loader

పవన్ కళ్యాణ్ రూట్‌లోనే నాగబాబు.. తెరపైకి కొత్త డిమాండ్..

పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే కోరారు. అయితే పవన్ కళ్యాణ్ సూచించిన విధంగానే పవన్ కళ్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రజా ప్రతినిధులు అందరూ తమ వాణి వినిపించాలని సూచించారు. పెనుగొండ సుబ్బారాయుడు నేతృత్వంలో పలువురు ఆర్యవైశ్య నేతలు.. ఎమ్మెల్సీ నాగబాబు సమక్షంలో ఆదివారం జనసేన పార్టీలో చేరారు.

ఎర్రవల్లి టు హైదరాబాద్.. రేపు అసెంబ్లీకి కెసిఆర్

సోమవారం (డిసెంబర్ 29) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీకి హాజరుకావాలని బిఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ నుంచి కెసిఆర్ హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. తాను అసెంబ్లీ సమావేశాలకు వస్తానని అధికార పక్షం ఎలాంటి ఎజెండాను ఖరారు చేస్తుందో చూసి ముందుకు వెళ్దామని పార్టీ నేతలతో కెసిఆర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

నిఖార్సైన మాస్‌ లీడర్‌ పీజేఆర్‌ : కేటీఆర్‌

కాంగ్రెస్‌ పార్టీ దివంగత నాయకుడు పీజేఆర్‌ నిఖార్సైన మాస్‌ లీడర్‌ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. పీజేఆర్‌ 18వ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఖైరతాబాద్‌ చౌరస్తాలోని పీజేఆర్‌ విగ్రహానికి కేటీఆర్‌ పూలమాల వేసి నివాళులు అర్పించారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి పీజేఆర్‌ చేసిన కృషి చిరస్మరణీయమని కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ నగర రాజకీయాల్లో 50 ఏళ్లపాటు చెరగని ముద్రవేసిన ధీశాలి పీజేఆర్‌ అని ఆయన కొనియాడారు.

ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇవాళ (డిసెంబర్ 28)న ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఘనంగా జరుపుకుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ మతం పేరుతో ఓట్లు అడగలేదని, ప్రజలను ఐక్యం చేస్తుందని.. . ‘ఎన్నికల గురించి కాదు.. దేశం కోసమే […]

జన నాయగన్’ ఆడియో రిలీజ్.. ‘టీవీకే’ నినాదాలపై విజయ్ స్వీట్ వార్నింగ్ వైరల్

తమిళ స్టార్ విజయ్ లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’ కౌలాలంపూర్‌లో ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ స్టేజ్‌పైకి రాగానే అభిమానులు ‘టీవీకే.. టీవీకే’ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దీనిపై విజయ్ కాస్త అసహనం వ్యక్తం చేస్తూ, ఇది సినిమా ఫంక్షన్ అని, ఇక్కడ రాజకీయాల ప్రస్తావన వద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాటలు చెప్పిన విధానం అభిమానులను ఆలోచింపజేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అది ఉన్మాదం.. మీది కడుపుమంట.. మంటపెట్టిన జంతు బలి-2

మరోవైపు వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా సంబరంగా జరగడం చూసి కూటమి నేతలకు కడుపుమంటగా ఉందని వైసీపీ నేత వరుదు కళ్యాణి ఆరోపించారు. కడుపు మంట ఎక్కువై.. సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, డీజీపీ,  వైసీపీ కార్యకర్తలపై ఏవిధంగా అక్రమ కేసులు పెట్టాలా అని ఆలోచిస్తున్నారని విమర్శించారు. బాలకృష్ణ సినిమా విడుదల సమయంలో చేసిన జంతు బలుల గురించి ఎందుకు మాట్లాడరని..ఓజీ సినిమా అప్పుడు కత్తులు చూపిస్తే ఎందుకు మాట్లాడలేదని హోం మంత్రి వంగలపూడి అనితను […]

అది ఉన్మాదం.. మీది కడుపుమంట.. మంటపెట్టిన జంతు బలి-1

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా మేకలు, పొట్టేళ్లు నరికి వాటి రక్తంతో వైఎస్ జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేయటం వివాదాస్పదమవుతోంది. హోం మంత్రి.. వైఎస్ జగన్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అభివృద్ధిని అడ్డుకోవటానికి వైసీపీ నేతలు ఎంతకైనా దిగజారుతున్నారని ఆరోపించారు. బహిరంగ స్థలాల్లో జంతుబలి నేరమన్న హోం మంత్రి అనిత.. ఇలాంటి చర్యలతో ఉన్మాదుల తరహాలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఫుట్‌బాల్‌ ఆడేందుకు డబ్బులుంటయి.. కానీ పేదల ఇండ్లకు ఉండవా..?

రూ.100 కోట్లు పెట్టి మనువడితో ఫుట్‌బాల్‌ ఆడడానికి డబ్బులు ఉంటాయి కానీ పేదలకు డబుల్ బెడ్‌రూమ్ నిర్మించి ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దగ్గర డబ్బులు ఉండవా..? అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఘాటుగా విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్‌రూమ్‌ను అర్హులైన పేద ప్రజలకు పంపిణీ చేయాలని..అలాగే నిర్మాణంలో ఉన్న 248 ఇండ్లను పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో డబుల్ బెడ్‌రూమ్‌ల వద్ద లబ్దిదారులతో కలిసి శనివారం […]

అక్రమ కేసులకు వైసీపీ భయపడదు..మూల్యం చెల్లించుకోక తప్పదు: కాకాణి గోవర్థన్ రెడ్డి

‘వైఎస్ జగన్ రాజకీయంగా ఎదుర్కోలేక, జగన్‌ని నమ్మిన వ్యక్తులపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించి…చంద్రబాబు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు’అని కాకాణి గోవర్థన్ రెడ్డి ధ్వజమెత్తారు. ‘కూటమిపాలనలో ఫ్లెక్సీలు కట్టినా, సోషల్ మీడియా పోస్టింగ్‌లు పెట్టినా కేసులు పెడుతున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడేవారిపై కేసులు సృష్టించి మరీ జైళ్లకు పంపుతున్నాడు’అని మాజీమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైసీపీ నాయకులను జైలుకు పంపడం తప్ప, మరేమీ చేయలేదు అని మాజీ ఎమ్మెల్యే […]

బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై దిగ్విజ‌య్ సింగ్ ప్ర‌శంస‌లు.. మోదీ ఫోటో పోస్టు

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేసిన ఫోటో తీవ్ర దుమారాన్ని రేపుతున్న‌ది. ఆయ‌న ఆ ఫోటోపై చేసిన కామెంట్ కూడా పెను చ‌ర్చ‌కు దారి తీస్తున్న‌ది. అట్ట‌డుగు స్థాయిలో ప‌నిచేసే ఆర్ఎస్ఎస్ వ‌ర్క‌ర్లు, జ‌న్ సంఘ నేతలు ఫోటోలో ఉన్నార‌ని, నేల‌పై కూర్చున్న వ్య‌క్తి ముఖ్య‌మంత్రి, ప్ర‌ధాన‌మంత్రి అయిన‌ట్లు పేర్కొన్నారు. ఇది ఆ సంస్థ శ‌క్తి అని, జై సియా రామ్ అంటూ దిగ్విజ‌య్ సింగ్ పోస్టు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON