loader

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి.. తెలంగాణ సీఎ రేవంత్ రెడ్డిని ఆయన నివాసంకు వెళ్లి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ సీఎం కు.. చిరంజీవి ప్రత్యేకంగా బొకె ఇచ్చి విష్ చేశారు. సీఎం రేవంత్ కూడా.. చిరంజీవిని అంతే ఆప్యాయతతో పలకరించి.. బొకెతో పాటు, శాలువతో చిరును సన్మానించారు. ఇద్దరు కూడా చాలా సేపు పలు విషయాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తొంది. చిరంజీవి మర్యాదపూర్వకంగా సీఎంతో సమావేశమై మాట్లాడారంటూ.. తెలంగాణ సీఎంఓ కార్యాలయం ఈ భేటీకి సంబంధించిన వీడియోను ‘ఎక్స్‌’ ప్లాట్‌ఫారమ్‌లో […]

కొడాలి నానిపై మరో కేసు నమోదు..

వైసీపీకి కీలక నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని పై తాజాగా ఏపీ పోలీసులు మరో కేసును నమోదు చేశారు. కేసుకు సంబంధించిన 41 సీఆర్‌పీసీ నోటీసులను గుడివాడలోని కొడాని నాని ఇంటికి వెళ్లి ఆదివారం అందజేశారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబాన్ని కించపరిచేలా నాని సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని 2024లో విశాఖ వాసి అంజనాప్రియ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును ఆదారంగా చేసుకుని విశాఖ మూడో టౌన్‌ పోలీసులు 353(2), 352, 351(4) సెక్షన్ల […]

నిరాహార దీక్షకు సిద్ధమవుతున్న కవిత.. ధర్నాకి అనుమతి ఇవ్వని ప్రభుత్వం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఆగస్టు 4 నుంచి 7 వరకూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లోని ధర్నా చౌక్ దగ్గర.. 72 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నారు. కవిత ఈ దీక్ష కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోరినట్లు తెలిపారు. అయితే, తాజా సమాచారం ప్రకారం, ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు.

మాలేగావ్ బాంబు పేలుళ్లు కాంగ్రెస్ కుట్రనే..: మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ సంచలనం

మాలేగావ్ పేలుళ్ల కేసులో నిర్దోషిగా విడుదలైన మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ భోపాల్‌లో అడుగు పెట్టగానే కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. తనపై కేసు కాంగ్రెస్ కుట్ర అని, ఆ పార్టీపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువులను వేధించిందని ఆరోపించారు. తొమ్మిదేళ్లు జైలు జీవితం గడిపిన ఆమె.. తన ఆరోగ్య సమస్యలకు పోలీసుల చిత్రహింసలే కారణమని అన్నారు. ఈ పరిణామాలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

కూటమి 15 ఏళ్లు స్థిరంగా ఉండాలి: పవన్ కల్యాణ్

కూటమిలో ఉన్న మూడు పార్టీల్లోని నేతలు, కార్యకర్తలకు చిన్నచిన్న పొరపచ్చాలు ఉన్నా.. మీ స్ధాయిలోనే పరిష్కరించుకొని ముందుకెళ్లాలని పవన్ కల్యాణ్ సూచించారు. మన కూటమి ఐక్యతను దెబ్బతీయడానికి వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారనిని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అభివృద్ధిలో వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్ తిరిగి ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలని ఆకాంక్షించారు. కనీసం 15 సంవత్సరాలు ఈ కూటమి చాలా బలంగా ఉండాలన్నారు.

ప్రతి అసెంబ్లీ నుంచి 20 నుంచి 30 వేల ఓట్లు మాయం : తేజస్వి యాదవ్‌

బీహార్‌ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అత్యవసరంగా ఓటర్ల జాబితాను సవరించింది. ఈ సవరించిన జాబితాను శుక్రవారం విడుదల చేసింది. దాదాపుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 20 నుంచి 30 వేల మంది ఓటర్ల పేర్లను తొలగించారని తేజస్వి చెప్పారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది ఓట్లు మాయమయ్యాయని తెలిపారు. ఈ సంఖ్య బీహార్‌ మొత్తం ఓటర్లలో 8.5 శాతమని అన్నారు.

పాలించే సిఎం కావాలి…. టూరిస్ట్ సిఎం వద్దు: కెటిఆర్

హస్తిన యాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్ధశతకం సాధించారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శలు గుప్పించారు. శనివారం కెటిఆర్ తన ట్విటర్ లో పోస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా ఫ్లైట్ బుకింగ్స్‌తో నడిపిస్తున్నారని, ఈయన ఢిల్లీ యాత్రలకు తెలంగాణకు ఏ సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ పాలన చేపట్టాక రేవంత్ చేసిన మూడు పనులు ఉన్నాయని, మొదటి పని ఫ్లైటు టికెట్ బుక్ చేయడమని, రెండో పని ఢిల్లీకి పోవడమని, మూడో పని ఖాళీ […]

థర్డ్‌ ఫ్రంట్‌కు సిద్ధమవుతున్న అసదుద్దీన్‌ ఒవైసీ..

బీహార్‌లో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) కూటమి ఇండియా బ్లాక్, నితీష్ కుమార్ నేతృత్వంలోని NDA మధ్య ఉంది. బీహార్ AIMIM అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ NDA కి వ్యతిరేకంగా కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఇండియా బ్లాక్‌కు ప్రతిపాదించారు. AIMIM 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయగలదని, NDA, మహా కూటమి రెండింటినీ సవాలు చేయగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన ఎంపికను అందించడానికి అసవరమైతే మూడవ […]

జనాలు మీ తోకలు కట్‌ చేయకుండా చూసుకోండి..అంబటి రాంబాబు

164 సీట్లు తెచ్చుకుని మంచి పాలన చేయాల్సిన మీరు.. ఇంకా జగన్‌ నామ జపం చేస్తున్నారని విమర్శించారు. జగన్‌ పర్యటనల సమయంలో జనం వచ్చిన విజువల్స్‌ చూపించాల్సిన అవసరం లేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. జనం రాకపోతే అసలు లాఠీచార్జ్‌ ఎందుకు చేశారో హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వాళ్లు ఎంత కట్టడి చేస్తే అంత జనం వస్తున్నారని తెలిపారు. చంద్రబాబు మా తోకలు కట్‌ చేయడం కాదు.. మా తోకలు జనం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON