తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ వాకౌట్ చేసిన సెగలు తగ్గక ముందే.. కేరళలోనూ అటువంటి ఉద్రిక్త పరిణామమే చోటుచేసుకుంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చేసిన విధాన ప్రసంగం ఇప్పుడు వివాదానికి దారితీసింది. కీలక భాగాలను గవర్నర్ ఉద్దేశపూర్వకంగా చదవకుండా దాటవేయడంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి మండలి ఆమోదించిన పాఠంలో కేంద్ర ప్రభుత్వంపై ఉన్న విమర్శలను, రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావించే 12, 15వ పేరాలను గవర్నర్ స్కిప్ చేయడంపై సీఎం నేరుగా స్పీకర్‌కే ఫిర్యాదు చేశారు.

