ఆంధ్రప్రదేశ్లో హింసను ప్రేరేపించటానికి వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అలజడి సృష్టించేందుకే ఆ పార్టీ నేతలు బూతులు మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. సోమవారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ నేతలు చాలా అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా వైసీపీ ట్రాప్లో పడొద్దు అని సూచించారు. మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు కామెంట్లు తరువాత జరుగుతున్న పరిణామాలపై నేతలతో చర్చించారు.

