మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ నేత కొడాలి నానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు, రాజకీయ సలహాదారుగా గుర్తింపు పొందిన కూనసాని వినోద్‌ను గుడివాడ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొంటున్న సమయంలో వినోద్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన వద్ద నుంచి రూ.50 వేల నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

