్తే చర్మం ఒలిచేస్తామని హెచ్చరించారు. మీకు, మీ అధినేతకు కూడా ఇదే వార్నింగ్‌ అని చెప్పుకొచ్చారు.

బీహార్ కొత్త ముఖ్యమంత్రిపై ఫుల్ క్లారిటీ.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి కీలక ప్రకటన

బీహార్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ కీలక ప్రకటన చేశారు. ఒక మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వంలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారని దిలీప్ జైస్వాల్ అన్నారు. ఆయనను నాయకుడిగా ఎన్నుకునే లాంఛనప్రాయ ప్రక్రియ మాత్రమే పూర్తి చేయాల్సి ఉందన్నారు.మంగళవారం (నవంబర్ 18) ఉదయం 10 గంటలకు ఎన్డీఏ శాసనసభా పార్టీ సమావేశం జరుగుతుందని, నితీష్ కుమార్ అధికారికంగా నాయకుడిగా ఎన్నికవుతారని ఆయన […]

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వారం లోపలే నిర్ణయం తీసుకోవాలి: గవాయి

పార్టీ ఫిరాయించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వచ్చే వారం లోపలే నిర్ణయం తీసుకోవాలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయి తెలిపారు. నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ కాంటెంప్ట్‌కు సిద్ధం కావాలని, స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ లేదని తాము ముందే చెప్పామన్నారు. న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో ఆయనే నిర్ణయించుకోవాలి అంటూ బీఆర్ గవాయి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒకే వేదికపై తెలుగు రాష్ట్రాల సీఎంలు..

రామోజీ గ్రూప్‌ వ్యవస్థాపకులు రామోజీరావు జయంతి పురస్కరించుకొని నిర్వహించిన ఈ వేడుకలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి ఒకే వేదికపై కనిపించారు. ఇద్దరూ ఆత్మీయంగా పలకరించుకోవడం అక్కడి అతిథులను ఆకర్షించింది.

లాలూ నివాసాన్ని వీడిన మరో ముగ్గురు కుమార్తెలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఘోర పరాజయం తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత కలహాలు తీవ్రస్థాయికి చేరాయి. రెండో కుమార్తె రోహిణి ఆచార్య తర్వాత ఆయన మరో ముగ్గురు కుమార్తెలు కూడా ఆ ఇంటి నుంచి వెళ్లిపోయారు. లాలూ మరో ముగ్గురు కుమార్తెలైన రాజలక్ష్మి, రాగిణి, చందా కూడా పాట్నాలోని కుటుంబ నివాసాన్ని వీడారు. తమ పిల్లలతో కలిసి ఆదివారం ఢిల్లీ వెళ్లారు. దీంతో లాలూ కుటుంబం మరింతగా చీలిపోయింది.

సభల్లో ఖాళీ కుర్చీలున్న వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు .. ఉద్ధవ్‌ ఠాక్రే

మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బీహార్‌ ఎన్నికల ఫలితాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ర్యాలీలను ఉద్ధవ్‌ ఠాక్రే ప్రస్తావించారు. ఆయన సభల్లో కనిపించిన భారీ జనసమూహం నిజమైనదా లేదా ‘ఏఐ’ ద్వారా సృష్టించారా? అని ప్రశ్నించారు. ‘భారీ జనసమూహాన్ని పొందిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. ఖాళీ కుర్చీలను ఆకర్షించిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజాస్వామ్యం లెక్క ఇది. దీనిని అర్థం చేసుకోవడం కష్టం’ […]

చంద్రబాబు, లోకేశ్‌ గొప్పల కోసం వందల కోట్లు ఖర్చు చేశారు..గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజం

విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ పార్టనర్‌షిస్‌ సమ్మిట్‌తో లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శలు గుప్పించారు. గతంలో 2014-19 మధ్యలో ఇలాగే మూడుసార్లు సీఐఐ సదస్సులు నిర్వహించి.. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చంద్రబాబు నమ్మించారని గుర్తుచేశారు. పాత సినిమాకు చంద్రబాబు కొత్త పేరు పెట్టారని విమర్శించారు. లులు చైర్మన్‌ చంద్రబాబు ఆస్థాన విద్వాంసుడు అని గుడివాడ అమర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు. ఏ సదస్సు […]

రూ.14,000 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులు వినియోగించారు.. ప్రశాంత్ కిషోర్

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం రూ.14,000 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులను సీఎం నితీశ్‌ కుమార్ ప్రభుత్వం వినియోగించిందని ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జన్‌ సురాజ్ పార్టీ ఆరోపించింది. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద 1.25 కోట్ల మహిళలకు రూ.10,000 చొప్పున నగదు బదిలీ చేయడానికి ఈ నిధులు దారి మళ్లించినట్లు విమర్శించింది. తద్వారా ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికలను ప్రభావితం చేసినట్లు ఆరోపించింది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బును తిరిగి పొందే […]

సగానికిపైగా ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు- 90 శాతం మంది కోటీశ్వరులు!

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 243 మంది ఎమ్మెల్యేలపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), బిహార్ ఎలక్షన్ వాచ్ సంచలన నివేదికను విడుదల చేశాయి. దీని ప్రకారం కొత్త ఎమ్మెల్యేల్లో సగం మందికిపైగా (130 మంది) క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఆరుగురిపై హత్య కేసులు ఉన్నాయి. ఈసారి ఎన్నికైన ఎమ్మెల్యేలలో 218 మంది (90 శాతం) కోటీశ్వరులే. ఆయా ఎమ్మెల్యేలు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON