ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ లీసా గిల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఏప్రిల్ 25న జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 217 (1) ప్రకారం రాష్ట్రపతి ఈ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు

