loader

పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి

పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని మాజీ సర్పంచ్ ల జేఏసీ అధ్యక్షుడు సుర్వియాదయ్యగౌడ్ సిఎం, పంచాయితీరాజ్ శాఖ మంత్రికి ఒక ప్రకటనలో విజప్తి చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ ఈ నెల 18న( శుక్రవారం) ఉదయం 11 గంటలకు ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. తమ స్వంత ఖర్చులతో చేసి, వడ్డీకి డబ్బులు తెచ్చి ప్రభుత్వ ఆదేశాలకు చేసిన సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి నెట్టేస్తోందని ఆందోళన […]

తెలంగాణ హక్కులను చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు: కవిత

తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ నేతలు స్పందించకపోవడమనేది దారుణమని ఎంఎల్‌సి కవిత మండిపడ్డారు. ఈ విషయం బిఆర్‌ఎస్ నేతల విజ్ఞతకే వదిలివేస్తున్నానని, తన దారికి భారత రాష్ట్ర సమితి నేతలు రావాల్సిందేనని స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే గోదావరి జలాలు హక్కులు తెలంగాణ రాష్ట్రం కోల్పోతుందన్నారు. తెలంగాణ హక్కులను చంద్రబాబు నాయుడు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని, దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలించే హక్కులేదని, తక్షణమే రాజీనామా చేయాలని కవిత డిమాండ్ చేశారు.

నేనే ముఖ్యమంత్రిని అని బీజేపీ చెప్పింది : పళనిస్వామి

తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. బీజేపీతో కలిసే అంశంపై అన్నాడీఎంకే తుది తీర్మానం త ీసుకుంది.కూటమి గెలిస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని పళనిస్వామి స్పష్టం చేశారు. బీజేపీ కూడా అదే విషయాన్ని అంగీకరించిందని పేర్కొన్నారు. తమ పార్టీనే కూటమికి నాయకత్వం వహిస్తుందని చెప్పారు. ఇది తన తుది నిర్ణయమని వెల్లడించారు.

వాళ్లకు నిధులు, వీళ్లకు నీళ్లు, తెలంగాణ ప్రజలకు బూడిద: కెటిఆర్

ముసుగు వీడింది, నిజం తేటలతెల్లమయ్యింది. 48వ ఢిల్లీ పర్యటన గుట్టు రట్టయిందని కెటిఆర్ పేర్కొన్నారు. ‘‘నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి, తెలంగాణా వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు. బూడిద తెలంగాణ ప్రజలకి! బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయించి..గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పడం కోసమా నువ్వు గద్దెనెక్కింది? జై తెలంగాణ అనడానికి ఉన్న సిగ్గు..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబుకి ధారపోయడానికి మాత్రం లేదా? అంటూ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

పవన్ కళ్యాణ్, బాలయ్య సినిమాలపై సంచలన వ్యాఖ్యలు..!

ఈ రోజున తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు పైన ఆయన చేసిన కుట్రల పైన పలు వ్యాఖ్యలు చేశారు. పుష్ప చిత్రంలోని రప్పా రప్పా డైలాగులు చెప్పడంతో వైసిపి శ్రేణులను అరెస్టు చేసింది కూటమి ప్రభుత్వం సినిమా డైలాగులు పెడితే క్రిమినల్ కేసులు పెడుతున్నారు.  పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాలలో మరి ఇంకా దారుణమైన డైలాగులు ఉంటున్నాయి.. మరి వారి సినిమాలలో లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటూ ఫైరయ్యారు.

రేపటి రోజు నేను చెప్పినా కూడా మా వాళ్లు వినరు…వైఎస్ జగన్

ఏపీలో దుర్మార్గపు పాలన నడుస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో రాజ్యాంగ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు సంప్రదాయానికి తెరతీశారని… తమ పార్టీ నేతలపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రేపు తాము అధికారంలోకి వస్తే తమ వాళ్లు తన మాట కూడా వినరని హెచ్చరించారు. అప్పుడు చంద్రబాబు, టీడీపీ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు ఇప్పటికైనా మేలుకోని, తప్పు తెలుసుకోని, తప్పుడు సంప్రదాయాన్ని సదిదిద్దుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ […]

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి లుక్ అవుట్ నోటీసులు జారీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ స్కాం కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది ఇదే కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సైతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లిక్కర్ స్కాం కేసులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని ఏ-4గా చేర్చింది సిట్. మంగళవారం సాయంత్రం లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (LOC) జారీ చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన గంటల వ్యవధిలోనే లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది.

పల్లెల్లో సాగునీళ్లు లేవు.. పట్నంలో తాగునీళ్లు లేవు : కేటీఆర్

అటు ప‌ల్లెల్లో.. ఇటు ప‌ట్నంలో మొద‌లైన సాగు, తాగునీటి క‌ష్టాల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప‌ల్లెల్లో సాగునీళ్లు లేవు.. ప‌ట్నంలో తాగునీళ్లు లేవు అని కేటీఆర్ విమ‌ర్శించారు. నాడు ఇంటింటికీ నల్లా నీళ్లు నేడు సాగు, తాగునీళ్లు లేక జనం కన్నీళ్లు పెడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సర్కారు మోసానికి సాక్ష్యంగా రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు వెల‌వెల‌బోతున్నాయ‌న్నారు. బోర్లు అడుగంటి పోయాయ‌ని, పొలాలు ప‌డావున‌ ప‌డ్డాయ‌న్నారు.

కేంద్రమంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు భేటీ..

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలపాటు ఆయనతో పలు అంశాలపై చంద్రబాబు చర్చించారు. పలు రాష్ట్ర సమస్యలను కేంద్రమంత్రికి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. క్లిష్టమైన పరిస్థితుల్లో ఏపీకి అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గవర్నర్ గా నియమించడంపై హోం మంత్రి అమిత్ షా కు, కేంద్రానికి, ప్రధానికి ధన్యవాదాలు సీఎం చంద్రబాబు […]

హిందీ భాషపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలో జరిగిన పీవీ నరసింహారావు సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన, భాషల ప్రాధాన్యతపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. “మనం హిందీ ఎందుకు నేర్చుకోవాలి అనే ప్రశ్నలు కొందరిలో వినిపిస్తున్నాయి. కానీ, పీవీ నరసింహారావు గారు 17 భాషలు నేర్చుకున్నారు. ఆయన భాషలలో చేసిన సాధన వల్లే అంత గొప్ప వ్యక్తిగా ఎదిగారు” అని చంద్రబాబు చెప్పారు. హిందీ భాషను వ్యతిరేకించాల్సిన అవసరం లేదని, అదే సమయంలో తెలుగును మరువకూడదన్న స్పష్టత ఉంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON