loader

చంద్రబాబుతో వైఎస్ సునీత భేటీ

వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత రాష్ట్ర సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ప్రత్యక్షంగా కలిశారు. తండ్రి హత్య కేసును ముఖ్యంగా ప్రస్తావిస్తూ, నిందితులకు త్వరగా శిక్ష పడేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది సునీత చంద్రబాబును కలుసిన తొలి సారి కాదు. గత ఏడాది సెప్టెంబరులోనూ తన భర్తతో కలిసి సీఎం చంద్రబాబును కలిసి ఇదే అంశాన్ని ప్రస్తావించారు. న్యాయం ఆలస్యం కావడం వల్ల బాధిత కుటుంబానికి నష్టమే జరుగుతోందని ఆమె […]

చంద్రబాబు, లోకేశ్ లకు కృతజ్ఞతలు : పవన్

“హరిహర వీరమల్లు” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ రాజకీయ భావోద్వేగాలపై కూడా స్పందించారు తన సినిమాకు టికెట్ ధరలు పెంచేందుకు అవకాశం కల్పించిన ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా విజయం కోసం మద్దతుగా పోస్ట్ చేసిన నారా లోకేశ్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. “ఎక్కడికి వెళ్లినా అక్కడే పుట్టాను అంటాడు” అంటూ విమర్శించే వారిని బావిలో కప్పలతో పోల్చారు. ఆవిషయాన్ని ఎత్తి చూపుతూ, తన పేరులోనే గాలి ఉందని, కాబట్టి ఎక్కడైనా […]

కీలక నేతను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన టీడీపీ! డబ్బుల వసూలుకు పాల్పడ్డమే కారణం

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి అనుచరుడు తిరుమలేశ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ అధిష్టానం. మహానాడు సమయంలో నారాయణ విద్యాసంస్థల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం రావడంతో ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దగ్గర ప్రస్తావించారు మంత్రి నారాయణ. ఈ విషయంపై సీరియస్ అయిన టిడిపి అధిష్టానం, విచారణ జరిపించింది. అనంతరం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ప్రస్తుతం కడప జిల్లా TNSF నేతగా ఉన్నారు తిరుమలేష్.

హరిహర వీరమల్లు విజ‌యం కోసం పనిచేయండి.. జ‌న‌సేన కార్యకర్తలకు ఎమ్మెల్సీ పిలుపు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న హరిహర వీరమల్లు’ చిత్రం విజయవంతం కావడానికి జనసేన కార్యకర్తలందరూ కృషి చేయాలని జనసేన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పిలుపునిచ్చారు. ‘హరిహర వీరమల్లు’ అనేది ఒక చారిత్రాత్మక చిత్రమ‌ని, ఈ సినిమాలోని సందేశాన్ని జనసేన కార్యకర్తలు ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని జయమంగళ వెంకటరమణ స్పష్టం చేశారు. అంతేగాకుండా జులై 23వ తేదీన రాత్రి జరిగే ప్రీమియర్ షోతో పాటు, జులై 24వ తేదీన టిక్కెట్లు దొరకని అభిమానులకు మనం తగిన సౌకర్యాలను కల్పించాలంటూ వెంకటరమణ […]

హిందీ భాష వివాదం.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి కౌంట‌ర్

కొంతమందికి ఎప్పుడు అర్థమవుతుంది?! హిందీని రుద్దడం కేవలం భాష గురించే కాద‌ని. ఇది ఉత్తర(ఆర్యులు) భారతదేశంకి చెందిన వారు దక్షిణ (ద్రావిడ) భారతదేశంపై తమ ఆధిపత్యాన్ని చెలాయించడమే. వారు తాము ఉన్నతమైనవారమని, మనం తక్కువవారమని చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు హిందీ/ఉర్దూ చాలా బాగా వచ్చు, మరి ఉత్తరాదిలో నివసించే ఎవరైనా తెలుగులో మాట్లాడతారా? వెన్నెముక లేనివారు మన గొంతులను వినిపిస్తే, దక్షిణాది గొంతు ఎప్పటికీ వినిపించదంటూ ప‌వ‌న్‌కి గట్టి కౌంట‌ర్ ఇచ్చాడు.

సినిమాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యం- చిట్ చాట్‌లో పవన్ కల్యాణ్

హరిహరవీరమల్లు సినిమాలో రాజకీయాలు ఉండవని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సినిమానా, రాజకీయాలా అంటే నా ప్రయారిటీ రాజకీయాలకేనని స్పష్టం చేశారు. అయితే తన వల్ల నిర్మాత లు నష్టపోయారని.. నా సినిమాల ఆలస్యం వల్ల వారు బలైపోయారని అన్నారు. నైతిక బాధ్యత వహించి నేను వాటిని పూర్తి చేశాననని.. రెమ్యూనేషన్ గురించి ఆలోచన చేయలేదు… సినిమా పూర్తి చేయాలనే పని చేశాననన్నారు.

కాంగ్రెస్‌కు పెద్ద‌ షాక్.. ఆ 199 కోట్ల‌కు ప‌న్ను క‌ట్టాల్సిందే..!

కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ త‌గిలింది. త‌మ పార్టీకి విరాళంగా వ‌చ్చిన రూ.199 కోట్ల డ‌బ్బుపై ప‌న్ను మిన‌హాయంపు కోసం చేస్తున్న ప్ర‌య‌త్నం బెడిసికొట్టింది. మంగ‌ళ‌వారం ఆదాయ ప‌న్ను అప్పిల్లేట్ ట్రిబ్యున‌ల్ ఆ పార్టీ అప్పీల్‌ను తిర‌స్క‌రించింది. గ‌తంలో ఆదాయ ప‌న్ను అధికారులు తీసుకున్న నిర్ణ‌యాన్నే ట్రిబ్యున‌ల్ స‌మ‌ర్ధించింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు రిలీఫ్ ఇవ్వ‌బోమ‌ని తేల్చి చెప్పింది. దాంతో, ఏం చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు.

బిహార్‌లో 52 ల‌క్ష‌ల ఓట‌ర్ల తొల‌గింపు..

బిహార్ రాష్ట్రంలోని ఓట‌ర్ల సంఖ్య‌ను వెల్ల‌డించానికి రెండు రోజుల ముందే కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌డ‌బోత‌ను వేగ‌వంతం చేసింది. ప్ర‌ధానంగా రెండు అంశాల‌ను ప్ర‌మాణికంగా తీసుకొని 52 ల‌క్ష‌ల ఓట‌ర్ల‌ను తొల‌గించింది. చ‌నిపోయిన‌, ఇత‌ర నియోజ‌క వ‌ర్గాల‌కు వ‌ల‌స వెళ్లిన వాళ్ల పేర్ల‌ను మాత్ర‌మే జాబితా నుంచి త‌ప్పించామ‌ని సీఈసీ వెల్ల‌డించింది. ర‌ద్దు చేసిన‌ 52 ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల‌లో 18 ల‌క్ష‌ల మంది చ‌నిపోయిన‌వాళ్లు కాగా.. 26 ల‌క్ష‌ల మంది ఇత‌ర నియ‌జ‌క‌వ‌ర్గాల‌కు వ‌ల‌స వెళ్లిన […]

రోజా ఆడదో.. మగదో కూడా తెలియదు.. జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి గురించి ప్రజలే చెప్పాలని అన్నారు. ఎమ్మెల్యే నా కొడుకులు అని రోజా అంటున్నారని.. అసలు అది ఆడదో.. మగదో తెలియదని బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది కాపులను ఉసిగొల్పి ఇష్టమొచ్చినట్లు మాట్లాడిస్తున్నారని బొలిశెట్టి అన్నారు. అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి పనికిమాలినోళ్లంతా బయటకొచ్చి.. దమ్ముంటే అరెస్టు చేసుకోమని అంటున్నారని విమర్శించారు.

ఆడబిడ్డకు నెలకు 1500 ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి: నోరు జారిన అచ్చెన్నాయుడు

రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాలు అన్నీ అమలు చేశామని.. ఇంకా ఒక్కటే మిగిలి ఉందన్నారు. ఆడబిడ్డ కు నెలకు 1500 ఇచ్చే పథకం అమలు చేయాల్సి ఉందన్నారు. ఈ పథకం అమలు చేయాలంటే ఏపీ ను అమ్మాలని వ్యాఖ్యానించారు. అయినా కూడా చంద్రబాబు గారు ఈ పథకం అమలుపై ఆలోచన చేస్తున్నారన్నారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. దీంతో వైసీపీ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON