తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ నేతలు స్పందించకపోవడమనేది దారుణమని ఎంఎల్‌సి కవిత మండిపడ్డారు. ఈ విషయం బిఆర్‌ఎస్ నేతల విజ్ఞతకే వదిలివేస్తున్నానని, తన దారికి భారత రాష్ట్ర సమితి నేతలు రావాల్సిందేనని స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే గోదావరి జలాలు హక్కులు తెలంగాణ రాష్ట్రం కోల్పోతుందన్నారు. తెలంగాణ హక్కులను చంద్రబాబు నాయుడు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని, దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలించే హక్కులేదని, తక్షణమే రాజీనామా చేయాలని కవిత డిమాండ్ చేశారు.

