loader

చంద్రబాబూ.. ఎప్పుడైనా విన్నావా? చూశావా? చేశావా?

తాము చేపట్టిన భూ రీసర్వేను కూడా తన ఖాతాలోకి వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నిజానికి.. రీసర్వే ఆలోచన నాకు పాదయాత్ర సమయంలోనే వచ్చింది. రైతులు విన్నవించిన అనేక సమస్యలకు ఈ రీసర్వే పరిష్కారం కాగలదని భావించాను. చంద్రబాబుకు వచ్చిందల్లా భూములను నిషేధిత జాబితా (22ఏ)లో పెట్టడం మాత్రమేనని ఎద్దేవా చేశారు. నాలుగుసార్లు సీఎంగా ఉండి.. ఎనిమిది పదుల వయసు దగ్గర పడుతున్న చంద్రబాబుకి ఏనాడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా? చంద్రబాబూ ఇలాంటిది ఏనాడైనా విన్నావా? చూశావా? […]

బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకుల హత్యాయత్నం

జిల్లాలోని భూత్పూర్‌ మండలం మద్దిగట్ల గ్రామంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కార్యకర్త వెంకటేశ్‌ బీఆర్ఎస్‌ సానుభూతిపరుడు విజయానికి కృషి చేశాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భూత్పూర్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూపతిరెడ్డి మరికొందరు కిడ్నాప్‌ చేశారని బాధితుడు ఆరోపించారు. కారులో అడవిలోకి తీసుకెళ్లి మారణాయుధాలతో దాడి చేసి హత్యాయత్నం చేశారని పేర్కొన్నారు. పోలీసులు స్పందించి తనపై హత్యాయత్నానికి పాల్పడ్డ నిందితులపై చట్టపర చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

వైసీపీ అధినేత జగన్‌ కీలక నిర్ణయం.. మళ్లీ పాదయాత్రకు సిద్దం!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేజ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో మరోసారి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ప్రతి వారం ఒక్కొ నియోజవర్గం చొప్పున పాదయాత్ర చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్రను మొదలు పెట్టనున్నట్టు ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

వైసిపి కార్యకర్త హత్య… జగన్ ను కలిసిన మృతుడి కుటుంబ సభ్యులు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మందా సాల్మన్ కుటుంబ సభ్యులు కలిశారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైసిపి కార్యకర్త సాల్మన్‌పై టిడిపి కార్యకర్తులు దాడి చేయడంతో చనిపోయాడు. హత్య రాజకీయాలను ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మృతుడి కుమారుడు ఆరోపణలు చేశాడు. తాడేపల్లిలోని వైసిపి కార్యాలయంలో వైఎస్ జగన్‌ను సాల్మన్ కుమారులు, కుమార్తె కలిసింది.

మీ ఫోన్ ట్యాప్ అయ్యింది..హరీష్ రావుకు సిట్..బిగ్ ట్విస్ట్

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో బిగ్ ట్విస్ట్. సిట్ ఆదేశాల మేరకు విచారణకు హాజరైన హరీష్ రావుకు సిట్ అధికారులు.. ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొన్ని నెలల పాటు హరీష్‌ రావు ఫోన్‌ ట్యాప్‌ చేసినట్లు, హరీష్‌ రావు ఫోన్‌ ఎప్పుడు ట్యాప్‌ అయిందో.. ఆ తేదీలను పోలీసులు ఆయనకు ఇచ్చినట్లు తెలుస్తోంది. హరీష్ రావుతోపాటు ఆయన అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్‌ అయినట్లు […]

మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలి.. ఎమ్మెల్యే విజయుడిపై దాడిని ఖండించిన కేటీఆర్

అలంపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి దాడిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అని పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు, గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారిన రాజకీయానికి ఇది నిదర్శనమని తెలిపారు. ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యేను అవమానిస్తూ, శారీరక దాడికి దిగడం కాంగ్రెస్ సంస్కృతి ఎంత దిగజారిందో అర్థమవుతుందని కేటీఆర్ మండిపడ్డారు.

ఉపాధి హామీ పథకం అంతానికి కుట్ర- పేదల పొట్టకొట్టి అంబానీలకు పెడతారా? : రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గమైన ఉత్తర్​ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో కార్యకర్తల సమావేశంలో మోదీ సర్కార్ తీరును ఎండగట్టారు. మోదీ విధానాలు కార్పొరేట్లకు కొమ్ముకాసేలా ఉన్నాయని “ప్రధాని మోదీకి ఉపాధి హామీ పథకం అంటే గిట్టదు. ఈ పథకాన్ని ఎగతాళి చేశారు. ఇప్పుడు దాన్ని పూర్తిగా ఎత్తేయాలని చూస్తున్నారు. పేద కార్మికులకు దక్కాల్సిన డబ్బును, అదానీ, అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తలకు మళ్లించడమే ఆయన లక్ష్యం.దేశ సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉండాలని మోదీ కోరుకుంటున్నారు. మేం పేదలను కాపాడుతుంటే,మోదీ […]

దమ్ముంటే ఆ వీడియో బయటపెట్టు..! సీఎం రేవంత్‌కు హరీష్ రావు సవాల్

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “రేవంత్ రెడ్డి.. నీకు దమ్ముంటే నన్ను విచారించినప్పుడు తీసిన పూర్తి వీడియోను బయటపెట్టు. అంతేగానీ నీ పత్రికలకు చిల్లర లీకులు ఇవ్వొద్దు” అని ఘాటుగా హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనను ‘లీకుల ప్రభుత్వం – స్కాముల ప్రభుత్వం’గా హరీశ్ రావు అభివర్ణించారు. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఈ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

కేరళ అసెంబ్లీలోనూ వివాదం.. ప్రసంగంలో కొన్ని పేరాలు చదవని గవర్నర్

తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ వాకౌట్ చేసిన సెగలు తగ్గక ముందే.. కేరళలోనూ అటువంటి ఉద్రిక్త పరిణామమే చోటుచేసుకుంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చేసిన విధాన ప్రసంగం ఇప్పుడు వివాదానికి దారితీసింది. కీలక భాగాలను గవర్నర్ ఉద్దేశపూర్వకంగా చదవకుండా దాటవేయడంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి మండలి ఆమోదించిన పాఠంలో కేంద్ర ప్రభుత్వంపై ఉన్న విమర్శలను, రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావించే 12, 15వ పేరాలను గవర్నర్ స్కిప్ చేయడంపై […]

సింహం గుర్తుతో బరిలోకి జాగృతి? మున్సిపల్ ఎన్నికలపై భేటీ

తెలంగాణ రాజకీయాల్లో జాగృతి పార్టీ తన అడుగులను మరింత స్పష్టంగా వేస్తోంది. హైదరాబాద్‌లోని తన నివాసంలో జాగృతి అధ్యక్షురాలు కవిత ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో సుమారు 20 నుంచి 30 స్థానాల్లో జాగృతి అభ్యర్థులను బరిలోకి దింపే అవకాశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. జాగృతి పార్టీ సింహం గుర్తుపై పోటీ చేసే అవకాశాలపై అంతర్గతంగా కసరత్తు చేస్తుండగా, అదే సమయంలో పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో సింహం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON