‘వైఎస్ జగన్ రాజకీయంగా ఎదుర్కోలేక, జగన్ని నమ్మిన వ్యక్తులపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించి…చంద్రబాబు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు’అని కాకాణి గోవర్థన్ రెడ్డి ధ్వజమెత్తారు. ‘కూటమిపాలనలో ఫ్లెక్సీలు కట్టినా, సోషల్ మీడియా పోస్టింగ్లు పెట్టినా కేసులు పెడుతున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడేవారిపై కేసులు సృష్టించి మరీ జైళ్లకు పంపుతున్నాడు’అని మాజీమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైసీపీ నాయకులను జైలుకు పంపడం తప్ప, మరేమీ చేయలేదు అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అని ధ్వజమెత్తారు.

