loader

హైదరాబాద్‌లో వైఎస్సార్ స్మృతివనం ఏర్పాటు చేయాలి: షర్మిల

వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులు అర్పించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారంటూ కొనియాడారు. వైఎస్సార్ జ్ఞాపకార్థం హైదరాబాద్‌లో ఓ స్మృతివనం ఏర్పాటు చేయాలని షర్మిల కోరారు. ఇది వైఎస్సార్ అభిమానులు, ప్రజల పక్షాన తెలంగాణ ప్రభుత్వానికి తన విజ్ఞప్తన్నారు.

ఇడుపులపాయలో వైఎస్సార్‌కు జగన్ నివాళులు

దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా వైఎస్సార్‌ తనయుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా ఇడుపుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో సతీమణి విజయమ్మ, వైఎస్‌ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు, పెద్దఎత్తున అభిమానులు పాల్గొన్నారు. తండ్రిని తలచుకుని మిస్ యూ నాన్న అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

హైటెన్షన్..సోమాజిగూడ్ ప్రెస్ క్లబ్‌కు కేటీఆర్.. రేవంత్ కోసం వెయిటింగ్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నంత పనిచేశారు. ముందే చెప్పినట్లుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు వచ్చారు. రైతు సంక్షేమంపై రేవంత్‌ సవాల్‌ను స్వీకరించిన కేటీఆర్ చర్చించేందుకు ప్రెస్ క్లబ్‌కు రావాలంటూ సీఎంకు ప్రతిసవాల్ విసిరారు. సీఎం ఢిల్లీలో ఉన్నారు కాబట్టి.. మంత్రులెవరైనా వచ్చినా వారితో చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రెస్ క్లబ్ వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.

వైసీపీ శ్రేణులకు ఎస్పీ వార్నింగ్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జులై 9వ తేదీ చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో పర్యటించునున్నారు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు స్పష్టం చేశారు. వైఎస్ జగన్ బంగారుపాలెం పర్యటన సందర్భంగా హెలిపాడ్ వద్ద 30 మందికి మాత్రమే అనుమతి ఉందన్నారు. అలాగే మామిడికాయల మార్కెట్ యార్డులో 500 మంది మామిడి రైతులకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. అనుమతులను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు చేపడుతామని […]

తప్పతాగి.. బట్టలిప్పి.. నడిరోడ్డుపై రాజకీయ నేత కుమారుడి వీరంగం

మద్యం మత్తులో ముంబై నగరంలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. మహారాష్ట్ర నవనిర్మాణ సేనకు చేందిన రాజకీయ నాయకుడు జావేద్ షేక్ కుమారుడు రాహిల్ జావేద్ పీకల దాక మద్యం తాగి నటి రాజశ్రీ మోరేతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కారును ఢీకొట్టి దర్భాషలాడాడు. అర్థ నగ్నంగా ఆమెతో వాగ్వాదానికి దిగాడు. తన కారును ఎందుకు ఢీకొట్టావ్, ఎందుకు అసభ్యంగా ప్రవర్తిస్తున్నావ్ అని ప్రశ్నించగా.. ‘‘కారులో డబ్బులు ఉన్నాయి తీసుకో’’ అని అన్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో […]

నెల్లూరులో మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు.. నారా లోకేష్ ఎదురుగానే

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వీఆర్ హైస్కూల్ పేరు మార్చడం మీద ఆనం రామనారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూలులో మున్సిపల్ కార్పొరేషన్ పదం తీసేయాలని మంత్రి వేదిక మీద ఉన్న మంత్రి నారా లోకేష్ దృష్టికి ఆనం రామనారాయణరెడ్డి తీసుకువచ్చారు. వీఆర్ హైస్కూలు కోసం మున్సిపల్ శాఖ మంత్రి ప్రయత్నిస్తే.. అది మున్సిపల్ కార్పొరేషన్ […]

గ్రామమంతా ఒక్కటై బీఆర్ఎస్‌లో చేరిక

అధికార పార్టీపై వ్యతిరేకతతో ఎవరో ఒకరిద్దరు కాదు.. ఏకంగా గ్రామమంతా ఒక్కటై బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పట్నంగూడ గ్రామస్తులు సోమవారం నాడు గులాబీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ నేత అనిల్ జాదవ్ సమక్షంలో పట్నంగూడ గ్రామస్తులందరూ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా డప్పుల సప్పుడుకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బీహార్‌ ఎన్నికల సంఘం పోస్టాఫీస్‌లా పనిచేస్తోంది : తేజస్వి యాదవ్‌

ఎన్నికల సంఘాన్ని కలిసి అతి తక్కువ సమయంలో ఎన్నికల జాబితాను సవరించడంతో వచ్చే సమస్యలపై సందేహాలు లేవనెత్తామని తేజస్వి యాదవ్‌ తెలిపారు. కానీ ఎన్నికల సంఘం నుంచి తమకు ఇంతవరకు ఎలాంటి వివరణ రాకపోవడం ఆందోళనకరమైన విషయమని అన్నారు. బీహార్‌ ఎన్నికల సంఘం కేవలం పోస్టాఫీస్‌లా పనిచేస్తున్నదని, తమ సందేహాలకు సమాధానం ఇచ్చే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘం దగ్గర లేదని విమర్శించారు.

వైఎస్ జగన్ చిత్తూరు పర్యటనలో హెలిప్యాడ్‌కు పోలీసుల అనుమతి

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటనలో హెలిప్యాడ్‌కు పోలీసులు అనుమతి ఇచ్చారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి వెంకటగిరి సమీపంలో తగ్గువారిపల్లి దగ్గర వైసీపీ అధినేత జగన్ హెలిప్యాడ్‌కు పోలీసులు నుంచి అనుమతి లభించింది. ఇటీవల ఆయన నెల్లూరు పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ హెలిప్యాడ్ కు అనుమతి రానందున జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.ైఎస్ జగన్ జులై 9న చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో పర్యటించనున్నారు.

లోకేష్‌తో కేటీఆర్ సీక్రెట్ మీటింగ్… ఎందుకోసం

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటాను పక్క రాష్ట్రాలకు దోచిపెట్టిన తెలంగాణ ద్రోహ్రం చేసిందని ఆరోపించారు. ఏపీ మంత్రి లోకేష్‌తో కేటీఆర్ సీక్రెట మంతనాలు జరుపుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. లోకేష్‌ను కేటీఆర్‌ కలిసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. లోకేష్‌ను ఎందుకు కలుస్తున్నారనేది సమాధానం చెప్పాలని కేటీఆర్‌ను డిమాండ్ చేశారు. లోకేష్‌ను కలవలేదని కేటీఆర్ అంటే తాను మళ్లీ స్పందిస్తానని… అబద్దం అని బుకాయిస్తే వివరాలు అన్నీ బయటా పెడతానని రామ్మోహన్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON