loader

లిక్కర్ స్కామ్‌లో సిట్ విచారణకు విజయసాయిరెడ్డి డుమ్మా

ఆంధ్రా లిక్కర్ స్కాంలో విచారణకు సీఐడీ ఇచ్చిన నోటీసులను విజయసాయిరెడ్డి లైట్ తీసుకున్నారు. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్మరాలు ఉన్నాయని తాను రాలేనని ఆయన సిట్ అధికారులకు సమాచారం పంపారు. తనకు కుదిరనప్పుడు వస్తానని.. వచ్చే ముందు సమాచారం ఇస్తానన్నారు. తాను రాలేనన్న సమాచారాన్ని విజయసాయిరెడ్డి శుక్రవారమే సిట్ అధికారులకు ఇచ్చారు. కానీ సిట్ అధికారులు అంగీకరించలేదు. విజయసాయిరెడ్డి మాత్రం రాలేదు. దాంతో సిట్ అధికారులు ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

యువకుడు హత్య.. జనసేన ఇన్‌చార్జ్‌ వినుత దంపతులు అరెస్ట్

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన యువకుడి హత్య చెన్నైలో కలకలం రేపింది. చెన్నైలోని కూవంనదిలో లభించిన యువకుడి మృతదేహాంపై ఆరా తీసిన పోలీసులు జనసేన నేతల హస్తం ఉన్నట్లు గుర్తించారు. జనసేన ఇన్‌ఛార్జ్ కోటా వినూత, ఆమె భర్త చంద్రబాబు వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న రాయుడు ప్రవర్తన బాగా లేకపోవడంతో విధులనుంచి తొలగించిన తర్వాత చెన్నైలో రాయుడు డెడ్ బాడీ వెలుగు చూసింది పోలీసులు అరెస్టు చేసిన వారిలో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్‌చార్జ్ వినూత, […]

ఎపిలో ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులకు భంగం : జగన్

ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకుని, సమాధానం నుంచి కోరుకునే అవకాశం ఉండాలని మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఎపిలో ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని అన్నారు. ఎపిలో జరుగుతున్న అణచివేతలపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారంటూ జగన్ ట్వీట్ చేశారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు నిరంకుశ పాలనలో అడ్డగోలుగా అణచివేయపడుతోందని, పోలీసులతో అధికార దుర్వినియోగం చేయిస్తూ, అసమ్మతి గళాలను నులిమేస్తున్నారని […]

ఆంధ్రా లిక్కర్ స్కాంలో నిందితుల ఆస్తుల జప్తునకు కోర్టు అనుమతి

ఏపీ లిక్కర్ కేసు లో నిందితుల ఆస్తులను జప్తు చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. రూ.32 కోట్ల ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే జీవో ఇచ్చింది. మద్యం ముడుపుల సొమ్ము ఎలా వసూలు చేశారు.? ఎక్కడికి చేర్చారు.? ఎలా తరలించారు.? అనే కీలక అంశాలన్నింటినీ సిట్‌ అధికారులు ఇప్పటికే దర్యాప్తులో గుర్తించినట్లుగా చెబుతున్నారు. లిక్కర్ కేసు వ్యవహారంలో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. త్వరలో ప్రాథమిక చార్జిషీటు దాఖలు చేయనుంది. ఈడీ కూడా ఇప్పటికే కేసులు నమోదు […]

ఫరీద్‌పేటలో వైసీపీ నేత దారుణ హత్య: ఏడాదిలో రెండో హత్య

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేటలో పట్టపగలు సత్తారు గోపి(46)అనే వ్యక్తిని నడిరోడ్డుపై కత్తులతో ప్రత్యర్ధులు నరికి చంపారు. వైసీపీ నేత,ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి ప్రధాన అనుచరుడిగా గోపి ఉన్నారు. సరిగ్గా ఏడాది కిందట గోపి డ్రైవర్ కూన ప్రసాద్ ను గ్రామంలోనే ప్రత్యర్థులు హత్య చేశారు. ఇప్పుడు సత్తారు గోపీనే హత్య చేశారు. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పరిసీలించారు. పోలీసుల వైఫల్యం వల్లే దాడులు జరుగుతున్నాయి అంటూ ఎస్పీనీ […]

రాజాసింగ్ కు షాక్.. రాజీనామాను ఆమోదించిన నడ్డా

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా బిగ్ షాకిచ్చాడు. శుక్రవారం రాజాసింగ్ రాజీనామాను ఆయన ఆమోదించారు. దీంతో బిజెపితో రాజాసింగ్ కు ఉన్న అనుబంధం తెగిపోయినట్లే మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌ రావుకు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన రాజాసింగ్‌.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత 10 రోజులుగా పెండింగ్ లో ఉంచిన రాజాసింగ్ రాజీనామాను ఇవాళ జెపి నడ్డా ఆమోదించారు.

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం..మాజీ ఎమ్మెల్యే తొలగింపు

కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న టి.వి. రామారావు పై పార్టీ అధిష్ఠానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. కొవ్వూరు నియోజకవర్గంలోని సహకార సొసైటీల నియామకాల్లో తప్పుడు చర్యలు జరుగుతున్నాయంటూ టి.వి. రామారావు నేతృత్వంలో పార్టీ శ్రేణులు బహిరంగ ఆందోళన చేపట్టారు. టోల్ గేట్ వద్ద రాస్తారోకో కూడా నిర్వహించారు. ఈ ఆందోళనలకు పార్టీ నాయకత్వం అనుమతి ఇవ్వలేదు. ఇది జనసేన తీరుకు విరుద్ధంగా ఉందని పార్టీ అభిప్రాయం.

మాధవ్ గిఫ్ట్‌పై మండిపడుతూ కేటీఆర్ పోస్ట్

ఏపీ బీజేపీ అధ్యక్షుడు లోకేష్‌కి అందజేసిన భారతదేశ మ్యాప్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేర్వేరు రాష్ట్రాలుగా విభజించి లేవని. ఆంధ్రప్రదేశ్‌ని ఉమ్మడి రాష్ట్రంగానే చూపిస్తున్నట్లుగా ఉండటాన్ని తప్పుపట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈఫోటోని తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేస్తూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వానికి, ఆపార్టీకి ఉన్న చిత్తశుద్దిని శంకిస్తూ కొన్ని అంశాలను ప్రస్తావించారు. బీజేపీ చీఫ్ అందజేసిన చిత్రపటంపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు.. సీఎం రేవంత్ రెడ్డి

సాగునీటి ప్రాజెక్టులపై చట్టసభల్లో చర్చిద్దామని తాను సూచన చేశానని, క్లబ్బుల్లో, పబ్బుల్లో కాకుండా చట్టసభల్లో చర్చించుకుందామని కోరినప్పటికీ, కేసీఆర్ సడన్ గా వచ్చి ఏదేదో మాట్లాడారని సీఎం అన్నారు. అధికారం కోల్పోయి, డిపాజిట్లు కూడా కోల్పోయి, అభ్యర్థులు దొరకక ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న కొందరు విచిత్రమైన వాదనలు చేస్తున్నారని, ఏడాదిలోనే సర్వం నాశనమైందని.. మళ్లీ వాళ్లు వస్తేనే బాగుపడుతుందన్నట్టు వితండవాదన తీసుకొస్తున్నారని ఆయన పరోక్షంగా కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.

ఎన్నికలకు ముందు బీహార్‌లో ఓటర్ లిస్ట్ గోల్ మాల్ వివాదం

బీహార్‌లో రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు ఓటర్ లిస్ట్ వివాదంపైనే మాట్లాడుతున్నాయి. స్వయంగా రాహుల్ గాంధీ కూడా నిరసనల్లో పాల్గొన్నారు. దీనికి కారణం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. కొత్త ఓటర్ల సవరణ ద్వారా దళితులు, మహాదళితులు, ముస్లింలు, వలస కార్మికులు, పేదల ఓటు హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఈ ప్రక్రియ చేపట్టడంపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON