loader

కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు..

గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కాజీపేట రైల్వే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తీవ్ర ఉత్కంఠ మధ్య బెయిల్‌ మంజూరు అయిన తర్వాత కౌశిక్ రెడ్డి విడుదల అయ్యారు. బెదిరింపు కేసుపై సుమారు 4గంటల పాటు వాదనలు జరిగిన తర్వాత కాజీపేట రైల్వే కోడ్ జడ్జి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. దీంతో బీ అర్ ఎస్ శ్రేణులు ఆనందం మునిగాయి.

తయారీ రంగంలో తిరోగమన అభివృద్ధి కనిపిస్తోంది..రాహుల్

రాహుల్‌గాంధీ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. మేకిన్‌ ఇండియాతో దేశంలో తయారీరంగ పరిశ్రమ కొత్తపుంతలు తొక్కుతోందని ప్రధాని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు తయారీ రంగంలో తిరోగమన అభివృద్ధి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. మేకిన్‌ ఇండియా ప్రభావం ఉంటే తయారీరంగ పరిశ్రమ రికార్డు స్థాయిలో ఎందుకు పడిపోయిందని, నిరుద్యోగ యువత సంఖ్య భారీగా ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. ప్రస్తుతం తయారీరంగ పరిశ్రమ వాటా దేశ ఆర్థికవ్యవస్థలో 14 శాతానికి పడిపోయిందని రాహుల్‌గాంధీ చెప్పారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్..

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.. ఆయన్ను వరంగల్ పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.. అక్కడి నుండి నేరుగా హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే రెండు నెలల క్రితం హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్న ఓ వ్యాపారిని బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్ చేశాడని బాధితుడి ఫిర్యాదుతో కౌషిక్ రెడ్డిపై కేసు నమోదు చేసిన సుబేదార్‌ పోలసులు.. ఆయన్ను అరెస్ట్ చేసి పీఎస్‌కు […]

ఆంగ్లం సిగ్గుచేటు కాదు..ఆయుధం:రాహుల్ గాంధీ

ఆంగ్లంలో మాట్లాడడాన్ని భవిష్యత్‌లో సిగ్గుచేటుగా భావిస్తారని హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై విపక్షనేత రాహుల్ గాంధీ సహా పలువురు విరుచుకుపడ్డారు. ఇంగ్లీషు భాష ఆటంకం కాదని.. అదొక వంతెన, మన చేతిలో ఆయుధం లాంటిందని అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రతి చిన్నారిని సమాన హక్కులు కల్పించిందేకు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ బద్ధ వ్యతిరేకులని రాహుల్ మండిపడ్డారు. పేదల సాధికారతను ఒప్పుకోరని, అదే జరిగితే వాళ్లు ప్రశ్నిస్తారని వాళ్ల భయమని దుయ్యబట్టారు.

జగన్.. రెచ్చగొట్టొద్దు..నారా లోకేష్

మంత్రి నారా లోకేష్ దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా జగన్ మాట్లాడటం సముచితం కాదని, రాష్ట్రంలో నక్సలిజం పెరుగుతోందన్న ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ప్రజలు తమకు ఐదేళ్ల పాలనకు అవకాశం ఇచ్చారని, ఇచ్చిన హామీలను పూర్తి చేసి చూపిస్తామని లోకేష్ స్పష్టం చేశారు. జగన్ వ్యాఖ్యలు రాష్ట్రంలో ఉద్రిక్తతలను సృష్టించేలా ఉన్నాయని, ఇటువంటి చర్యలు రాజకీయంగా బాధ్యతారహితంగా ఉన్నాయని ఆయన […]

అనవసరంగా గొడవలు వద్దు.. ఏపీ సీఎం

బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం కొనసాగుతున్న వేళ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి జలాలను ఇరు రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవచ్చని అన్నారు. కొత్త ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్లు ఎలా కేటాయిస్తే అలా అని..వారి నిర్ణయం మేరకు నడుచుకుందామని చెప్పారు. ఈ విషయంపై అనవసరంగా గొడవలు చేసి ప్రజలను మభ్యపెట్టొద్దని రెండు రాష్ట్రాల నాయకులకు హితవు పలికారు. బనకచర్లతో ఎవరికీ నష్టం లేదని స్పష్టం పేర్కొన్నారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తారా?: జగన్

వైఎస్ఆర్ సిపి పార్టీ శ్రేణులను పరామర్శిస్తే తప్పా?, ఎందుకు ఇన్ని ఆంక్షలు? అని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మొన్నటి పొదిలి పర్యటనలోనూ తనకు ఇబ్బందులు సృష్టించారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తారా?, రైతులను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీహార్‌ను చేయడంలో చంద్రబాబుకు మించిన గొప్ప నాయకుడు ఎవరూ లేరని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడ జైలుకు చెవిరెడ్డి తరలింపు

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో చెవిరెడ్డి భాస్కర రెడ్డికి జూలై 1వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది. ఇదే కేసులో ఆయన అనుచరుడు వెంకటేశ్ నాయుడుకు సైతం జూలై 1వ వరకు రిమాండ్‌ విధించింది. దీంతో అటు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఇటు వెంకటేశ్ నాయుడులను విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. తనకు వెన్ను నొప్పి తీవ్రంగా ఉందని కాబట్టి ప్రత్యేక వసతులు కల్పించాలని చెవిరెడ్డి భాస్కరరెడ్డి న్యాయమూర్తిని కోరారు.

వైఎస్ జగన్ పల్నాడు పర్యటనలో అపశ్రుతి..కీలక వివరాలు వెల్లడించిన గుంటూరు ఎస్పీ

ఏటుకూరు బైపాస్ వద్ద వైఎస్ జగన్ కాన్వాయ్ ముందు వెళ్తున్న ప్రైవేటు వాహనం ఢీకొని ఓ వ్యక్తి చనిపోయారు. చనిపోయిన వ్యక్తిని చీలి సింగయ్య అనే వ్యక్తిగా గుర్తించారు. సింగయ్యను ఓ ప్రైవేట్ వాహనం ఢీకొనటంతో చీలి సింగయ్య రోడ్డుపై పడిపోయారని.. కారు టైరు అతని భుజం మీదుగా వెళ్లిందన్నారు. హైవే పోలీసులు సింగయ్యను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే సింగయ్య చనిపోయారని వైద్యులు ధ్రువీకరించినట్లు ఎస్పీ వెల్లడించారు.

అది నిజమే.. నేను కూడా బాధితురాలినే: వైఎస్ షర్మిల

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ పై ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక కామెంట్స్ చేశారు. “బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నా… ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది వాస్తవమే. నా ఫోన్, నా భర్త ఫోన్, నా దగ్గర వాళ్ల ఫోన్‌లు ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తా. ఫోన్‌ ట్యాపింగ్‌పై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON