loader

చొరబాటుదారుల ఏరివేతకే ఎస్ఐఆర్.. కాంగ్రెస్‌పై మోదీ ఫైర్

ఎన్నికల ప్రక్రియలో చొరబాటుదారులను దూరంగా ఉంచేందుకే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను ఎన్నికల కమిషన్ చేపట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అయితే చొరబాటుదారులను కాపాడేందుకు కొందరు ద్రోహులు ప్రయత్నిస్తున్నారని తప్పుపట్టారు. చొరబాట్లను నిలిపివేసేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అసోంలోని గువాహటిలో శనివారంనాడు జరిగిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ, అసోం, ఈశాన్య రాష్ట్రాలకు దశాబ్దాలుగా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని,  కాంగ్రెస్ చేసిన తప్పిదాలను తాను సరిదిద్దుతున్నానని చెప్పారు.

MGNREGAను బలహీనపర్చడం అంటే పేదల ప్రయోజనాలపై దాడి చేయడమే: సోనియా గాంధీ

నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. ఎవరినీ సంప్రదించకుండానే ఈ పథకం స్వరూపాన్ని మార్చేశారని ఆరోపించారు. ఈ చర్య పేదల ప్రయోజనాలను విరుద్ధంగా ఉందన్నారు. ఈ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడమే కాకుండా, పథకం ఉనికినే ప్రశ్నార్థకం చేసిందని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరచడం అంటే దేశవ్యాప్తంగా ఉన్న రైతులు, కూలీలు, భూమిలేని నిరుపేదల ప్రయోజనాలపై దాడి చేయడమేనని సోనియా గాంధీ స్పష్టం చేశారు.

మోదీ అడుగుజాడల్లో నడుస్తా… బీజేపీలో చేరిన సీనియర్ నటి ఆమని

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నటి ఆమని శనివారం బీజేపీ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకుని అధికారికంగా బీజేపీలో చేరారు. మీడియాతో మాట్లాడిన ఆమని.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. మోదీ ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. భారతీయులమని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాను. […]

వైఎస్‌ జగన్‌కు పవన్‌కల్యాణ్‌ వార్నింగ్‌.. అప్పుడే ఏమి చేయలేక పోయారు, ఇప్పుడేం చేస్తారు

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం పెరవలిలో డిప్యూటీ సీఎం శనివారం పర్యటించారు. అమరజీవి జలధార పథకానికి శంకుస్థాపన చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత రెండు నెలల్లో జైలుకే పంపిస్తామని వైఎస్‌ జగన్‌ రెండు రోజుల క్రితం హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపధ్యంలో పవన్‌ కల్యాణ్‌ జగన్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు. దౌర్జన్యాలకు దిగుతూ మళ్లీ వస్తామంటూ దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడేం చేస్తారని విమర్శించారు. ఎవరి బెదిరింపులకు కూటమి ప్రభుత్వం […]

స్పీకర్ సమక్షంలో చాయ్‌ పే చర్చ.. హాజరైన ప్రధాని మోదీ, ప్రియాంకా గాంధీ

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. సమావేశాల నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా తేనీటి విందు ఇచ్చారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాంధీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, రామ్మోహన్‌ నాయుడు, పలువురు అఖిలపక్ష ఎంపీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రియాంక నియోజకవర్గం వయనాడ్‌ గురించి మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష ఎంపీలు కూడా టీ పార్టీలో చేరారు. […]

తమిళనాడులో ముసాయిదా ‘SIR‌’ ఓటర్ల జాబితా ప్రచురణ.. 97 లక్షల మంది ఓటర్లు తొలగింపు

తమిళనాడులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR‌) తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్‌ శుక్రవారం విడుదల చేసింది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 97 లక్షల మంది ఓటర్లను తొలగించారు.6,44,881 మంది ఓటర్లు బదిలీ అయినట్లుగా, 3,39,278 మంది ఓటర్లు పలు ప్రదేశాల్లో నమోదు చేసుకున్నట్లుగా, 26,94,672 మంది ఓటర్లు మరణించినట్లుగా జాబితాలో పేర్కొన్నారు. ప్రస్తుతం 5.43 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

ఇంత బతుకు బతికి ఏ పార్టీనో చెప్పుకునే దమ్ము లేదు: కేటీఆర్ ఫైర్

పది మంది ఎమ్మెల్యేలతో ఎన్నికలకు వెళ్లే దమ్ముందా?  రేవంత్ రెడ్డికి   కేటీఆర్ సవాల్ విసిరారు. సిరిసిల్లలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డిది కూడా ఓ బతుకేనా అంటూ మండిపడ్డారు.. ఎమ్మెల్యేలు, స్పీకర్‌ను చూస్తే జాలేస్తుందంటూ ఆయన వ్యంగ్యంగా అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆడోళ్లా? మగోళ్లో తెలియడం లేదన్నారు. ఇంత బతుకు బతికి ఏ పార్టీనో చెప్పుకునే దమ్ము లేదంటూ రాజకీయ కండువాలు మార్చిన […]

మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు వినోద్ అరెస్ట్

మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ నేత కొడాలి నానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు, రాజకీయ సలహాదారుగా గుర్తింపు పొందిన కూనసాని వినోద్‌ను గుడివాడ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొంటున్న సమయంలో వినోద్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన వద్ద నుంచి రూ.50 వేల నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సంక్షేమం పక్కనపెట్టి ఫుట్‌బాల్‌పై రూ.10 కోట్లు ఖర్చు.. సీఎం రేవంత్‌పై కవిత విమర్శలు

ఆదివాసులు, గిరిజనులపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ పాలనలో ఆదివాసులు, గిరిజనులకు ఏం చేశారో వెల్లడించాలన్నారు.  సింగరేణి పుట్టినిల్లు ఇల్లందులో కొత్త బొగ్గు బావులు మొదలు పెట్టాలని అన్నారు. సింగరేణి కార్మికులు సంక్షేమం కోసం కాకుండా సీఎం రేవంత్ ఫుట్ బాల్ కోసం పది కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో కొత్తగూడెంకు ప్రాధాన్యం లేదని విమర్శించారు.

రేవంత్‌ నీ చీప్‌ ట్రిక్స్‌కు ఎవడూ పడిపోడు.. సీఎం వ్యాఖ్యలకు హరీశ్‌రావు స్ట్రాంగ్‌ కౌంటర్‌

రోజురోజుకీ పరిస్థితులు చేజారి పోతున్నాయనే సత్యం జీర్ణం కాక అవాకులు చెవాకులు పేలుతూ అక్కసు వెళ్లగక్కిండన్నారు. త్వరలోనే తనకు పతనం తప్పదనే సంగతి అర్థమై ఆగమాగం అవుతున్నడని.. తన కుర్చీ త్వరలోనే ఊడుతుందని, తన దోపిడీ ఆగిపోతుందనే భయంతో రేవంత్ రెడ్డి ఇవాళ్టి ప్రెస్‌మీట్‌లో అడ్డగోలుగా వాగిండని.. నాకు, కేటీఆర్‌కు మధ్యమిత్ర బేధం సృష్టించాలని.. తద్వారా బీఆర్ఎస్‌ను బలహీన పరచాలని రేవంత్ రెడ్డి చీప్ ట్రిక్ ప్లే చేస్తున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డీ నీ చీప్ ట్రిక్కులకు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON