బీహార్‌లో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) కూటమి ఇండియా బ్లాక్, నితీష్ కుమార్ నేతృత్వంలోని NDA మధ్య ఉంది. బీహార్ AIMIM అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ NDA కి వ్యతిరేకంగా కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఇండియా బ్లాక్‌కు ప్రతిపాదించారు. AIMIM 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయగలదని, NDA, మహా కూటమి రెండింటినీ సవాలు చేయగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన ఎంపికను అందించడానికి అసవరమైతే మూడవ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని అన్నారు

