మంత్రి నారా లోకేష్ దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా జగన్ మాట్లాడటం సముచితం కాదని, రాష్ట్రంలో నక్సలిజం పెరుగుతోందన్న ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ప్రజలు తమకు ఐదేళ్ల పాలనకు అవకాశం ఇచ్చారని, ఇచ్చిన హామీలను పూర్తి చేసి చూపిస్తామని లోకేష్ స్పష్టం చేశారు. జగన్ వ్యాఖ్యలు రాష్ట్రంలో ఉద్రిక్తతలను సృష్టించేలా ఉన్నాయని,
ఇటువంటి చర్యలు రాజకీయంగా బాధ్యతారహితంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు.

