ఆంధ్రప్రదేశ్‌లో అంతర్రాష్ట్ర క్రిమినల్ భీముడు అజిత్ కుమార్ పరారీ ఎపిసోడ్ సంచలనంగా మారింది. గుండెనొప్పి పేరుతో నాటకమాడి ఆస్పత్రిలో చేరి.. అక్కడ నుంచి కూల్‌గా అందరి కళ్లుగప్పి పారిపోయాడు. భీముడు అనారోగ్యం పేరుతో గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లేందుకు జైలు సూపరింటెండెంట్ సహకారం అందించినట్లు తేలడంతో సబ్‌జైలు సూపరింటెండెంట్ మన్నెం వెంకటేశ్వరరావు సస్పెండ్ అయ్యారు ఒంగోలు జైలులో కూడా అనారోగ్యం పేరు చెప్పి ఆస్పత్రికి వెళ్లి పారిపోయాడు. ఆ సమయంలో జైలు వార్డర్లు దేవపాల్, సుభాష్‌లను అధికారులు సస్పెండ్ చేశారు..

