అధికార పార్టీపై వ్యతిరేకతతో ఎవరో ఒకరిద్దరు కాదు.. ఏకంగా గ్రామమంతా ఒక్కటై బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పట్నంగూడ గ్రామస్తులు సోమవారం నాడు గులాబీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ నేత అనిల్ జాదవ్ సమక్షంలో పట్నంగూడ గ్రామస్తులందరూ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా డప్పుల సప్పుడుకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

