loader

ప్ర‌శ్న‌లు వేయ‌డం, ప్రభుత్వాన్ని నిల‌దీయ‌డం ప్ర‌తిప‌క్ష నేత విధి

“నిజమైన భారతీయుడెవరో తేల్చేది జడ్జీలు కాదు, అది ప్రజల హక్కు” అని అన్నారు. సుప్రీంకోర్టు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆమె ఈ మాటలు చెప్పారు ఇవాళ పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో అడిగిన ఓ ప్ర‌శ్న‌కు ఆమె బదులిస్తూ రాహుల్‌ను స‌మ‌ర్ధించారు. ప్ర‌శ్న‌లు వేయ‌డం, ప్రభుత్వాన్ని నిల‌దీయ‌డం ప్ర‌తిప‌క్ష నేత విధి అని న్యాయ వ్య‌వ‌స్థ ప‌ట్ల పూర్తి గౌర‌వం ఉంద‌ని, కానీ నిజ‌మైన భార‌తీయుడిని తేల్చేది జ‌డ్జీలు కాదు అని ప్రియాంకా గాంధీ అన్నారు.

చీల్చి చెండాడుతాం.. కాంగ్రెస్‌, బీజేపీల‌పై హ‌రీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రాష్ట్రంలో 20 నెలలుగా ప్రజా సమస్యలు పక్కనపెట్టి కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకే పరిమితమైందని ఆరోపించారు. హరీశ్‌రావు మరో కీలక ఆరోపణ చేశారు. ఎన్డీఎస్ఏ రిపోర్టుల విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరి చూపుతోందని వ్యాఖ్యానించారు. “గోదావరి మీద పోలవరం ప్రాజెక్ట్‌ మూడు సార్లు కూలిపోయింది కానీ ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇవ్వలేదు. మేడిగడ్డపై మాత్రం రాష్ట్రం అడగకముందే రిపోర్టు ఇస్తూ బీజేపీ రాజకీయాలు ఆడుతోంది” అని ధ్వజమెత్తారు.

కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసేందుకు ఢిల్లీ కి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు

భారత ఎన్నికల కమిషన్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకులను ఢిల్లీ కి ఆహ్వానించింది. ఈ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. దేశంలో ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి, మరియు పార్టీలు ఈసీకి సమర్పించిన వివిధ అభ్యర్థనలపై చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు రాజ్యసభ ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, వినోద్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ […]

36 సార్లు కేసీఆర్‌ పేరు ఉన్నంత మాత్రాన తప్పు చేసినట్లు కాదు

డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే కాళేశ్వరం నివేదిక పేరుతో రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అది కాంగ్రెస్‌ పార్టీ కమిషన్‌ అని, తాము ధర్నా చౌక్‌ వేదికగానే ఎత్తిచూపామని అన్నారు. పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికలో కేసీఆర్‌ పేరును 36 సార్లు ప్రస్తావించినంత మాత్రాన ఆయన తప్పు చేసినట్లు కాదని ఆమె స్పష్టం చేశారు. నిపుణుల కమిటీ సూచనల మేరకే నిర్మాణాలు జరిగాయని తెలిపారు.

కెసిఆర్ అవకతవకలకు పాల్పడ్డారు- ఉత్తమ్

“కేసీఆర్ డిజైన్లు మార్చడం వల్లే ప్రజాధనం దుర్వినియోగమైనట్లు ఘోష్ కమిషన్ తేల్చిందని” ఉత్తమ్ సంచలన ఆరోపణలు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదుల్లోనే సమస్య ఉందని కమిషన్ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా, రుణాలు తీసుకోవడంలోనూ కేసీఆర్ అవకతవకలకు పాల్పడ్డారని ఉత్తమ్ ఆరోపించారు. ఈ నివేదికలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తావన తొమ్మిది సార్లు ఉందని ఆయన వెల్లడించారు.

బిఆర్ఎస్ కు గువ్వల బాలరాజు రాజీనామా

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అచ్చంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావుకు పంపారు. బాలరాజు రాజీనామా తెలంగాణలో రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. ఆయన బీజేపీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

లోకేష్ పిల్లవాడు- బనకచర్లను అడ్డుకుని తీరుతాం- కోమటిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌ను “చిన్నపిల్లోడు”, “అవగాహన లేనివాడు” అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. లోకేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు తనకు ఆసక్తి లేదని.. లోకేష్ అలా మాట్లాడినట్లుగా తెలియగానే తనకు నవ్వు వచ్చిందని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో కూడా పోరాడతామని కోమటిరెడ్డి తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో “చాప్టర్ క్లోజ్” అని, దీనిని అడ్డుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

ఉపాసనకు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు

మెగా ఇంటి కోడలు.. రాం చరణ్ సతీమణికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్ తనకు అప్పగించిన బాధ్యతల పట్ల ఉపాసన సంతోషం వ్యక్తం చేసారు. సీఎం కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో క్రీడా రంగాన్ని అభివృద్ధి లక్ష్యంతో కాంగ్రెస్ సర్కార్ ‘స్పోర్ట్స్ పాలసీ 2025’ను తీసుకొచ్చిన రేవంత్ ప్రభుత్వం తాజాగా ‘స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ’ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు చైర్మన్‌గా సంజీవ్ గోయెంకాను నియమించింది. మెగా కోడలు ఉపాసన కామినేనిని […]

రోజా అవినీతిపై తీవ్ర విమర్శలు చేసిన భాను ప్రకాశ్

భాను ప్రకాశ్ చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన వ్యాఖ్యల ప్రకారం రోజా కుటుంబం ప్రభుత్వ అధికారాన్ని వాడుకొని బియ్యం మరియు ఇసుక అక్రమ రవాణాలో పాల్గొనిందని, గంజాయి దందా లోనూ వారి ప్రమేయం ఉన్నట్లు తనకు సమాచారం ఉందని, నిజం తేలితే “మెడ పట్టుకుని లాక్కెళ్లి జైలుకు వెళతారు” అని తీవ్రంగా హెచ్చరించారు. తమపై ఎలాంటి బెదిరింపులు వచ్చినా తాము వెనక్కి తగ్గబోమని భాను ప్రకాశ్ స్పష్టం చేశారు.

గుంటూరు టీడీపీ ఎమ్మెల్యే వీడియో కాల్.. సోషల్ మీడియాలో వైరల్,

గుం­టూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే మహమ్మద్‌ నసీర్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఓ మహిళతో మా­ట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ఒక మహి­ళతో ఎమ్మెల్యేతో వీడియోలో సైగలు చేస్తూ కనిపించారు. ఎమ్మెల్యే మహమ్మద్‌ నసీర్‌ తన కార్యాలయంలో ఉండగా.. సదరు మహిళ రైలులో ప్రయాణిస్తుండగా వీడియో కాల్‌చేసి మా­ట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది నసీర్ వీడియో కాల్‌లో ఏం మాట్లాడారన్నది క్లారిటీ లేదు. ఆమె గతంలో టీడీపీ కార్పొ­రేటర్‌ పదవికి పోటీ చేసిన మహిళ అంటూ ప్రచారం జరుగుతోంది.. […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON