loader

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నుంచి కాపాడండి

డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు నుంచి ఉండి నియోజకవర్గాన్ని కాపాడాలంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు విజ్ఞప్తి చేశారు. తనను చంపించేందుకు రఘురామ కుట్ర పన్నారని చెప్పారు. తనను చంపాలని కుటుంబ సభ్యుల ఎదుటే అనుచరుడిని ఆదేశించారని తెలిపారు. ఆయన పక్కన ఉండి వ్యవహారాలు చక్కబెట్టే కొత్తపల్లి నాగరాజు సహకారంతో ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

లక్కీడ్రాలోనూ బీఆర్ఎస్‌కు నిరాశే.. జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం

రెండు రోజుల హైడ్రామా తరువాత జరిగిన జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మున్సిపాలిటీ కోసం జరిగిన ఓటింగ్ లో రెండు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో నిర్వహించిన లక్కీ డ్రాలో కాంగ్రెస్ పార్టీని అదృష్టం వరించింది. దాంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. జనగామ మున్సిపల్ చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన కడకంచి బాలమణి ఎన్నికైనట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్‌గా తూణం శ్రవణ్ […]

చైర్మన్ ఎన్నికకు వెళ్లకుండా మధుసూదనచారిని అడ్డుకున్న పోలీసులు

మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు వెళ్లకుండా ఇంచార్జిలు మధుసూదనాచారి, సత్యవతి రాథోడ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. తొర్రూరు వెళ్లకుండా మహబూబాబాద్‌ఋలోనే సత్యవతి రాథోడ్‌ను హౌస్ అరెస్టు చేశారు. ఇక మధుసూదనచారిని అమరావతి నగర్‌లోని తులసీ బార్ ఎదురుగా ఉన్న శాంతినికేతన్ అపార్ట్‌మెంట్‌లో సుబేదారి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తన 45 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని చెప్పారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నా పోలీసులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని […]

హంగ్ మున్సిపాలిటీలపై కేటీఆర్ ఫోకస్, కొత్త ఇన్‌ఛార్జులు!

హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎనిమిది పట్టణాల్లో ఎన్నికల పరిస్థితులను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు సీనియర్ నేతలను ప్రత్యేక ఇన్‌ఛార్జులుగా నియమించారు. తొర్రూర్:  మధుసూదనాచారి, సత్యవతి రాథోడ్, జనగామ:  బండ ప్రకాశ్,  పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి క్యాతనపల్లి: ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఖానాపూర్: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇంద్రేశం: ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి,  కాగజ్‌నగర్:  జోగు రామన్న జహీరాబాద్: చింతా ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి ఇబ్రహీంపట్నం:  సబితా ఇంద్రారెడ్డి, శంభీపూర్ […]

మహబూబ్ నగర్ మేయర్ గా జి మమత ఎన్నిక..

మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా జి మమత ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 60 డివిజన్లకు గాను కాంగ్రెస్ పార్టీ నుంచి మూడవ డివిజన్ కార్పొరేటర్ జి మమత ను మేయర్ గా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతోపాటు అందరి మద్దతుతో ఎన్నికల ప్రక్రియ లాంచనంగా కొనసాగించారు.

బీజేపీకే దక్కిన కరీంనగర్ మేయర్ పీఠం

కరీంనగర్ మేయర్‌ పీఠం ఏ పార్టీకి దక్కనుందనే ఉత్కంఠకు తెర పడింది. కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. మేయర్‌గా ఆ పార్టీకి చెందిన కొలగాని శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు. 34 మంది కార్పొరేటర్ల మద్దతుతో మేయర్‌ పీఠాన్ని కమలదళం దక్కించుకుంది. డిప్యూటీ మేయర్‌గా అదే పార్టీకి చెందిన సునీల్‌రావు నియమితులయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ప్రకటించారు. కరీంనగర్‌ మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవడంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌ వ్యూహత్మకంగా వ్యవహరించారు. మేయర్ పదవికి పోటీ పడ్డ కాంగ్రెస్‌ అభ్యర్థికి […]

పాలకుడిగా నేను ఎప్పుడూ ప్రవర్తించలేదు – సేవకుడిగా మాత్రమే వ్యవహరిస్తున్నా : సీఎం రేవంత్ రెడ్డి

తాము పాలకులం కాదు సేవకులమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తమకు సేవ చేయడానికే ప్రజలు అవకాశం ఇచ్చారని తెలిపారు. పాలకుడిగా తాను ఎప్పుడూ ప్రవర్తించలేదని, సేవకుడిగా మాత్రమే వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. నేనే రాజు నేనే మంత్రి వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. గెలుపు ఓటమి అన్నింటికీ తానే బాధ్యత తీసుకుంటానని చెప్పానన్నారు. అచ్చంపేట అడవుల్లో 20 ఎకరాల్లో సంత్ సేవాలాల్​ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

నేను పంచిన చీరలు, డబ్బులు తిరిగి ఇవ్వండి.. ఇంటింటికీ తిరుగుతున్న కాంగ్రెస్‌ అభ్యర్థి

మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడిపోవడంతో కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు వింత పోకడలకు వెళ్తున్నారు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం.జ్యోతి ఓడిపోయారు. దీంతో ఎన్నికల ముందు తాను ఇచ్చిన డబ్బులు, చీరలు తిరిగి ఇవ్వాలని కుటుంబసభ్యులతో కలిసి ఇంటింటికీ తిరిగి వసూలు చేస్తున్నారు. జ్యోతి తీరుపై స్థానిక ఓటర్లు మండిపడుతున్నారు. అసలు చీరలు ఎవరు ఇవ్వమన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన బెల్లంపల్లి కౌన్సిలర్లు

బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. శనివారం బెల్లంపల్లికి చెందిన పలువురు కౌన్సిలర్లు బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. పార్టీలో చేరిన వారికి కెటిఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్‌తో పాటు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి బిఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. వీరితో పాటు బిజెపికి చెందిన 34వ వార్డు అభ్యర్థి […]

రైతు సంఘాల నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై చర్చ

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పలు రైతు సంఘాల నేతలను కలిశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన ఆయన పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో రైతు నేతలతో భేటీ అయ్యారు. భారత్‌, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలపై చర్చించారు.  భారత్‌, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలపై రైతు సంఘాల నేతలతో రాహుల్‌ గాంధీ చర్చించారు.  రైతుల ప్రయోజనాలు కాపాడటంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON