ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌ను “చిన్నపిల్లోడు”, “అవగాహన లేనివాడు” అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. లోకేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు తనకు ఆసక్తి లేదని.. లోకేష్ అలా మాట్లాడినట్లుగా తెలియగానే తనకు నవ్వు వచ్చిందని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో కూడా పోరాడతామని కోమటిరెడ్డి తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో “చాప్టర్ క్లోజ్” అని, దీనిని అడ్డుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

