తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పర్వంలో భాగంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ఆశగా ఉద్భవించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అధినేత విజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైలోని నీలాంగరైలో ఉన్న పోలింగ్ కేంద్రానికి విజయ్ తన నివాసం నుండి పోలింగ్ స్టేషన్‌కు సైకిల్‌పై రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన సైకిల్‌పై వస్తున్నారని తెలియడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు.
జనసందోహం నడుమ ఆయన పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి తన ఓటు వేశారు.

