ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి ఘటనలో 40 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయగా, అందులో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు గుర్తించిన 11 మందిని సోమవారం ఉదయం అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితులకు పోలీసులు వెనువెంటనే స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. వీరికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించివేయడంతో వైసీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులపై పెట్టిన సెక్షన్లు బెయిల్‌కు అనుకూలంగా ఉండటంతోనే ఇలా జరిగిందని చెబుతున్నారు.

