loader

జోగి రమేష్‌ ఇంటిపై దాడి కేసులో 11 మంది టీడీపీ కార్యకర్తల అరెస్ట్ – విడుదల

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి ఘటనలో 40 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయగా, అందులో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు గుర్తించిన 11 మందిని సోమవారం ఉదయం అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితులకు పోలీసులు వెనువెంటనే స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. వీరికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించివేయడంతో వైసీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులపై పెట్టిన సెక్షన్లు బెయిల్‌కు అనుకూలంగా ఉండటంతోనే ఇలా […]

మీరు దర్యాప్తు బృందానికి చీఫ్‌ అనే సంగతి గుర్తుచేసుకోండి.. సిట్‌ చీఫ్ సజ్జనార్‌కు కేటీఆర్‌ హితవు

‘చట్టవిరుద్ధమైన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించడం ముగిసింది’ సజ్జనార్‌ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘కమిషనర్‌గారూ (సజ్జనార్‌ను ఉద్దేశించి) మీరే న్యాయమూర్తిగా, జ్యూరీగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లుగా కనబడుతున్నారు. దయచేసి మీరు దర్యాప్తు బృందానికి చైర్మన్‌గా ఉన్నారనే విషయాన్ని గుర్తుచేసుకోండి. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు చట్టవిరుద్ధమా, చట్టబద్ధమా..? అనేది చట్టపరంగా కోర్టు ద్వారా నిరూపణ కావాల్సి ఉంది’ అని కేటీఆర్‌ తన పోస్టులో పేర్కొన్నారు.

ఏపీలో అరాచకాలపై జాతీయ స్థాయి ఉద్యమం : బొత్స

రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై జాతీయ స్థాయి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని శాసన మండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు. జాతీయ ఉద్యమం కోసం వైఎస్‌ జగన్‌తో మాట్లాడి కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చట్టాలను చేతుల్లోకి తీసుకుని వైసీపీ నాయకులపై మూడ్రోజులుగా దుర్మార్గానికి పాల్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి ఇళ్లు దహనం, జోగి రమేష్‌ ఇంటిపై పెట్రోలు బాంబులు వేయడం దౌర్జన్య పాలనకు పరాకాష్ట అని విమర్శించారు.

ఏపీలో అలజడులకు కుట్ర, వైసీపీ ట్రాప్‌లో పడొద్దు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో హింసను ప్రేరేపించటానికి వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అలజడి సృష్టించేందుకే ఆ పార్టీ నేతలు బూతులు మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు.   సోమవారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పార్టీ నేతలు చాలా అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా వైసీపీ ట్రాప్‌లో పడొద్దు అని సూచించారు. మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు కామెంట్లు తరువాత జరుగుతున్న పరిణామాలపై నేతలతో చర్చించారు.

సూర్యాపేటలో ..! టికెట్ రాలేదని పెట్రోల్ పోసుకొని కాంగ్రెస్ నాయకుడి ఆత్మహత్యాయత్నం

సూర్యాపేట జిల్లాలోని కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు భగ్గుమంటున్నది. మున్సిపల్ ఎన్నికలు సమీస్తున్న కొద్దీ ఆ పార్టీలో అసంతృప్త నేతలు తిరుగుబావుటాను ఎగరవేస్తున్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 25వ వార్డులో కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుడు కోడి శివ యాదవ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడ్డాడు. గత మున్సిపల్ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్లకు ఇస్తే సపోర్ట్ చేశామన్నారు. కానీ, ప్రస్తుతం తనకు ఇవ్వాల్సి ఉండగా అలా కాకుండా రమేష్ రెడ్డి వర్గానికి […]

హైకోర్టును ఆశ్రయించిన జోగి రమేశ్ కుమారుడు

వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు రోహిత్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తమ ఇంటికి నిప్పుపెట్టిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల తమ ఇంటి వద్ద జరిగిన అగ్నిప్రమాదం వెనుక ఉద్దేశపూర్వక కుట్ర ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు రోహిత్. అదే విధంగా.. తమ ఇంటి వద్ద తగిన భద్రత కల్పించాలని కోరుతూ మరో అనుబంధ పిటిషన్‌నూ ఆయన దాఖలు చేశారు.

ఇది కేరళ వ్యతిరేక బడ్జెట్‌.. పార్లమెంట్‌ ఆవరణలో కేరళ ఎంపీల నిరసన..

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం లోక్‌సభ లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై  కేరళకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తంచేశారు. ఇవాళ ఉదయం పార్లమెంట్‌ ఆవరణలో వారు నిరసనకు దిగారు. కేంద్ర బడ్జెట్‌ పూర్తిగా కేరళ వ్యతిరేక బడ్జెట్‌ అని వారు మండిపడ్డారు. బడ్జెట్‌లో కేరళకు అన్యాయం జరిగిందని విమర్శించారు. బడ్జెట్‌లో కేరళ పేరును కూడా ప్రస్తావించకపోవడం దారుణమని అన్నారు. కేరళకు ఆయుర్వేద యూనివర్సిటీ కేటాయిస్తారని ఆశించామని, కేంద్ర మంత్రి ఆయుర్వేద యూనివర్సిటీని స్థాపించనున్నట్లు ప్రకటించినా, అది ఎక్కడ అనే విషయం మాత్రం వెల్లడించలేదని […]

టీవీకే రాకతో 2026 ఎన్నికల ముఖచిత్రం మారిపోయింది- అధికారం మాదే: విజయ్

టీవీకే పార్టీ రాకతో తమిళనాడులో రాజకీయ వాతావరణం మారిందని అధినేత విజయ్ తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని అన్నారు. తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రారంభించి సోమవారంతో రెండేళ్లు పూర్తి చేస్తుకున్న సందర్భంగా విజయ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్​లో పోస్ట్ చేశారు. సవాళ్లు ఎదురైనా టీవీకే స్థిరంగా ఉందని, సామాన్య ప్రజలకు సాధికారత కల్పించే రాజకీయాల కోసం దీనిని ఒక ఉద్యమంగా అభివర్ణించారు. పాలనా పగ్గాలను చేజిక్కించుకునే ప్రజాస్వామ్య లక్ష్యాన్ని మనం దృఢంగా సాధిస్తాం’ […]

“బాబుగారి అండతో మోదీ ప్రధాని అయినా.. రాష్ట్రానికి గుండు సున్నా”

2026-27 కేంద్ర బడ్జెట్ మీద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. “ఎన్డీఏలో చంద్రబాబు కీలకంగా ఉన్నా.. రాష్ట్రానికి ప్రయోజనం గుండు సున్నా. బాబు గారి అండతో ప్రధానిగా నిలబడిన మోదీ.. ప్రతి సారి బడ్జెట్లో మనకు చేస్తున్నది ఘరానా మోసమే. 50 లక్షల కోట్ల బడ్జెట్‌లో ఈ సారి సైతం రాష్ట్రానికి మొండి చెయ్యే. ఇంత జరుగుతున్నా కూడా సీఎం చంద్రబాబు నాయుడు నోరు మెదపటం లేదని విమర్శించారు.

సిట్ అధికారులు చట్టాన్ని గౌరవించలేదు.. ప్రతి ప్రశ్నకు కేసీఆర్ కుండ బద్ధలు కొట్టినట్టు బదులిచ్చారు ..!

బీఆర్ఎస్ అధినేత కేసీర్ సిట్ విచారణపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సిట్ అధికారులు చట్టాన్ని గౌరవించలేదని, అయినా సరే కేసీఆర్‌ను విచారణకు సంపూర్ణంగా సహకరించారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగించినట్టుగా సిట్ ప్రశ్నలు వేస్తోందని మండిపడిన ఆయన.. ప్రతి పశ్నకు కుండబద్ధలు కొట్టినట్టు కేసీఆర్ బదులిచ్చాని వెల్లడించారు. సిట్ విచారణ ఎర్రవల్లిలోనే జరిపే విషయంపై కోర్టుకు వెళ్తే తమకు అనుకులూంగా తీర్పు వచ్చేదని.. కానీ తాము అలా చేయలేదని కేటీఆర్ చెప్పారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON