loader

ఎంపీలు..అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు..సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్‌లో మన ఎంపీల పని తీరు బాగుంది. క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరవుతున్నారు. చర్చించే అంశాలపై రాష్ట్ర వాదనను సమర్థవంతంగా వినిపిస్తున్నారు.’ రాష్ట్రం సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రజలు మనకు ఓట్లు వేసి అధికారం ఇచ్చారు, పెద్ద సంఖ్యలో ఎంపీలను ఇచ్చారు. ‘అనవసర విషయాల్లో ఎంపీలు ఎక్కడా జోక్యం చేసుకోవద్దు. వన్ టైం ఎంపీలుగా ఉండేలా ప్రవర్తించవద్దు. ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షల మేరకు మీరు పని చేయాలి.అని సీఎం చంద్రబాబు […]

రాబ‌ర్ట్ వ‌ద్రాను ప‌దేళ్లుగా కేంద్రం వేధిస్తున్నది : రాహుల్

రాబర్ట్ వద్రాపై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఆయన ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా వద్రాను రాజకీయ పరిభాషలో వేధిస్తున్నదని ఆరోపించారు. ఎటువంటి ద‌ర్యాప్తునైనా ఎదుర్కోవ‌డానికి తాము సిద్ధంగా ఉన్నామ‌న్నారు. త‌న సోద‌రి ప్రియాంకా గాంధీతో పాటు ఆమె కుటుంబం ఆ విచార‌ణ‌ను ఎదుర్కొంటుంద‌న్నారు. స‌త్యం ఎప్ప‌టికీ వ‌ర్ధిల్లుతుంద‌ని రాహుల్ పేర్కొన్నారు.

నేను లోకేశ్‌ను క‌ల‌వ‌లేదు..కానీ క‌లిస్తే త‌ప్పేంటి..సీఎం రేవంత్‌ను సూటిగా ప్ర‌శ్నించిన కేటీఆర్

నేను అర్ధ‌రాత్రి పోయి లోకేశ్‌ను క‌లిసాన‌ట‌. మేం ఏం జేసిన బాజాప్తా చేస్తాం. బేజాప్తా చేయాల్సిన క‌ర్మ మాకు లేదు. అయినా నాకు తెల్వ‌క అడుగుతా.. లోకేశ్ నీలాగా ఏమైనా అంత‌ర్ రాష్ట్ర దొంగ‌నా..? లోకేశ్ నీలాగా ఏమైనా సంచులు మోసినోడా.. లోకేశ్ నీలాగా ఏమైనా చ‌దువు రానోడా..? క‌ల‌వలేదు కానీ క‌లిస్తే త‌ప్పేంది..ఈ చిల్ల‌ర మాట‌ల‌తోని ఎన్నిరోజులు టైం పాస్ చేస్త‌వ్. ఎన్ని రోజులు ప్ర‌జ‌ల‌ను ఆగం చేసే ప్ర‌య‌త్నం చేస్త‌వ్ అని సీఎం రేవంత్ […]

లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్ట్

ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం అరెస్ట్ చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలో 2100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌కు కొన్ని గంటల ముందే దుర్గ్ జిల్లాలోని భిలాయ్‌లో ఉన్న భూపేష్ బఘేల్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది.

తెలుగుదేశం పార్టీకి కేంద్రమాజీమంత్రి అశోక్ గజపతిరాజు రాజీనామా

తెలుగుదేశం పార్టీకి మాజీ కేంద్రమంత్రి, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు రాజీనామా చేశారు. ఇటీవలే కేంద్రప్రభుత్వం పూసపాటి అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీకి పార్టీ ప్రాథమిక సభ్యతం, పొలిట్ బ్యూరోకు, జీవితకాల సభ్యత్వంకు రాజీనామా చేశారు. దివంగత సీఎం ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో పనిచేసేందుకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

వచ్చి తీరతా… ఎలా వస్తావో నేనూ చూస్తా… తాడిపత్రిలో టెన్షన్‌

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర్‌రెడ్డి సవాళ్లు ప్రతిసవాళ్లతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇవాళ తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమయ్యారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాడిపత్రికి వెళ్తానంటున్నారు పెద్దారెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో రానిచ్చేది లేదంటూ ప్రభాకర్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో పెద్దారెడ్డి సొంతూరు తిమ్మంపల్లితోపాటు తాడిపత్రిలో పోలీసులు భారీగా మోహరించారు

రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి : కేటీఆర్ ఆగ్రహం

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. నాపై ఏదైనా డ్రగ్స్ కేసు ఉందా? ఉంటే దమ్ముంటే బయటపెట్టు” అంటూ స్పష్టమైన సవాల్ విసిరారు.రేవంత్ చిట్‌చాట్ పేరుతో ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలకు మూల్యం చెల్లించాల్సిందే అని హెచ్చరించారు. క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

ప్రియాంక గాంధీ భర్తపై ఈడీ ఛార్జిషీట్

షికోపూర్ భూముల వ్యవహారానికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆయనను పలుమార్లు ఈడీ విచారణకు పిలిచి ప్రశ్నించింది. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం, వాద్రాకు చెందిన కంపెనీ 2008లో గురుగ్రామ్‌లోని షికోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్ ప్రాపర్టీ నుంచి కొనుగోలు చేసింది. దీని విలువ రూ. 7.5 కోట్లు. ఆ తర్వాత వాద్రా కంపెనీ ఆ భూమిని […]

బండి సంజయ్ వ్యాఖ్యలపై వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కౌంటర్

42 శాతం రిజర్వేషన్లు ముస్లింలను ఎలా బీసీల్లో కలుపుతారు? అంటూ చేసిన వ్యాఖ్యలపై. బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలను ఉద్దేశించి కఠిన వ్యాఖ్యలు చేశారు. ముసలి కన్నీరు కారుస్తూ కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. గుజరాత్‌లో వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. అక్కడ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిన కేంద్రం, ఇక్కడ మాత్రం బీసీలను బలహీనపరచే ప్రయత్నం చేస్తోందని మీడియా సమావేశంలో.. ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.

దేవుడి సాక్షిగా చెబుతున్నా ఆ హత్యతో నాకు సంబంధం లేదు: TDP ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ కోట వినుత డ్రైవర్ రాయుడు హత్య సంచలనంగా మారింది. శ్రీకాళహస్తి ఎంఎల్యే బొజ్జల సుధీర్‌ రెడ్డిపై వినుత ఆరోపణలు చేశారు. బొజ్జల సుధీర్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో స్పందించారు. రాయుడు హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ.. దేవుడి మీద, తన పిల్లల మీద ప్రమాణం చేస్తున్నాను అన్నారు. దేవుడి సన్నిధిలో ప్రమాణం చేసి చెబుతున్నాను అన్నారు. ఈ ఘటనలో తన ప్రమేయం లేదని.. .. రాజకీయ కారణాలతో […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON