కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న టి.వి. రామారావు పై పార్టీ అధిష్ఠానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. కొవ్వూరు నియోజకవర్గంలోని సహకార సొసైటీల నియామకాల్లో
తప్పుడు చర్యలు జరుగుతున్నాయంటూ టి.వి. రామారావు నేతృత్వంలో పార్టీ శ్రేణులు బహిరంగ ఆందోళన చేపట్టారు. టోల్ గేట్ వద్ద రాస్తారోకో కూడా నిర్వహించారు. ఈ ఆందోళనలకు పార్టీ నాయకత్వం అనుమతి ఇవ్వలేదు. ఇది జనసేన తీరుకు విరుద్ధంగా ఉందని పార్టీ అభిప్రాయం.

